Telangana excise special drive ( Image Source: Twitter)
తెలంగాణ

Telangana excise special drive: కల్తీ కల్లుపై సాగుతున్న దాడులు..

Telangana excise special drive:స్పెషల్​ డ్రైవ్​ లో భాగంగా ఎక్సైజ్ సిబ్బంది కల్తీ కల్లుకు అడ్డుకట్ట వేయటానికి ముమ్మరంగా దాడులు చేస్తున్నారు. ఈ క్రమంలో కల్తీ కల్లును స్వాధీనం చేసుకుంటుండటంతోపాటు పలువురిని అరెస్ట్ చేస్తున్నారు. దాడుల కారణంగా కల్తీ కల్లు దొరకక పోతుండటంతో దానికి అలవాటు పడ్డవారు పిచ్చిపట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో పలువురిని వారి వారి కుటుంబ సభ్యులు వేర్వేరు ఆస్పత్రుల్లో చేర్పించారు.

Also Read: Indian Team: లార్డ్స్ టెస్టు ఓటమి.. టీమిండియా బ్యాటర్లపై అజారుద్ధీన్ షాకింగ్ కామెంట్స్!

70 లీటర్ల కల్లును పట్టుకున్న పోలీసులు

కల్తీ కల్లు కూకట్ పల్లిలో సృష్టించిన విషాదం నేపథ్యంలో ఎక్సైజ్​ అధికారులు స్పెషల్​ డ్రైవ్ మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎస్టీఎఫ్ టీం సీఐ అంజిరెడ్డి సిబ్బందితో కలిసి ధూల్ పేటలో మూడు చోట్ల దాడులు జరిపారు. బైక్​ పై అక్రమంగా తరలిస్తున్న 70 లీటర్ల కల్లును పట్టుకున్నారు. దీని శాంపిల్ తీసుకుని మిగితా కల్లును నేలపాలు చేశారు. కల్లును తరలిస్తున్న మల్లప్పను అరెస్ట్ చేశారు. దీంట్లో సంబంధం ఉన్నట్టుగా తేలిన బసవరాజ్ పై కూడా కేసులు నమోదు చేశారు.

Also Read: Hari Hara Veera Mallu: ‘హరి హర వీరమల్లు’కు ప్రేరణ ఎవరో తెలుసా? దర్శకుడు ఏం చెప్పారంటే?

కల్లు కాంపౌండ్లపై దాడులు

ధూల్ పేటలో అనిల్ గౌడ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అక్రమంగా విక్రయిస్తున్న 270 లీటర్ల కల్లును డ్రైనేజీలో ఒలకపోశారు. దీంట్లో రామచంద్రయ్య అనే వ్యక్తిపై కూడా కేసులు పెట్టారు. ఇక, గుడిమల్కాపూర్ హీరానగర్ లో అనుమతులు లేకుండా నడుస్తున్న మరో కల్లు కాంపౌండ్ పై దాడి చేశారు. రామకృష్ణ గౌడ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి 382 లీటర్ల కల్లును నేలపాలు చేశారు. ఇక, ఎస్టీఎఫ్​ సీ టీం సీఐ వెంకటేశ్వర్లు, డీ టీం సీఐ నాగరాజు నేతృత్వంలోని బృందాలు శేరిలింగంపల్లి, హైదర్ నగర్, రంగారెడ్డినగర్, తుర్కేముల్ ప్రాంతాల్లోని కల్లు కాంపౌండ్లపై దాడులు చేసి శాంపిళ్లను సేకరించారు.

 Also Read: Wife And Husband: వామ్మో తెలంగాణలో ఘోరం.. భార్యభర్తల పంచాయితీలో ఇద్దరు దారుణ హత్య

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?