TG Govtt [ image credit: twitter]
తెలంగాణ

TG Govt: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాబోయే నోటిఫికేషన్స్ ఇవే..

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: TG Govt: తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల జాతర నిర్వహిస్తోంది. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష అయిన నిధులు, నీళ్లు, నియామకాలకు గత పదేళ్ల ప్రభుత్వంలో తీరని అన్యాయం జరిగింది. అంటున్న ప్రజా ప్రభుత్వం ఆ దిశగానే చర్యలు ముమ్మరం చేసింది. గత పదిహేను నెలలలోనే రికార్డు స్థాయిలో సుమారు లక్ష ఉద్యోగాలు కల్పించామని ప్రభుత్వం ప్రకటించింది. అదే సమయంలో యువతకు మరిన్ని ఉద్యోగాలు, ఉపాధి కల్పనే ధ్యేయంగా ముందుకు వెళ్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు.

Also Read: Gaddam Prasad Kumar: ఆ ఒక్క కారణంతో.. పిల్లనివ్వడం లేదు.. స్పీకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నదే యువత అని, వారి ఆశయాల మేరకు ఉద్యోగ, ఉపాధి కల్పించలేని ప్రభుత్వం ఉన్నా లేనట్లే అనేది ప్రభుత్వ భావన. అందుకే ఓ వైపు వీలైనన్ని ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ, మరో వైపు యువత సొంత కాళ్లపై నిలబడేలా ఉపాధి మార్గాలను ఏర్పాటు చేయాలనే సంకల్పాన్ని ప్రభుత్వం తీసుకుంది. అందుకే యువ వికాసం పథకాన్ని ప్రకటించటంతో పాటు బడ్జెట్ లో నిధులనూ పెట్టింది.కొలువుల జాతర పేరుతో ఇప్పటికే రికార్డు స్థాయిలో పదిహేను నెలల్లోనే సుమారు లక్ష మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించింది.

Also Read: SC on TG Govt: తెలంగాణ ప్రభుత్వానికి ‘సుప్రీం’ నోటీసులు.. ఆ ఎమ్మెల్యే ఏమన్నారంటే?

అందరికీ అపాయింట్ మెంట్ ఆర్డర్లు సైతం అందించింది. వారికి జీవితంలో సుస్థిరమైన భద్రతను కల్పించటంతో పాటు, ప్రభుత్వ యంత్రాంగానికి కొత్త రక్తాన్ని ఎక్కించగలిగింది. గత ప్రభుత్వం ఉద్యోగులకు ఇష్టంలేకున్నా పదవీ విరమణ వయస్సును మూడేళ్లు పెంచి 58 నుంచి 61 చేసింది. ఇది ఉద్యోగాలను ఆశిస్తున్న యువతకు తీరని అన్యాయం చేయటంతో పాటు, అప్పటికే ఉద్యోగం చేస్తూ విరమణకు దగ్గరైన వాళ్లనూ మెప్పించలేకపోయింది.అందుకే గత ప్రభుత్వ తప్పిదాన్ని ఎన్నికలకు ముందే ఎత్తిచూపిన రేవంత్ రెడ్డి రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను ఖచ్చితంగా భర్తీ చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు తొలి యేదాదిన్నరలోనే లక్ష ఉద్యోగాల భర్తీ జరిగిపోయింది.

Also Read: Seethakka Fires on Kavitha: ‘కరెప్షన్ మీ డీఎన్ఏలోనే ఉంది’.. బీఆర్ఎస్ పై సీతక్క ఫైర్

ఇప్పటికే కల్పించిన ఉద్యోగాలు, రానున్న నోటిఫికేషన్లు

• 58,868 నియామకాలు పూర్తి (మార్చి 2025 నాటికి)

• 2711 గ్రూప్ 1,2,3 పోస్టులు.. త్వరలో నియామకాలు.
(563- గ్రూప్ 1 పోస్టులు, 783- గ్రూప్ 2, 1365- గ్రూప్ 3 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు త్వరలో నియామక పత్రాలు అందించనుంది.)

• 30, 228 కొత్త పోస్టులు మంజూరు.

• 14,236 అంగన్వాడీ పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్.

• 10,954 త్వరలోనే గ్రామ పాలనా అధికారుల నియామకం.

Also Read: Rajiv Yuva Vikasam Scheme: రేషన్ కార్డు కావాలి సార్.. ప్లీజ్ త్వరగా ఇవ్వండి..

ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఉద్యోగాల కల్పనలో ముందుకే వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇటీవలే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలను విడుదల చేసింది. రెవిన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు త్వరలోనే 10,954 గ్రామ పరిపాలనా అధికారులను (GPO) నియమించనుంది. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి ఏళ్ల కేళ్లుగా కారుణ్య నియామకాలకు ఎదురుచూస్తున్న బాధిత కుటుంబాలకు ప్రభుత్వం బాసటగా నిలిచింది. 922 మందికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించారు. వీరిలో 582 కారుణ్య నియామకాలున్నాయి. ఈ కారుణ్య నియామకాలను చేపట్టేందుకు ఉన్న అడ్డంకులను తొలిగించేందుకు ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం ఆదేశాల మేరకు జడ్పీ, మండల పరిషత్తుల్లో ఉన్న 524 ఆఫీసు సబార్డినేట్, నైట్ వాచ్ మెన్ పోస్టులను జూనియర్ అసిస్టెంట్ పోస్టులుగా అప్ గ్రేడ్ చేశారు. కొత్తగా 58 జూనియర్ అసిస్టెంట్ సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించారు.

Also Read: TG on Tax Evasion: పన్నుల ఎగవేతపై సర్కార్ సీరియస్.. పెద్ద ప్లాన్ రెడీ.

మరోవైపు ప్రభుత్వ ఉద్యోగాల సాధన సాధ్యం కాని యువతను కూడా స్థిరమైన ఉపాధి దిశగా మళ్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ఆరు వేల కోట్ల రూపాయల ఖర్చుతో అన్ని వర్గాల్లో యువతే టార్గెట్ గా ఉపాధిని కల్పించేందుకు అప్లికేషన్ల ప్రక్రియను కూడా ప్రారంభించింది. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ యువతకు మెరుగైన సబ్సిడీతో రుణాలను అందించనుంది. రానున్న జూన్ రెండున లబ్ది దారుల లిస్టును కూడా ఫైనల్ చేసే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది.

తెలంగాణలో నిరుద్యోగం ఇప్పటికే తగ్గుముఖం పట్టిందని ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నిరుద్యోగుల భవితకు ప్రజా ప్రభుత్వం బాసటగా నిలుస్తుండటంతో వారిలో కూడా ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. విద్యా అవకాశాలను, నైపుణ్యాన్ని బట్టి అటు ప్రభుత్వ ఉద్యోగమో, లేదంటే అదే ప్రభుత్వ సహకారంతో ఉపాధి మార్గం తప్పకుండా దొరుకుందనే విశ్వాసం ఇప్పుడు తెలంగాణ యువతలో పెరుగుతోంది.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈhttps://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

 

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు