CM Revanth Reddy ( IMAGE CREDIT: TWITTER)
తెలంగాణ

CM Revanth Reddy: బీసీలకు 42 శాతం రిజర్వేషన్​ అమలుపై డిస్కషన్

CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్ ( congress)  ఎంపీలకు కుల గణనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. దీంతో పాటు బీసీ 42 శాతం బిల్లుపై వివరించనున్నారు. పార్లమెంట్, రాజ్యసభలో ఈ బిల్లును పాస్ చేయించేందుకు ఎలా వ్యవహరించాలి? అనే దానిపై చర్చించనున్నారు. పార్లమెంట్ లోని అన్ని ప్రతిపక్ష పార్టీలను కూడా సంప్రదింపులు చేయనున్నారు. అంతేగాక ఇప్పటికే ప్రధాన మోడీ అపాయింట్‌మెంట్‌ను కూడా కోరారు.

 Also Read: Farmers Protest: రోడ్డెక్కిన రైతన్నలు.. సీడ్ కంపెనీల తీరుపై తీవ్ర ఆగ్రహం..

మూడు రోజుల పాటు సీఎం ఢిల్లీలోనే

అన్ని పార్టీల ఎంపీల సహకారంతో మోడీని కూడా కలిసి 42 శాతం రిజర్వేషన్‌పై చర్చించనున్నారు. ఆ తర్వాత ఏఐసీసీ ఓబీసీ విభాగం ఆధ్వర్యంలో జరగనున్న భాగీదారీ న్యాయ సమ్మేళనం అనే కార్యక్రమంలో కూడా పాల్గొనే ఛాన్స్ ఉన్నది. సుమారు మూడు రోజుల పాటు సీఎం ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉన్నది.  (42% Reservation Bill,)42 శాతం రిజర్వేషన్‌పై అన్ని పార్టీల సీనియర్లు, లీగల్ ఒపీనియన్, నిపుణులతో చర్చించనున్నారు. ఇక షెడ్యూల్ ప్రకారం ఈ నెల 25న జరగాల్సిన క్యాబినెట్ వాయిదా పడే అవకాశం ఉన్నది. సీఎం ఢిల్లీ నుంచి వెంటనే వచ్చేస్తే, క్యాబినెట్ ఉంటుందని, అక్కడే ఉంటే రీ షెడ్యూల్ చేస్తామని సీఎంవో వర్గాలు తెలిపాయి.

 Also Read: Air India: ఎయిరిండియా విమానంలో మంటలు.. మరో షాకింగ్ ఘటన

Just In

01

Singareni Collieries: పనితీరులో అలసత్వం వద్దు.. టార్గెట్ కంప్లీట్ చేయాల్సిందే..!

Akhanda 2: బాలయ్య పాన్ ఇండియా ప్రచారంలో దూకుడేది.. ఇంకా అనుమానాలేనా?

Parasakthi: శ్రీలీలతో రెట్రో రొమాన్స్‌లో శివకార్తికేయన్‌.. ‘పరాశక్తి’ సాంగ్ అదిరింది

Ram Mohan Naidu: 52 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో కేంద్రమంత్రి రామ్మోహన్ భేటీ.. ఎందుకంటే?

Rana Daggubati: కాలాన్ని రీ క్రియేట్ చేయగలిగేది ఒక్క సినిమా మాత్రమే!