KCR: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు రెండేళ్లలో రూపాయి కేటాయించలేదని.. తట్టెడు మట్టి తీయలేదని… కేంద్రం ప్రాజెక్టు డిపిఆర్(DPR) పంపిస్తే స్పందించడం లేదని.. చివరకు 45 టీఎంసీలు కేటాయించాలని ఇరిగేషన్ మంత్రి లేఖ రాయడం.. వెనుక ఏం కుట్ర ఉంది.. ఎవరున్నారు.. ఇది రాష్ట్ర ప్రభుత్వమా?.. అసలు ప్రభుత్వం ఉందా..? రియల్ ఎస్టేట్ దందా?.. రెండేళ్ల నుంచి మౌనంగా ఉన్నానని.. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో నేనూ బయల్దేరానని.. అటు కేంద్రాన్ని, ఇటు రాష్ట్రాన్ని ఎండగడతానని గులాబీ అధినేత, సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో గ్రామగ్రామాన ప్రజా ఉద్యమాలు చేస్తాం.. బహిరంగ సభలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. వాటికి తానే స్వయంగా హాజరవుతానని తెలిపారు. ప్రజాక్షేత్రంలో నిష్క్రియ ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ తీరును ఎండగడతామని వెల్లడించారు.
గోదావరి మీద చంద్రబాబు దోపిడీ
తెలంగాణ తెచ్చిన పార్టీగా, ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యల పోరాడుతామని వెల్లడించారు. ఇవాల్టి దాకా వేరు కథ.. రేపట్నుంచి వేరేనని.. తోలుతీస్తామని హెచ్చరించారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ తెచ్చిన పార్టీగా, ప్రధాన ప్రతిపక్షంగా తమపై రెండు బాధ్యతలు ఉన్నాయని తెలిపారు. మేం అడ్డం పొడువు మాట్లాడి, కారుకూతలు కూసి ఏదో చేస్తామంటే ఇక నడవదని అన్నారు. ప్రజల్లో ఎక్కడికక్కడ నిలబెడతామని అన్నారు. తొందరపడి ఏ పని చేయట్లేదని.. అక్కసుతో మాట్లాడట్లేదని తెలిపారు. అనేక రకాల సమస్యలపై బీఆర్‌ఎస్ పార్టీ పోరాడుతూనే ఉందని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు రాష్ట్రం మొత్తానికే ముప్పు వచ్చే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అటు గోదావరి మీద చంద్రబాబు దోపిడీ చేస్తుంటే దాని మీద చప్పుడు లేదు.. ఇటు కృష్ణాలో పాలమూరు ఎత్తిపోతల మీద ఘోరం జరుగుతుంటే దీనిపైనా చప్పుడు లేదు.. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎవరి ప్రయోజనాల కోసం ఉన్నట్లు అని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని నిలదీశా
అంతర్జాతీయంగా అది సక్సెస్..
ప్రజలు ఎక్కడ చూసినా బీఆర్‌ఎస్ రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. తమ చర్యలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో నమ్మకం కోల్పోవడమే దీనికి కారణమని చెప్పారు. రియల్ ఎస్టేట్ మొత్తం బ్రోకర్ దందానే అని ప్రశ్నించారు. నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో కలరా వ్యాధి వ్యాపించి ప్రజలు చనిపోతుండడంతో.. అప్పుడు ఎక్కడికక్కడ లోకలైజ్‌డ్ ప్రొడక్షన్ ఉండాలని ఐడీపీఎల్ అని పెట్టారు. వాటిని కొన్ని కీలక రాష్ట్రాల్లో పెట్టారు. అందులో ఒకటి హైదరాబాద్‌కు వచ్చింది. ఐడీపీఎల్ పుణ్యమా అని కొంతమంది నేర్చుకుని బయటకొచ్చి స్వయంగా