MLC Dasoju Shravan: ఉత్తమ్ ఛాంబర్‌లో వేదశ్రీరామ్‌కి ఏం పని..?
MLC Dasoju Shravan (imagecredit:twitter)
Political News, Telangana News

MLC Dasoju Shravan: ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛాంబర్‌లో వేదశ్రీరామ్‌కి ఏం పని..? ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్

MLC Dasoju Shravan: కమాండ్ కంట్రోల్ రూమ్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చాంబర్ లో వెదిరే శ్రీరామ్ కు ఏం పని అని బి.ఆర్.ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్(MLC Dasoju Shravan) ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్(Congress)),బీజేపీ(BJP) సిద్ధాంత వైరుధ్యాలు ఉన్న పార్టీలు అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నాయని ఆరోపించారు. పనిగట్టుకుని బిఆర్ఎస్ పార్టీపై విష ప్రచారం చేస్తున్నాయని, మహారాష్ట్ర ప్రభుత్వం సలహాదారు వెదిరే శ్రీరామ్ తెలంగాణ బిడ్డ తెలంగాణ కోసం ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డికి,కాంగ్రెస్ పార్టీకి కొమ్ముకాసే విధంగా వెదిరే శ్రీరామ్ మాట్లాడుతున్నారన్నారు. కేసీఆర్ పై వెదిరే శ్రీరామ్ అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రా ఆదిత్య నాధ్ దాస్ ఏపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారని, ఇరిగేషన్ పై అవగాహన ఉన్న వెదిరే శ్రీరామ్(Vedire Sriram) దీనిపై ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. తెలంగాణ బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీకి కొమ్ముకాస్తున్నారన్నారు. ఒక్క అంశంపైన అయినా కాంగ్రెస్ ను బీజేపీ నేతలు నిలదీశారా?బీజేపీ కండువా కప్పుకున్న కాంగ్రెస్ నేతలుగా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెదిరే శ్రీరామ్ ముగ్గురు కలిసి కేసీఆర్ పై కుట్రలు చేస్తున్నారన్నారు.

చంద్రబాబును మెప్పించడం కోసం

ఉమ్మడి రాష్ట్రంలో ఎవరి ప్రయోజనం కోసం తెలంగాణకు 299 టీఎంసిలు కేటాయించారని, వెదిరే శ్రీరామ్ కు ఈ విషయం తెలియదా…? రేవంత్ రెడ్డికి వెదిరే శ్రీరామ్ కొమ్ము కాస్తూ ఆరోపణలు చేస్తున్నారన్నారు.తెలంగాణకు 299 టీఎంసిల కేటాయింపు వెనుక ఉమ్మడి ఏపీ,కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో జరిగిందన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక 28 లేఖలు కేంద్ర ప్రభుత్వానికి కృష్ణా నదీ జలాలపై రాశారని, చంద్రబాబును మెప్పించడం కోసం బీజేపీ పని చేస్తోందని ధ్వజమెత్తారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఎందుకు రావడం లేదని, కిషన్ రెడ్డి(Kishan Reddy)కి, బండి సంజయ్(Bandi sanjey) కు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ నీటి హక్కుల కోసం ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిని మెప్పించడం కోసం తెలంగాణ బీజేపీ శాఖకు తాళం వేసుకోండి.. కేసీఆర్ తెలంగాణకు చేసిన ప్రయోజనాన్ని చిన్నగా చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపాలని 2020లోనే బిఆర్ఎస్ మాట్లాడింది,నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు వెళ్ళింది. రేవంత్ రెడ్డి, వెదిరే శ్రీరామ్ కు, కిషన్ రెడ్డి, బండి సంజయ్ అందరూ వెళ్లి మోడీ వద్దకు వెళ్లి కృష్ణా జలాలు 70 శాతం తీసుకుని రండlని అన్నారు.

Also Read: Ration Rice Scam: హుజూరాబాద్‌లో రెచ్చిపోతున్న రేషన్ మాఫియా.. వామ్మో ఎన్నిక్వింటాల్లో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్‌లో..

అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కు కేసీఆర్ హాజరయ్యారు.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై 18 లేఖలు కేసీఆర్ కేంద్రానికి రాశారు.. అధికారం పోయి రెండు ఏళ్ళు అయినా కేసీఆర్ పైన ఏడుస్తున్నారన్నారు. పాలమూరు,రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదో వెదిరే శ్రీరామ్ అడగాలని సూచించారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్‌లో కాంట్రాక్టర్ల కుమ్మక్కుపై వెదిరే శ్రీరామ్ మాట్లాడాలన్నారు. కాంగ్రెస్, బీజేపీ వ్యభిచార రాజకీయం చేస్తున్నాయని అన్నారు. తెలంగాణలో బీజేపీ ముసుగులో ఉన్న కాంగ్రెస్ నేతలు ఉన్నారన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు సిగ్గు పడాలన్నారు. 200 కోట్లతో కాలేశ్వరం ప్రాజెక్టును ఎందుకు రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రిపేర్ చేయడం లేదు.. కాలేశ్వరం ప్రాజెక్టుపై,మేడిగడ్డ బ్యారేజీ రిపేర్ పై బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదు.. తెలంగాణ బీజేపీని ఏమైనా కాంగ్రెస్ పార్టీకి రాసి ఇచ్చారా..? కాంగ్రెస్, బీజేపీ అక్రమ సంబంధాన్ని ప్రజలకు వివరిస్తాం అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ దక్కలేదు.. కాంగ్రెస్ పార్టీకి బీజేపీ సరెండర్ అయిందన్నారు. అంబెడ్కర్ విగ్రహం, అమరవీరుల స్థూపంలో అవినీతి జరిగితే విచారణ చేయమని చెప్పండి. బిఆర్ఎస్ పార్టీపైన, కేసీఆర్(KCR) పైన ఎవరు మాట్లాడినా ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ మాట్లాడుతూ.. గోదావరి బనకచర్లపై బీజేపీ వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. గోదావరి జలాలపై బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదన్నారు. సమావేశంలో గోసుల శ్రీనివాస్ యాదవ్, కురువ విజయ్ కుమార్, కట్ల స్వామి యాదవ్ పాల్గొన్నారు.

Also Read: Anil Sunkara: ఆ రెండు సినిమాలు ప్లాప్ తర్వాత నిర్మాత ఏం చేశాడంటే?.. రూ.80 కోట్లు నష్టం..

Just In

01

Sankranthi 2026: కళ్యాణ్ పడాల, తనూజ కలిసి డ్యాన్స్.. బిగ్ బాస్ తర్వాత మళ్లీ ఈ వేడుకలోనే!

The Raja Saab: ‘ది రాజా సాబ్’ థియేటర్లో మొసళ్లు.. వీళ్లు మాములు ఫ్యాన్స్ కాదు బాబోయ్!

MP Kiran Reddy: రాయలసీమ రొయ్యలపులుసు తిన్న దొంగ ఎవరు?.. ఎంపీ చామల వ్యంగ్యాస్త్రాలు

Jana Nayagan: ‘అఖండ 2’కు ఆర్థిక ఇబ్బందులు.. మరి ‘జన నాయగన్’కు?

Newborn Dies: గుడిలో వదిలివేసిన శిశువు మృతి.. వైద్యులు తెలిపిన కారణాలివే