Hyderabad Water Board: జలమండలి ఇయర్ రౌండప్-2025
Hyderabad Water Board (imagecredit:twitter)
Telangana News, హైదరాబాద్

Hyderabad Water Board: జలమండలి ఇయర్ రౌండప్-2025.. సాధించిన విజయాలు పూర్తి వివరాలివే..!

Hyderabad Water Board: హైదరాబాద్ మహానగరంలోని కోటిన్న‌ర‌కు పైగా జనాభాకు తాగునీటి సరఫరాతో పాటు మురుగు నీటి నిర్వహణ బాధ్యతల్ని నిర్వహిస్తున్న జలమండలి వర్తమాన సంవత్సరంలో పలు కీలకమైన మార్పులను చేసుకుంది. ప్లాన్ ప్రకారం పలు విషయాల్లో అప్ డేట్ కూడా అయింది. పెరుగుతున్న నగర జనాభా అవసరాలకు అనుగుణంగా మెరుగైన సేవలను అందించడానికి తన పరిధిని మరింత విస్తరించుకుంటూ జీహెచ్ఎం(GHMC)సీతో పాటు ఔటర్ రింగు రోడ్డు(ORR) లోపలి మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామాలు, గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీలకు సైతం తాగునీరు అందిస్తుంది. ఇక మురుగు శుద్ధి నిర్వహణలోనూ అధునాతన సాంకేతికతను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ సమర్థవంతమైన సేవల్ని అందిస్తోంది. దీంతో పాటు వినియోగదారులకు పారదర్శకంగా సేవలు అందిస్తోంది. హైదరాబాద్ నగరానికి 20 టీఎంసీల అదనపు నీటిని తరలించడానికి, మూసీ పునరుజ్జీవనం కోసం జంట జలాశయాలను గోదావరి నీటితో నింపడానికి రూ. 7,360 కోట్ల వ్యయంతో గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్-2,3 ప్రాజెక్టు మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, నీటి శుద్ది కేంద్రాల ప‌నులను ప్రారంభిచటంతో పాటు శరవేగంగా పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. ప్రస్తుతం సాధించిన విజయాలతో పాటు భవిష్యత్తు లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని అధిగమించే దిశగా పయనిస్తోంది. మహా నగరంలో వంద శాతం మురుగు నీరు శుద్ధి చేసే లక్ష్యంతో చేపట్టిన ఎస్టీపీల ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అంబర్ పేట్ తో పాటు మరో 5 ఎస్టీపీలను మురుగు నీటి శుద్ధి కేంద్రాలను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమై అందుబాటులోకి వచ్చాయి. వీటితో పాటు ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 39 ప్రాంతాల్లో ఉన్న స్థానిక సంస్థల, గ్

గోదావరి ఫేజ్- 2,3 ప‌నులు షురూ..

రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత అభివృద్ధి కార్యక్రమాలను చేట్టింది. ప్రధానంగా ప్రజలకు అవసరమైన త్రాగునీటి సరఫరాలాంటి మౌలిక సదూపాయాలకు పెద్దపీట వేసింది. అందులో భాగంగా హైదరాబాద్ నగరానికి 20 టీఎంసీల అదనపు నీటిని తరలించడానికి, మూసీ పునరుజ్జీవనం కోసం జంటజలాశయాలను గోదావరినీటితో నింపడానికి రూ. 7,360 కోట్ల వ్యయంతో గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్-2,3 ప్రాజెక్టుకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ తాగునీటి అవసరాలకు అన్ని వనరుల నుంచి 580 ఎంజీడీల నుంచి 600 ఎంజీడీల నీరు సరఫరా చేస్తున్నారు. 2030వ సంవత్సరం వరకు నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని 300 ఎంజీడీల అదనపు జలాలను సరఫరా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గోదావరి నది నుంచి మొత్తం 30 టీఎంసీల నీరు వాడుకునే వెసులుబాటు ఉండటంతో అదనపు జలాల కోసం గోదావరి ప్రాజెక్టు ఫేజ్-2,3 లను రూపకల్పన చేసింది. 2027 సంవత్సరం వరకు హైదరాబాద్ నగర తాగునీటి డిమాండ్ 835 ఎంజీడీలకు పెరుగునున్నందున, 2047 నాటికి ఈ సంఖ్య 1114 ఎంజీడీలకు పెరగనున్నట్లు కూడా జలమండలి అంఛనాలేసింది.