కంపెనీలు పెట్టి విస్తరించారు. వాటిలో అంజిరెడ్డి ఒకరు.. ఆయన దగ్గర పనిచేసిన వాళ్లు కూడా బయటకొచ్చి వాళ్లు కూడా కంపెనీలు పెట్టారు. ఇలా హైదరాబాద్ నగరం మెడికల్, ఫార్మా హబ్‌గా మారింది. అలా ఫార్మా ఎకో హైదరాబాద్‌లో బిల్డ్ అవ్వడం వల్ల ఇబ్బడిముబ్బడిగా కంపెనీలు హైదరాబాద్‌కు వచ్చాయి. ఇప్పుడు మూడో వంతు ప్రపంచానికి జీనోమ్ వ్యాలీ(Genome Valley) నుంచే వ్యాక్సిన్ సరఫరా అవుతుందని తెలిపారు.నిజాం కాలం నుంచి ఫార్మా కంపెనీలు వస్తూ వస్తూ.. హైదరాబాద్(Hyderabada) ఫార్మారంగానికి బెస్ట్ డెస్టినేషన్‌గా మారిందని కేసీఆర్(KCR) తెలిపారు. అయితే ఆ కంపెనీల్లోని రసాయన కారకాలు ఇబ్బందిని కలిగిస్తాయి. దీని నుంచి హైదరాబాద్‌ను బయటపడాలి.. అలా అని ఫార్మాను వదులుకోలేం.. అందుకే నాలుగు టీమ్‌లను ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయ మార్గాలను వెతికామని తెలిపారు. ‘ మందులు తయారుచేసే క్రమంలో కొంత వేస్టేజి ఉంటుంది.. దాన్ని ఎలా మేనేజ్ చేయాలంటే కొంత తెలివి కావాలి. ఒక ఫార్మా కంపెనీ ముందు నుంచి వెళ్తే మన దగ్గర వాసన వస్తది.. అదే వేరే దేశంలో అయితే అలా రాదు.. వాటి గురించి తెలుసుకోవడానికి ప్రపంచ దేశాలు తిప్పించాం. ప్రపంచవ్యాప్తంగా తిప్పి ఒక ఆలోచనకు వచ్చాం. ఈ క్రమంలోనే జడ్‌ఎల్‌బీ అని వచ్చింది.. అంటే జీరో లిక్విడ్ బేస్. వ్యర్థాలను జీరో లిక్విడ్ చేస్తారు. దాని వల్ల కాలుష్యం రాదు. అంతర్జాతీయంగా అది సక్సెస్ అయ్యింది. అయితే మనం ఆ సిస్టమ్ పెట్టుకోవాలని.. అలాగే ఫార్మా యూనివర్సిటీ పెట్టుకోవాలని అనుకున్నాం. ‘ అని వివరించారు.
Also Read: Lionel Messi Payment: భారత్‌లో పర్యటించినందుకు మెస్సీ పేమెంట్ ఎంతో తెలుసా?
హైదరాబాద్‌లోని ఫార్మా కంపెనీలు
ఈ ఆలోచనతో హైదరాబాద్‌లోని ఫార్మా రంగానికి చెందిన వ్యాపారవేత్తలను నేనే స్వయంగా హెలికాప్టర్‌లో తీసుకెళ్లి ముచ్చర్లలోని స్థలాన్ని చూపించానని తెలిపారు. వాళ్లు కూడా ఆ స్థలం సెట్ అవుతుందని చెప్పడంతో ఫార్మా సిటీ నిర్మాణానికి రూపకల్పన చేశామన్నారు. దీనికోసం ఐదారు సంవత్సరాలు కష్టపడి, రైతాంగంతో ఘర్షణ పడకుండా 14 వేల ఎకరాలను సమీకరించామని తెలిపారు. 20 వేల ఎకరాలు లక్ష్యంగా పెట్టుకుంటే తాము అధికారంలో ఉన్న సమయంలో 14 వేల ఎకరాలను సమీకరించగలిగామని పేర్కొన్నారు. జీడిమెట్ల, చర్లపల్లిలోని ఫార్మా కంపెనీలను కూడా సంప్రదిస్తే ప్రత్యామ్నయ స్థలం చూపిస్తే తరలివెళ్లేందుకు సిద్ధమేనని సుముఖత వ్యక్తం చేశారని తెలిపారు. కామన్ అఫ్లియెటెడ్ ప్లాంట్స్ పెట్టి.. వ్యర్థాలను ఇష్టమొచ్చినట్లు వదిలేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిఘా ఉండేలా పెట్టుకున్నదే ఫార్మా సిటీ అని చెప్పారు. దానికి ఎన్విరాన్‌మెంటల్ క్లియరెన్స్ కూడా వచ్చిందని అన్నారు. అలా హైదరాబాద్‌లోని ఫార్మా కంపెనీలు మొత్తం ఒకే దగ్గరికి తీసుకెళ్లి ఫార్మా సిటీ కట్టాలని ప్లాన్ చేశామని తెలిపారు. దాని పక్కనే మెడికల్ కాలేజీ కూడా మంజూరు చేశామని చెప్పారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్
