Anil Sunkara: సంక్రాంతి బరిలో నేనూ ఉన్నానంటూ ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు శర్వానంద్. తాజాగా ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా నిర్మాత అనిల్ సుంకర ఇచ్చిన ఇంటర్వ్యూ తెగ వైరల్ అవుతోంది. అఖిల్ అక్కినేనితో తీసిన ఏజెంట్, మెగాస్టార్ తో తీసిన భోళా శంకర్ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఈ రెండు సినిమాలతో దాదాపు రూ.80 కోట్లు వరకూ నష్టపోయానంటూ నిర్మాత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. రెండు పెద్ద సినిమాలు కనీస వసూల్లు కూడా చేయకపోవడంతో ఈ నష్టం వాటిల్లిందని నిర్మాత వాపోయారు. ఈ రెండు సినిమాల పరాజయాల గురించి ఆయన నిజాయితీగా మాట్లాడారు. ‘ఏజెంట్’ విషయంలో తాము కొంత ‘ఓవర్ అంబిషియస్’గా వెళ్ళామని, సరైన స్క్రిప్ట్ కంటే కాంబినేషన్ నమ్ముకోవడం వల్ల దెబ్బతిన్నామని ఒప్పుకున్నారు. అఖిల్ తన 100% ప్రయత్నం చేశారని, అతనికి హిట్ ఇవ్వలేకపోవడం తన రిగ్రెట్ అని తెలిపారు. అంతే కాకుండా భోళా శంకర్ విషయంలో కూడా పొరపడ్డామని, ఆ సినిమా అసలు వెర్షన్ వేదాళం తమిళ్ ల్లో హిట్ సినిమా అయినందున, ఇక్కడ కనీసం వసూల్లు చేస్తుందనుకున్నారు. కానీ అప్పటికే కోవిడ్ ప్రభావం వల్ల అందరూ ఆ సినిమా చూసేశారనీ.. ఏం చేయలేని పరిస్థితుల్లో భోళా శంకర్ విడుదల చేయాల్సి వచ్చిందని దీంతో సినిమా అట్లర్ ఫ్లాప్ గా నిలిచిందన్నారు. ఈ రెండు సినిమాలే దాదాపు రూ.80 కోట్లు నష్టం తెచ్చిపెట్టాయని దీంతో బిజినెస్ మార్చుకోవాల్సి వచ్చింది అని కూడా చెప్పారు.
Read also- Ticket Rates: టికెట్ రేట్లు పెంచడంపై తెలంగాణ హైకోర్టు ఏం చెప్పిందంటే?.. నిర్మాతలు సేఫ్..
టాలీవుడ్ ఇండస్ట్రలో చాలా మంది డబ్బు కోసమో, ఫేమ్ కోసమో సినిమా లు చేస్తుంటారు. సినిమానే ఫ్యాషన్ గా కలిగిన, నటులు చాలా తక్కువ మంది ఉంటారు. అందుకు నిదర్శనం అఖిల్ అక్కినేని, అయ్య గారు తన మంచి మనసును మరో సారి చాటుకున్నారు. అనిల్ సుంకర నర్మాతగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన అఖిల్ ఏజెంట్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత డిజాస్టర్ గా నిలిచిందో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన అనిల్ సుంకర తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఏజెంట్ సినిమా విషయంలో అఖిల్ వ్యవహరించిన తీరు మాట్లాడారు. ఆ సినిమా తర్వాత ఆయన పిలిచి మన ఒక చిన్న సినిమా చేద్దాం అన్నారని చెప్పుకొచ్చారు. అలా కాదని నిర్మాత పద్ద సినిమాలు పంపినా వద్దు సార్ మనం చిన్న సినిమానే చేద్దం అని అఖిల్ చెప్పిన దాన్ని చెబుతూ నిర్మాత ఎమోషనల్ అయ్యారు. దీనిని చూసిన నెటిజన్లు అఖిల్ అందుకే అయ్యగారు అయ్యారంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
Read also-Megastar Movie: మెగాస్టార్ ‘మన శంకరవరప్రసాద్ గారు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే?

