Guvvala Balaraju: మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ తో కొద్ది రోజుల క్రితం మాట్లాడానని, ఆయన బీజేపీ(BJP)లో ఎలా ఉందని తనను అడిగాడని, తాను అంతా ఒకే అని చెప్పానని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు(Guvala Balaraju) తెలిపారు. తన మాటలు పసిగట్టి అరూరి రమేశ్ పార్టీ మారే విషయం చెప్పలేదనుకుంటానని ఆయన చెప్పారు. లేదంటే కొంచెం హింట్ ఇచ్చిన అరూరిని పార్టీ మారకుండా ఆపేవాడినని బాలరాజు తెలిపారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను చచ్చే వరకు బీజేపీలోనే ఉంటానని, పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. పెద్దమ్మ తల్లి సాక్షిగా, తన తల్లి దండ్రుల సాక్షిగా బీజేపీని వీడేదిలేదన్నారు.
రానున్న రోజుల్లో బీజేపీలో చేరికలు
పార్టీ మారుతారంటూ తనపై అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ పిచ్చి ఆరోపణలు చేస్తున్నారని, మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. తాను పార్టీ సిద్ధాంతాలు నచ్చి బీజేపీలో చేరానని, అరూరి రమేశ్ ఎన్నికల కోసం బీజేపీలో చేరాడనుకుంటానని వ్యాఖ్యానించారు. తాను ఎటువంటి ఎన్నికలు లేని సమయంలో బీజేపీ జాయిన్ అయినట్లు వివరించారు. రానున్న రోజుల్లో బీజేపీలో చేరికలు పెంచి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా బీజేపీ బలోపేతం కోసం కృషిచేస్తానని తెలిపారు. ఇదిలాఉండగా జన జీవన స్రవంతిలోకి రావాలని నక్సల్స్ కు కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చిందని, కీలక మావోయిస్టులు లొంగిపోతున్నారన్నారు. రూ.20 లక్షల రివార్డ్, రూ.8 లక్షల రివార్డ్ లు ఉన్న నక్సలైట్లు లొంగిపోకుండా అచ్చంపేటలో తిరుగుతున్నారని, దీనికి కారణం అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ కృష్ణ, రాష్ట్ర ప్రభుత్వం అండతోనే నల్లమల నక్సలైట్లు లొంగకుండా ఉన్నారని పేర్కొన్నారు.
Also Read: MP DK Aruna: మున్సిపాలిటీలలో పోటీ చేసేందుకు బీజేపీ అభ్యర్థులు సిద్ధం: ఎంపీ డీకే అరుణ
టీచర్ ఎందుకు అరెస్టయ్యారు
ఆ ముగ్గురు నక్సలైట్లపై రాష్ట్ర పోలీస్ శాఖ ఎందుకు దృష్టి పెట్టలేకపోతోందని ప్రశ్నించారు. వారి వల్ల తమకు ప్రమాదం పొంచి ఉందన్నారు. నక్సల్స్ కు షెల్టర్ ఇస్తున్నవారిపై దృష్టిపెట్టాలని బాలరాజు కోరారు. ఎమ్మెల్యే వ్యవహారం ఎన్ఐఏకు అప్పజెప్పాలన్నారు. వంశీకృష్ణ వెనుక నక్సల్ సింపథైజర్స్ ఉన్నారని ఆరోపించారు. వంశీకృష్ణ అనుచరుడు అంబయ్య అనే టీచర్ ఎందుకు అరెస్టయ్యారని బాలరాజు ప్రశ్నించారు. వంశీకృష్ణ వసూల్ రాజాగా మారారన్నారు. వంశీకృష్ణ అనుచరులు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ను కొంతమంది కలుషితం చేశారని, కాబట్టే పార్టీని వీడాల్సి వచ్చిందన్నారు. వంశీకృష్ణకు దమ్ముంటే తన బండారం ఏంటో బయటపెట్టాలన్నారు. తనపై ఉన్న వీడియోలుంటే బయట పెట్టాలని సవాల్ విసిరారు. గుప్త నిధుల కోసం తవ్వకాలు చేసే సంస్కృతి వంశీకృష్ణదని గువ్వల ఆరోపించారు.
Also Read: Kalwakurthy BRS: బీఆర్ఎస్ నేతల మధ్య ముదురుతున్న పంచాయతీ.. బరిలో నుంచి తప్పుకున్న నాయకుడు..?