సిటీ మొత్తం గబ్బు
ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. నీ ఫ్యూచర్ సిటీ.. తొక్కలో సిటీ ఎవడికి కావాలన్నారు. హైదరాబాద్‌ను నువ్వేమైనా పెంచావా అని నిలదీశారు. 400 ఏండ్ల చరిత్రతో హైదరాబాద్(Hyderabad) పెద్ద సిటీ అయ్యిందని తెలిపారు. ఇలా అన్ని రాష్ట్రాలకు పెద్ద సిటీలు తయారవవ్వని తెలిపారు. బెంగాల్‌కు కోల్‌కతా ఉంది.. మహారాష్ట్రకు ముంబై ఉంది.. మనకు హైదరాబాద్ ఉంది.. కర్ణాటకకు బెంగళూరు ఉంది.. తమిళనాడుకు చెన్నై ఉంది.. ఢిల్లీ ఇవి కాకుండా వేరే రాష్ట్రాలకు లేవు అని గుర్తుచేశారు. అంత చరిత్ర ఉన్న హైదరాబాద్ మహానగరాన్ని దృష్టిలో పెట్టుకుని ఫార్మా సిటీ తీసుకొచ్చామని తెలిపారు. ఇవాళ సిటీ మొత్తం గబ్బు లేచిపోవాలి.. నువ్వేమో ఫ్యూచర్ సిటీ.. తొక్కలో సిటీ అని దిక్కుమాలిన పాలసీలు తీసుకొస్తూ.. రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా చేస్తున్నావని మండిపడ్డారు. టిఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఒక రూపాయి రెవెన్యూ చార్జీలు పెంచలేదని స్పష్టం చేశారు. నాలా ఫీజులు తొలగించామన్నారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఘనంగా పెంచామని.. భూముల ధరలు పెరిగాయని ప్రజల ఆస్తులు పెంచామని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో నేడు ధరలు కుప్పకూలాయని.. భూములను కొనే దిక
చంద్రబాబు ఏపీలో 20 లక్షల కోట్లు బిజినెస్..
రెండున్నర లక్షల కోట్లు మాత్రమే కేసీఆర్ అప్పులు చేశారని కాదు కాంగ్రెస్ ప్రభుత్వానికి అక్షింతలు వేసిందన్నారు.. ఇష్టం వచ్చినట్లు నన్ను తిట్టడానికి కాంగ్రెస్ నేతల నోరు మొక్కాలి అన్నారు. కెసిఆర్ చచ్చిపో అని మాట్లాడుతున్నారని ఇంత అకస్ ఉంటుందా అని.. ఇష్టం వచ్చినట్టు మాటలు.. దుర్మార్గం ప్రచారాలను మండిపడ్డారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై రాజు పడబోమని స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నిద్రపోనివ్వమని.. టిఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసమని.. హక్కులపై మౌనం పాటించబోమని వెల్లడించారు. మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) మొరగడానికి ప్రెస్ మీట్ అని తీయబడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం బిజినెస్ మీటింగ్లు పెట్టి కుదుర్చుకుంటుందని.. దీనికి చంద్రబాబు(Chendhrababu) ఆధ్యుడని దుయపడ్డారు. గ్లోబల్ సమ్మిట్(Global Summit) లో 5 లక్షల కోట్లు ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పారని.. మోసాలతో ఎంతమందిని వంచిస్తారని నిలదీశారు. టిఆర్ఎస్ ప్రభుత్వంలో బిజినెస్ మీట్లు.. కాంక్లేవులు పెట్టలేదని.. బెస్ట్ పాలసీలు పెడితే పెట్టుబడులు వస్తాయన్నారు. చంద్రబాబు ఏపీలో 20 లక్షల కోట్లు బిజినెస్ మీటింగ్లతో వచ్చాయని చెప్పాడని.. అసలు వైజాగ్ లో ఎం ఓ యు చేసింది ఎవరంటే వంట మనుషులని ఎద్దేవ వేశారు.
