CM Revanth Reddy (Image Source: twitter)
తెలంగాణ

CM Revanth Reddy: విద్యా విధానం మారాల్సిందే.. అవసరమైతే దేనికైనా సిద్ధం.. సీఎం రేవంత్

CM Revanth Reddy: తెలంగాణలోని విద్యా విధానంలో సమూల మార్పులు, ప్రక్షాళన చేయాలని నిర్ణయించినట్లు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో నూతన విద్యా విధానానికి సంబంధించి విద్యాశాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ నూతన పాలసీ ద్వారా విద్యా విధానం లో మార్పు లతో పాటు పేదరిక నిర్మూలన జరగాలని పేర్కొన్నారు. ఒకప్పుడు తెలంగాణ విద్యలో ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు కీలక పాత్ర పోషించాయన్న సీఎం.. ఓపెన్ మార్కెట్ కారణంగా అంతర్జాతీయ స్థాయికి మన విద్యా విధానం సరితూగడం లేదని అభిప్రాయపడ్డారు.

98% నిధులు.. జీతాలకే ఖర్చు
ప్రతి సంవత్సరం 1.10 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉత్తీర్ణులు అవుతున్నారని సీఎం రేవంత్ గుర్తు చేశారు. వారిలో 15 శాతం మంది మాత్రమే ఉద్యోగాలు పొందుతున్నారని అన్నారు. ‘విద్యలో ప్రభుత్వ పాత్ర తగ్గిపోతుంది. విద్యా శాఖకు రూ.21 వేల కోట్లు కేటాయిస్తే అందులో 98 శాతం జీతాలకే ఖర్చు అవుతోంది. పేదరిక నిర్మూలన జరగాలంటే విద్య ఒక్కటే మార్గం. విద్యా విధానం లో సమూల మార్పులు తీసుకురావడమే నా ధ్యేయం. అందుకు కావాల్సిన సలహాలు, సూచనలు ఇవ్వండి’ అంటూ సీఎం రేవంత్ అధికారులను కోరారు.

‘సమూల మార్పులు అవసరం’
తెలంగాణలోని 73 లక్షల మంది యువతకు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్నదే తన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్ఫష్టం చేశారు. ‘దేశ విద్యా విధానాన్ని మార్చేలా తెలంగాణ కొత్త విద్యా విధానం ఉండాలి. పిల్లల భవిష్యత్తు కోసం ప్రణాళిక బద్దంగా పనిచేయాలి. స్కూల్ ఎడ్యుకేషన్ లో లోపాలు ఉన్నాయి. 11 వేల ప్రైవేట్ స్కూల్స్ లో 34 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. 27 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 18 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. విద్య కోసం తీసుకునే రుణాలను ఎఫ్ఆర్ బీఎం పరిధి నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ఆర్ధిక మంత్రి కోరా. 1 నుంచి 12 తరగతుల వరకు సమూల మార్పులు రావాలి. విద్య విషయంలో సమాజానికి మేలు జరుగుతుందంటే రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకోవడానికైనా నేను సిద్ధం’ అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Also Read: Most Expensive Cruise: ప్రపంచంలోనే లగ్జరీ క్రూయిజ్.. ఒక్కో టికెట్ రూ.7 కోట్లు.. ఎందుకంత స్పెషల్?

‘విద్యపై వ్యయం ఖర్చు కాదు’
అంతకుముందు తెలంగాణ లిబరేషన్ డే సందర్భంగా పబ్లిక్ గార్డెన్స్ లో సీఎం రేవంత్ మాట్లాడారు. విద్యా విధానంలో తీసుకొస్తున్న మార్పుల గురించి ప్రస్తావించారు. గొప్ప విజన్ తో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్ల ఆలోచన చేశాం. భవిష్యత్ లో తెలంగాణ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు ఈ స్కూళ్లు కేంద్రాలుగా మారబోతున్నాయి. విద్యపై మేం చేస్తున్న వ్యయం ఖర్చు కాదు. భవిష్యత్ తెలంగాణకు పెట్టుబడిగా మేం భావిస్తున్నాం. విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇన్నోవేషన్ కు పెద్దపీట వేస్తున్నాం. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలు రేపటి తెలంగాణ భవితకు భరోసా కేంద్రాలుగా నిలుస్తాయి. రాష్ట్ర విద్యా పాలసీని త్వరలో తీసుకురాబోతున్నాం’ అని రేవంత్ అన్నారు.

Also Read: Shocking News: చనిపోయాడని అంత్యక్రియలు నిర్వహిస్తే..16 ఏళ్ల తర్వాత ఇంటికి తిరిగొచ్చాడు!

Just In

01

Harish Rao: లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టే ధైర్యం ప్రభుత్వానికి లేదా: హరీష్ రావు

Ramachandra Rao: ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం.. అలైన్ మెంట్ మార్చాలంటూ రైతులు డిమాండ్!

H-City Project: ముందుకు సాగని హెచ్ సిటీ పనులు.. ఎందుకో తెలుసా..!

Pawan Kalyan thanks: వారికి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్.. ప్రత్యేకించి అభిమానులకు అయితే..

OG Concert: ‘ఓజీ’ సినిమాలో హీరో తాను కాదంటూ బాంబ్ పేల్చిన పవన్.. ఇంతకూ వారు ఎవరంటే?