Also Read: New Year Celebrations: నూతన సంవత్సర వేడుకల్లో హద్దుమీరొద్దు.. ఖమ్మం పోలీస్ కమిషనర్ వార్నింగ్

జంట జలాశయాల పునరుజ్జీవనం

గోదావరి డ్రికింగ్ వాటర్ సప్లై పథకం ఫేజ్-1 కింద నగర ప్రజల నీటి అవసరాల కోసం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి జలమండలి ఇప్పటికే 10 టీఎంసీల నీరు తరలిస్తోంది. తాజాగా పథకంలో రెండు దశల ద్వారా మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి మరో 20 టీఎంసీల నీరు వాడుకునే అవకాశం ఉంది. ఈ 20 టీఎంసీల్లో 17.5 టీఎంసీలు నగర ప్రజల తాగునీటి అవసరాలకు కాగా, మూసీ ప్రక్షాళనలో భాగంగా జంట జలాశయాలను పునరుజ్జీవనం చేసేందుకు మిగిలిన 2.5 టీఎంసీలను ఉపయోగించనున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల రెండు లాభాలున్నాయి. ఒకటి హైదరాబాద్ ప్రజల దాహార్తి తీర్చడం, రెండోది మూసీ ప్రక్షాళన, జంట జలాశయాల పునరుజ్జీవం చేసుకునే అవకాశమేర్పడుతుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ ను వ్యాప్ కోస్ అనే కంపెనీ సిద్ధం చేసింది. ఇందులో పంప్ హౌజ్ లు, సబ్ స్టేషన్లు, మల్లన్న సాగర్ నుంచి ఘన్ పూర్ వరకు 3000 ఎంఎం డయా భారీ పైపు లైన్ నిర్మించనున్నారు. అంతేగాక, ఘన్ పూర్, శామీర్ పేట్ వద్ద 1170 ఎంఎల్డీల సామర్థ్యంతో నీటి శుద్ధి కేంద్రాన్ని (డబ్ల్యూటీపీ) నిర్మించనున్నారు. ఘన్ పూర్ నుంచి ముత్తంగి వరకు పంపింగ్ మెయిన్ నిర్మాణంతో పాటు ఇతర పనులు చేపట్టనున్నారు. రెండేళ్లలో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్ -2,3 ద్వారా 3

39 కొత్త ఎస్టీపీలకు శంకుస్థాపన

హైదరాబాద్ మహా నగరంలో వంద శాతం మురుగు నీరు శుద్ధి చేసే లక్ష్యంతో చేపట్టిన ఎస్టీపీల ప్రాజెక్టులో భాగంగా ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో నిర్మించ త‌ల‌పెట్టిన‌ 39 ప్రాంతాల్లో ఉన్న స్థానిక సంస్థల, గ్రామాల్లో ఎస్టీపీలు నిర్మించడానికి 972 ఎమ్మెల్డీల సామర్థ్యం గల మొత్తం 39 ఎస్టీపీలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం, 2021లో మురుగు ఉత్పత్తి 1950 ఎంఎల్ డీలు కాగా, 2036 నాటికి 2800 ఎంఎల్ డీలకు పెరుగుతుందని జలమండలి అంచనా వేసింది. మూసీ నది, చెరువుల్లో కాలుష్యం నివారించేందుకు కేంద్ర్ర ప్రభుత్వ అమృత్ -2.0 కింద 39 ఎస్టీపీలు మంజూరయ్యాయి. ఇవి 2026 నాటికి పూర్తవుతాయి. అమృత్ -2.0లో భాగంగా రూ.3849.10 కోట్ల వ్యయంతో 39 ఎస్టీపీలు నిర్మాణ దశలో ఉన్నాయి. అవి పూర్తయి అందుబాటులోకి వస్తే మొత్తం 2850 ఎంఎల్ డీల మురుగు నీటి శుద్ధి సాధ్యమవుతుంది. ఇది 2036 వరకూ అవసరాలను తీర్చగలదు. మూసీ నది వెంబడి ట్రంక్ లైన్లు వేసి మురుగు ప్రవాహాన్ని ఆపడానికి డీపీఆర్ సిద్ధంగా ఉంది. ఇందుకు అంచనా వ్యయం రూ. 4700 కోట్లుగా జలమండలి నిర్ణయించింది. మొత్తం సామర్థ్యం 1315 ఎంఎల్ డీలు ఉండగా, ప్రతిపాదనలో మరి కొన్ని కొత్త ఎస్టీపీలు ప్రతిపాదనల