Also Read: Rail Ticket Hike: బిగ్ బ్రేకింగ్.. టికెట్ రేట్లు పెంచిన రైల్వే.. ఎంత పెరిగాయో తెలుసా?
ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలివిలేదా..
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెలంగాణ కు శని అని మండిపడ్డారు. ప్రతి దాన్ని వ్యతిరేకిస్తుందని దయమెత్తారు. బిజెపికి చంద్రబాబు చేరారని.. తెలంగాణ చేపడుతున్న ప్రతిదాన్ని అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. పాలమూరు ప్రాజెక్టుకు ఆరు అనుమతులు వచ్చాయని.. అందులో కీలకమైనది ఎన్విరాన్మెంట్ అను అది కూడా వచ్చిందని తెలిపారు. ప్రాజెక్టు డి పి ఆర్ ను బిజెపి వెనక్కి పంపిందని మండిపడ్డారు. డిపిఆర్ వెనక్కి పంపితే రాష్ట్రం ఎంత హడావుడి చేయాలని ఎందుకు చేయడం లేదని నిలదీశారు. బీఆర్‌ఎస్ రాకముందే యూరియా కోసం చెప్పుల లైన్లు ఉండేవని.. ఇప్పుడు మళ్లీ బీఆర్‌ఎస్ పోగానే చెప్పుల లైన్లు దర్శనమిస్తున్నాయని అన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి యూరియా సరఫరా చేసే తెలివితేటలు కూడా లేవని మండిపడ్డారు. ఎరువుల బస్తాకు యాప్ ఎందుకు అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌కు ఓటు వేసే ఉద్దేశం ఉన్న ప్రజలను పచ్చి అబద్ధాలు చెప్పి, మోసం చెప్పి, మాయమాటలు చెప్పారని మండిపడ్డారు. అర్రాస్ పాటలు పాడినట్లుగా.. కేసీఆర్ రైతుబంధు 10 వేలు ఇస్తే.. మేం 15వేలు ఇస్తాం.. మహిళలకు 2500 ఇస్తాం.. కేసీఆర్ కల్యాణలక్ష్మికి లక్ష ఇస్తడు.. మేం తులం బంగారం కలిపి ఇస్తాం.. పెన్షన్లు నవంబర్‌లో తీసుకోకండి.. డిసెంబర్‌లో తీసుకుంటే 4వేలు వస్తాయి. 2లక్షల రుణమాఫీ అని నరికిండ్రు.. ఇలా ప్రజలను టెంప్ట్ చేశారు. అన్ని వంద రోజుల్లోనే ఇస్తామని ఇంటింటికి కార్డులు పంచిండ్రు.. మొత్తానికి శఠగోపం పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ యాప్‌లో ఏముంటందంటే..
ప్రతి ధాన్యానికి బోనస్ ఇస్తామని చాంతాడు అంత లిస్ట్ పెట్టారు.. కానీ దేనికి దిక్కులేదు. ఇప్పుడు వడ్లు కొంటలేరని కేసీఆర్ తెలిపారు. దోపిడీకి గురై రైతులు ప్రైవేటుకు అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా సప్లై చేసే తెలివితేటలు లేవని మండిపడ్డారు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులు గ్రామాల్లో ఆటో రిక్షావోనికి పైసలిస్తే పది బస్తాలు తెచ్చి పొలం దగ్గర పడేసి వెళ్తుండే.. కానీ ఇవాళ రైతులు రోజుల తరబడి, చెప్పులు క్యూలో పెట్టి ఎదురుచూస్తున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్ లేకముందు చెప్పుల లైన్లు ఉండే.. బీఆర్‌ఎస్ వచ్చినంక చెప్పుల లైన్లు మాయమైనయి.. ఇప్పుడు మళ్ల కాంగ్రెస్ రాగానే చెప్పుల లైన్లు స్టార్ట్ అయినయ్.. అని అన్నారు. యూరియా సరఫరా కోసం ఇప్పుడు యాప్ తెచ్చిండ్రు.. అది కూడా పనిచేస్తలేదని ఎద్దేవా చేశారు. ఎరువు బస్తాకు యాప్ ఎందుకు అని ప్రశ్నించారు. ‘ ఆ యాప్‌లో ఏముంటందంటే.. నాకు సపోజ్ మూడెకరాలు ఉంది. ఎకరానికి రెండు బస్తాల చొప్పున మూడుసార్లు ఇస్తారంట.. అంటే నేను మూడుసార్లు వెళ్లాలి.. ఎక్కడికి వెళ్లాలో కూడా తెలియదు.’ అని వ్యాఖ్యానించారు.
