Alleti Maheshwar Reddy: వాళ్లంతా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు
Alleti Maheshwar Reddy (imagecredit:twitter)
Political News, Telangana News

Alleti Maheshwar Reddy: వాళ్లంతా కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు: ఏలేటి మహేశ్వర్ రెడ్డి

Alleti Maheshwar Reddy: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR)తో ప్రభుత్వం మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నట్లుగా అనుమానం ఉన్నదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Eleti Maheshwar Reddy) వ్యాఖ్యానించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద సోమవారం ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వ అవినీతిపై కేసులు పెడతామన్నారు, ఏమైందని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాల్లో హిల్ట్ పాలసీపై చర్చ ఎందుకు పెట్టడం లేదని నిలదీశారు. గ్లోబల్ సమ్మిట్, విదేశీ పెట్టుబడులపై చర్చించే దమ్ము, దైర్యం ఉందా అని ప్రశ్నల వర్షం కురిపించారు. రూ.లక్షల కోట్ల పెట్టుబడులు ఎక్కడపోయాయని ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రతి వర్గానికి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై చర్చించే దమ్ము ప్రభుత్వానికి ఉందా అని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం చర్చించడానికి ఈ సర్కార్‌కు సమయం లేదా అని ఫైరయ్యారు. ప్రధాన ప్రతిపక్ష నేతతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని, పాలన గాడిన పడేశారన్నారు.

Also Read: Bank Loan News: ఓ వ్యక్తి రూ.1.7 కోట్ల లోన్ తీసుకుంటే 11 ఏళ్లలో రూ.147 కోట్లకు పెరిగింది.. ఎందుకంటే?

సభలో ఏలేటి ప్రసంగం

ఇక, అసెంబ్లీలో ఏలేటి మాట్లాడుతూ, గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక మినిస్టరీ ఏర్పాటు చేయాలన్నారు. వారు అనేక దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. మన ఊరు మన బడికి నిధులు రావడం లేదని లేవనెత్తారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు నెరవేరలేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వీటితో పాటుగా జాబ్ క్యాలెండర్‌పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు. జీహెచ్ఎంసీ(GHMC) పునర్విభజనలో భాగంగా కొన్ని డివిజన్లలో ఓటర్ల శాతంలో హెచ్చు తగ్గులు ఉన్నాయని, వాటిపై ప్రభుత్వం పునఃపరిశీలన చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా ఏలేటి ప్రశ్నలకు మంత్రి పొన్నం ప్రభాకర్(Miniater Ponnam Prabhakar) సమాధానం ఇచ్చారు. గల్ఫ్ బాధితుల అంశం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని, అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.

Also Read: Naa Anveshana: నా అన్వేషణ అన్వేష్‌పై ఫిర్యాదు.. ఇండియాకు వచ్చాడా.. ఇక అంతే!

Just In

01

Crime News: పనిమనుషుల అసాధారణ దారుణం.. సినిమాలను తలపించే రీతిలో ఐదేళ్లపాటు..

Allu Aravind: కొడుకుకి సక్సెస్ వస్తే వచ్చే ఆనందం.. నాకంటే బాగా ఎవరికీ తెలియదు!

Bulkapur Nala: హైడ్రాకు ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైనం.. నాలా కబ్జా చేసి నిర్మాణాలు

Ganja Seized: న్యూ ఇయర్ ఎఫెక్ట్.. రెచ్చిపోతున్న గంజాయి పెడ్లర్లు!

New Year 2026: ప్రపంచవ్యాప్తంగా 2026 కొత్త సంవత్సరం వేడుకలు ఎలా జరుపుకుంటారంటే?