అవార్డులు

జలమండలి ఈ ఏడాది మొత్తం 4 అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. తమ సంస్థలో పనిచేస్తున్న కార్మికుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, తీసుకుంటున్న చర్యలు, మంచి పారిశ్రామిక సంబంధాలకు గానూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మే 1 న‌ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా ఉత్తమ యాజమాన్య పురస్కారాన్ని అందుకుంది. మార్చి 31 న‌ వాటర్ డైజెస్ట్(Water Digest) అనే ప్రముఖ అంతర్జాతీయ సంస్థ 2024-2025 సంవత్సరానికి వరల్డ్ వాటర్ అవార్డ్స్(World Water Awards) లో జలమండలికి గవర్నమెంట్ కేటగిరీలో ఉత్తమ ఎస్టీపీ(STP) అవార్డు లభించింది. అక్టోబ‌రు 9 న‌ తమ సంస్థలో ఆర్‌టీఐ(RTI) కేసుల్లో ఉత్తమంగా పని చేసిన తెలంగాణ సమాచార కమిషన్‌ ఉత్తమ హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్ పురస్కారాన్ని జ‌ల‌మండ‌లి ఎండీ అశోక్ రెడ్డి(MD Ashock Reddy) రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ జిష్టుదేవ్ వ‌ర్మ(Governor Jishnu Dev Varma) చేతుల మీదుగా స్వీకరించారు. కేంద్ర ప్ర‌భుత్వం కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ, జల వనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన‌ ‘టాప్ మునిసిపల్ కార్పొరేషన్’ కేటగిరీలో న‌వంబ‌రు 18 న‌ న్యూఢిల్లీలో ఎండీ అశోక్ రెడ్డి భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డ్ ను అందుకున్నారు.

Also Read: Alleti Maheshwar Reddy: వాళ్లంతా కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు: ఏలేటి మహేశ్వర్ రెడ్డి

అందుబాటులోకి అదనంగా మూడు రిజ‌ర్వాయ‌ర్లు

ఓఆర్ఆర్ వరకు తాగునీటి సరఫరాను మరింత మెరుగుప‌రిచేందుకు, కొత్తగా ఏర్ప‌డిన కాల‌నీల‌కు కూడా తాగునీటిని అందించేందుకు జ‌ల‌మండ‌లి కృషి చేస్తోంది. ఇందులో భాగంగా రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మంచినీటి స‌ర‌ఫ‌రాను విస్తరించేందుకు నూతనంగా మూడు రిజ‌ర్వాయ‌ర్ల‌ను నిర్మించి అందుబాటులోకి తెచ్చింది. ఈ రిజర్వాయర్లు మణికొండ మున్సిపాలిటీ ప్రాంతంలోని స్పోర్ట్ పార్క్, అల్కాపురి, 2.5 మిలియ‌న్ లీట‌ర్ల రిజర్వాయర్, నార్సింగి మున్సిపాలిటీ ప్రాంతంలోని గ్రీన్ ల్యాండ్, మంచిరేవులలో 5 మిలియ‌న్ లీట‌ర్ల రిజర్వాయర్, శంషాబాద్ మున్సిపాలిటీ ప్రాంతంలో 2 మిలియ‌న్ లీట‌ర్ల సామర్థ్యం క‌లిగిన ఈ రిజ‌ర్వాయ‌ర్లను నిర్మించి అందుబాటులోకి తెచ్చింది. దీనికి తోడు నగరంలో తాగు నీటి సరఫరా ను మరింత విస్తరించే క్రమంలో రూ.5.7 కోట్లతో హైదరాబాద్, రహమత్ నగర్ డివిజన్ లోని ఎస్పీ ఆర్ హిల్స్ లో నూతనంగా నిర్మించిన రిజర్వాయర్ ను ప్రారంభించారు. మొత్తం 3.0 మిలియ‌న్ లీట‌ర్ల సామర్థ్యం క‌లిగిన ఈ రిజ‌ర్వాయ‌ర్ ఎత్తు 9.5 మీటర్లు. ఈ రిజర్వాయర్ నిర్మాణం వల్ల బోరబండ, రహమత్ నగర్ డివిజన్ లోని 52 బస్తీల్లోని ప్రజలకు నీటి ఇబ్బందుల నుండి శాశ్వ‌తంగా విముక్తి లభించింది.