టెంప్ట్ అయి ఓటు వేశారు
అర్రాస్ పాటలు పాడి రెండు సార్లు రైతుబంధు ఎగ్గొట్టిండ్రు.. రెండు నెలల పెన్షన్లు ఎగ్గొట్టిండ్రు.. చాలా భయంకరమైన పరిస్థితులు తీసుకొచ్చారని కేసీఆర్ మండిపడ్డారు. 2014లో తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.200 ఉన్న పెన్షన్‌ను ఒకేసారి వెయ్యికి పెంచానని గుర్తుచేశారు. రెండోసారి గెలిపిస్తే రెండు వేలు ఇస్తామని హామీ ఇచ్చానని.. అధికారంలోకి వచ్చిన నెలలోనే రెండు వేలు ఇచ్చానని తెలిపారు. అలాగే కేసీఆర్ రెండు అంటే వీడు నాలుగు అంటున్నాడు కాబట్టి ఇస్తాడేమో అని అనుకున్నారు. టెంప్ట్ అయి ఓటు వేశారు.. ఇప్పుడు తలలు బాదుకుంటున్నారని.. భయంకరంగా తిడుతున్నరని తెలిపారు. ప్రజలంతా బీఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. నిన్న హైదరాబాద్‌కు వస్తుండగా పది చోట్ల ప్రజలు ఇదే విషయాన్ని చెప్పారని తెలిపారు. కాంగ్రెస్ చర్యలతో ప్రజలు నమ్మకం కోల్పోతున్నారనడానికి ఇది సంకేతమని చెప్పారు.
Also Read: Ambati Rambabu: మేము పీకలేకపోయాం.. మీరు వచ్చి పీకండి.. పవన్‌కి అంబటి చురకలు!
ఆంధ్రప్రదేశ్ ఏర్పాటే తెలంగాణకు శాపం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటే తెలంగాణ పాలిట పెను శాపంగా మారిందని అన్నారు. ముఖ్యంగా సమైక్య పాలనలో మహబూబ్‌నగర్ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారు.కృష్ణా జిల్లా ప్రవేశించేదే మహబూబ్‌నగర్ జిల్లా. 308 కి.మీ. కంటే ఎక్కువ పారేది కూడా మహబూబ్‌నగర్ జిల్లాలోనే. అయినా కూడా అప్పటికి 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ కానీ.. సుమారు 20 ఏండ్లు పాలించిన టీడీపీ కానీ.. పాలమూరు తిరిగి కోలుకోలేని దెబ్బ కొట్టాయి.’ అని కేసీఆర్ తెలిపారు. ‘ అప్పర్ కృష్ణా, బీమా, తుంగభద్ర ఎడమ కాల్వ ప్రాజెక్టుల ద్వారా ఆనాటికి 174 టీఎంసీలు పాలమూరు – రంగారెడ్డికి రావాల్సి ఉండేది. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటే తెలంగాణ పాలిట పెను శాపంగా పరిణమించింది. ముఖ్యంగా మహబూబ్‌నగర్ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగింది. ప్రతిపాదించబడిన ప్రాజెక్టులను మార్చకూడదు.. వాటిని కొనసాగించాలని ఎస్‌ఆర్‌సీ యాక్ట్ చెబుతుంది.. కానీ వాటిని కాదని మొత్తం క్యాన్సిల్ చేశారు. గోదావరి మీద దేవనూరు ప్రాజెక్టు, ఇచ్చంపల్లి రకరకాల ప్రాజెక్టులను అబాండ్ చేశారు. అందులో మహబూబ్‌నగర్‌కు తీవ్ర అన్యాయం జరిగిందని ధ్వజమెత్తారు.
