KA Paul: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLV Kavitha) గత శాసన మండలి సమావేశంలో కన్నీళ్లు పెట్టుకోడం మనందరికి తెలిసిన విషయమే.. అయితే కవిత చేసిన వ్యాఖ్యలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్(KA Paul) తనదైన శైలిలో కవిత పై స్పందించారు. కవిత మాట్లాడిన భావోద్వేగ అంశాలపై ఆయన స్పందించారు. కవిత ఒక ప్యాకేజీ స్టార్ అంటూ సంచలన వ్యాక్యలు చేశారు. శాసన మండలిలో ఎందుకు ఏడ్చిందంటే! ప్యాకేజికోసమే అని కెఏ పాల్ అన్నారు. తన రాజకీయ ఎత్తుగడకు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తుందని అన్నారు. గతంలో సీబీఐ కేసులు లిక్కర్ కేసులను కప్పిపుచ్చుకోవడం కోసం కవిత డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని నిజాలేంటో ప్రజలకు తెలుసని అన్నారు. ఎమ్మెల్సీ కవితపై గతంలోను కేఏ పాల్ తీవ్ర విమర్షలు చేశారు.
Also Read: BJP – Congress: రాజకీయాల్లో సంచలనం.. ఒక్కటైన కాంగ్రెస్, బీజేపీ.. కమలానికే అధికార పీఠం
4 నెలలుగా ఆమోదించలేదన్న కవిత
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శాసనమండలిలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. బీఆర్ఎస్ పార్టీలో తనకు ఎదురైన చేదు అనుభవాలను సభలో చెప్పుకొని కన్నీటి పర్యంతమయ్యారు. రాష్ట్రం ఏర్పాటైన 8 నెలలకే తనపై కక్ష మెుదలైందన్న కవిత.. తనను జైల్లో పెట్టిన సమయంలోనూ పార్టీ అండగా నిలబడలేదని ఆరోపించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నానన్న ఆమె ఇక మీదట ఈ పదవిలో ఉండదలుచుకోలేదని ఆమే తేల్చి చెప్పారు. తన రాజీనామాను గత 4 నెలలుగా ఆమోదించలేదన్న కవిత.. అందుకే తాను ప్రత్యేక సమయం తీసుకొని సభలో మాట్లాడుతున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో తన దగ్గరకు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు రాలేదని కవిత తేల్చిచెప్పారు. శాసన మండలి ఛైర్మన్ తన రాజీనామాను అంగీకరించాలని విజ్ఞప్తి చేశారు.
Also Read: Couple Friendly: సంతోష్ శోభన్ ‘కపుల్ ఫ్రెండ్లీ’ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన నిర్మాతలు.. ఎప్పుడంటే?