6 ఎస్టీపీల ప్రారంభం

హైదరాబాద్ మహా నగరంలో వంద శాతం మురుగు నీరు శుద్ధి చేసే లక్ష్యంతో చేపట్టిన ఎస్టీపీల ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అంబర్ పేట్ తో పాటు మరో 5 ఎస్టీపీలను మురుగు నీటి శుద్ధి కేంద్రాలను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అంబర్‌పేట్- 212.50 ఎంఎల్ డీల సామర్థ్యం కల్గి ఉండగా, అత్తాపూర్ 64.00 ఎంఎల్ డీలు, ముల్లకత్వా 25.00 ఎంఎల్ డీలు, శివాలయనగర్ 14.00 ఎంఎల్ డీలు కాగా, వెన్నలగడ్డ 10.00 ఎంఎల్ డీలు, పాలపిట్ట ఎస్టీపీని 7.00 ఎంఎల్ డీల సామర్ద్యంతో ఏర్పాగటు చేసి, సీఎం చేతుల మీదుగా ప్రారంభించారు.

వేస‌విలో నీటి స‌ర‌ఫ‌రా

ఈ వేస‌విలో న‌గ‌రంలో భూగ‌ర్భ జ‌లాల స్థాయి భారీగా ప‌డిపోవ‌డంతో తాగునీటి స‌ర‌ఫ‌రాకు విప‌రీత‌మైన డిమాండ్ పెరిగింది. తాగు నీరు స‌ర‌ఫ‌రా చేసే జ‌ల‌మండ‌లిపై ఒక్క‌సారిగా ఒత్తిడి పెరిగింది. వేస‌వి ప్రారంభంలో చిన్న‌పాటి ఒడుదుడుకులు ఎదుర్కొన్నా, ఆ తర్వాత ప్ర‌జ‌ల‌కు కావల్సిన స్థాయిలో తాగునీటి సేవ‌లందించింది. ఈ స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు తాగునీటికి ఇబ్బందులు రావొద్ద‌ని, ప్ర‌ధాన వ‌న‌రులైన నాగార్జున సాగ‌ర్, ఎల్లంప‌ల్లి ప్రాజెక్టుల్లో ఎమ‌ర్జెన్సీ పంపింగ్ ప్రారంభించింది. ఇప్ప‌టికే ఉన్న ట్యాంక‌ర్లు, డ్రైవ‌ర్లు, ఫిల్లింగ్ స్టేష‌న్లు, పాయింట్లు పెంచుకుని, రోజూ ట్యాంక‌ర్ల ద్వారా స‌ర‌ఫ‌రా చేసింది. జ‌ల‌మండ‌లి ప‌రిధిలో దాదాపు 1150 కి పైగా ట్యాంక‌ర్లు, 90 ఫిల్లింగ్ స్టేషన్లు, 150 ఫిల్లింగ్ పాయింట్స్ ఉండగా, ఈ ఏడాది జనవరి 1 నుంచి మొత్తం డిసెంబర్ 30వ తేదీ వరకు సుమారు 19 లక్షల 62 వేల 99 ట్యాంక‌ర్ ట్రిప్పులను జలమండలి డెలివరీ చేసింది.

Also Read: Gold Rates: న్యూ ఇయర్ ముందు భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్..

జలమండలిని సందర్శించిన ట్రైనీ ఐఏఎస్ బృందం

తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన 2023 బ్యాచ్ కి చెందిన ఏడుగురితో కూడిన ట్రైనీ ఐఏఎస్ బృందం జలమండలిని సందర్శించింది. ఒక రోజు ఒరియెంటేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా ఖైరతాబాద్ లోని ప్రధాన కార్యాలయానికి విచ్చేసి జలమండలి కార్యకలాపాల గురించి వారు తెలుసుకున్నారు. ఎండీ అశోక్ రెడ్డి బోర్డు పనితీరు, నగరానికి నీటి సరఫరా, ఎస్టీపీలు, మురుగు శుద్ధి నిర్వహణతో పాటు భవిష్యత్తు ప్రణాళికలు, ప్రాజెక్టుల గురించి వారికి వివరించారు.