పాలమూరు ఎత్తిపోతలు కొత్త స్కీం కాదు
‘ ఇవాళ మహబూబ్‌నగర్‌కు ఇచ్చే పాలమూరు ఎత్తిపోతలు కొత్త స్కీం కాదు.. గతంలోనే 174 టీఎంసీలకు రూపకల్పన జరిగింది. దీనిపై ఉద్యమం సమయంలోనే బ్రిజేష్ ట్రిబ్యునల్‌కు వెళ్లామని గుర్తుచేశారు. కానీ రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరిస్తుంది కాబట్టి.. అప్పుడు మా వినతిని తిరస్కరించారు. సమైక్య పాలనలో పాలమూరుకు గంటెడు నీళ్లు అడిగినోళ్లు లేరు. అనంతరం బచావత్ సుమోటోగా 17 టీఎంసీలు జూరాలకు మంజూరు చేశారు. సాంకేతిక కారణాలు, ఇతరత్రా చూపించి జూరాల ఇక్కడి నుంచి ఎత్తగొట్టద్దు.. వేరే దగ్గర కట్టవద్దని ఒక కండిషన్ పెట్టారు. 1974-78 మధ్య కేటాయిస్తే దాన్ని పట్టించుకున్న వాళ్లెవరూ లేరు. అంజయ్య ముఖ్యమంత్రి అయ్యాక దానికి ఫౌండేషన్ స్టోన్ వేశారు. తెలంగాణ ప్రాజెక్టు కాబట్టి దాన్ని పట్టించుకోలేదు. ఒక అనాథలా బ్యారేజి వరకు కట్టేశారు. దానికి కాల్వలు లేవు.. నీళ్లు రావు.. పొలాలు పారయి.. కృష్ణా నది నీళ్లు వస్తాయి.. గేట్ల ద్వారా పోతాయి. 2001లో గులాబీ జెండా ఎగిరే దాకా ఇదే పరిస్థితి ఉంది.’ అని కేసీఆర్ వివరించారు.
నేను నిలదీస్తే చంద్రబాబు జూరాల కట్టాడు
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహబూబ్‌నగర్ జిల్లాను దత్తత తీసుకున్నాడు.. దాన్ని అభివృద్ధి చేస్తానని మాటలు చెప్పి, ఇష్టమొచ్చినన్ని పునాది రాళ్లు వేశారు. ఉద్యమ సమయంలో ఈ పునాది రాళ్లపై మాట్లాడాను. ఈ పునాది రాళ్లు అన్ని ఎందుకు.. పట్టుకుని ఏడ్చేందుకా? వాటన్నింటినీ పట్టుకెళ్లి కృష్ణానదిలో అడ్డం వేస్తే చెక్‌డ్యామ్ అయినా అవుతదని చెప్పేవాడిని. ఒక్క డ్రాప్ వాటర్ కూడా పొలాలు పారడానికి రాలేదు. దీంతో పాలమూరు జిల్లాలో ప్రతి నియోజకవర్గం నుంచి ముంబైకి పొట్టచేత పట్టుకుని వలసలు పోయారు. దీనిపై జిల్లాకు చెందిన అనేక కవులు పాటలు రాశారు. రెండు ప్రాజెక్టులు పెడితే రెండింటినీ నిర్లక్ష్యం చేశారు. అప్పట్లో చంద్రబాబు ఒక స్లోగన్ ఇచ్చారు.. సమైక్య రాష్ట్రంలోనే సమగ్ర అభివృద్ధి. జూరాల కొంత ముంపు ప్రాంతం కర్ణాటకలో ఉంటది. రూ.13 కోట్లు వాళ్లకు పరిహారం కట్టాల్సి ఉంటుంది. కానీ చంద్రబాబు కట్టడు. దీనిపై మహబూబ్‌నగర్ టౌన్‌లో జరిగిన ప్రథమ మహాసభలో నిలదీశా. అప్పుడు మోకాళ్ల మీద పరిగెత్తి జూరాల ప్రాజెక్టు కట్టాడు. ఆ తర్వాత తెలుగు దేశం ఎమ్మెల్యేనే ఆర్‌డీఎస్ కెనాల్‌ను బాంబులు పెట్టి పేల్చేసిండు.’ అని కేసీఆర్ తెలిపారు.
Also Read: Christmas Celebrations: ఇతర మతాలను కించపరిస్తే చట్టపరంగా శిక్ష తప్పదు: సీఎం రేవంత్ రెడ్డి