నీటి సరఫరా ప్రస్తుత నీటి సరఫరా ఇలా..

= ప్రస్తుత నీటి సరఫరా : 602 ఏంజిడీలు

= 2027 నాటికి అవసరం : 835 ఏంజిడీలు

= సరఫరా లోటు : 233 ఎంజీడీలు

= ఈ లోటును మల్లన్నసాగర్ నుండి గోదావరి నీటిని (20 టీఎంసీ 300 ఏంజిడీ) తీసుకువచ్చి భర్తీ చేయవచ్చు, మూసీ పునరుజ్జీవనం సాధ్యం చేసుకోవచ్చు.

= ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం గోదావరి ఫేజ్ 2,3 ప్రాజెక్ట్ (20 టీఎంసీ మల్లన్నసాగర్ నుండి తాగునీరు) కు రూ. 7360కోట్లు వ్యయంతో పరిపాలన అనుమతి ఇచ్చింది.

గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్ 2,3

= రూ. 7360 కోట్లు వ్యయంతో గోదావరి నుండి 300 ఎంజిడీల తాగునీటి తరలింపు

= 2.5 టీఎంసీలు నీరు మూసీ నది పునరుద్ధరణకు వినియోగం

= హైదరాబాద్, తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్ ) చెందిన 1.34 కోట్ల జనాభా లబ్ది

=2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని గడువు ఫిక్స్

కొకాపేట్ నీయోపోలిస్ లేఅవుట్ వాటర్ సప్లై ప్రాజెక్ట్

= సంపు, పంపు హౌజ్, జీఎల్ ఎస్ఆర్ నిర్మాణం

= ప్రాజెక్ట్ వ్యయం రూ. 298 కోట్లు

కొత్తగా ఆమోదించిన నీటి సరఫరా ప్రాజెక్టులు

= మహేంద్ర హిల్స్ (5 ఎంఎల్ ) వద్ద జీఎల్ఎస్ఆర్

= ఆస్మాన్‌గఢ (7.5) వద్ద జీఎల్ఎస్ ఆర్

= వ్యయం : రూ. 30 కోట్లు

= ఈ ఏటా నీటి సరఫరా ప్రాజెక్టులకు సర్కారు ఆమోదించిన మొత్తం నిధులు రూ. 7688 కోట్లు

నీటి సరఫరాకు కొత్త పథకాలు ప్రణాళికలు

= మంజీర వాటర్ సప్లై నెట్‌వర్క్ పునరుద్ధరణ రూ. 722 కోట్లు

= ఉస్మాన్ సాగర్ కండూట్ పునరుద్ధరణ, 21 ఎంజీడీల అదనపు లైన్ రూ. 282 కోట్లు

= రేడియల్ రింగ్ మెయిన్, లింక్స్ (140 కి.మీ + 98 కి.మీ) రూ. 8000 కోట్లు

= టీసీయూఆర్ ప్రాంతానికి మాస్టర్ ప్లాన్ ప్రణాళిక 2028నాటికి రోజువారీ సరఫరా,2047నాటికి నిరంతర నీటి సరఫరా

Also Read: Nandini Suicide: ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ సీరియల్ నటి నందిని.. ఎందుకంటే?

Just In

01

DCP Aravindh Babu: బ్యాంక్ ఖాతాలు సమకూరిస్తే కటకటాలే.. సైబర్​ క్రైం డీసీపీ స్ట్రాంగ్ వార్నింగ్!

Ghantasala Biopic: రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన ‘ఘంటసాల ది గ్రేట్’ మూవీ.. ఎప్పుడంటే?

Basti Dawakhana: బస్తీ దవాఖానల డ్రగ్స్ డిస్ట్రిబ్యూషన్ సమస్యలకు చెక్.. కొత్త సిస్టమ్ అమలు..!

Uttarakhand : ఉత్తరాఖండ్ హైడ్రోపవర్ ప్రాజెక్ట్ టన్నెల్‌లో ఘోర ప్రమాదం.. 60 మందికి గాయాలు

Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. పెనుబల్లి తహసీల్దార్ శ్రీనివాస్ యాదవ్ పై సస్పెన్షన్ వేటు..!