Paidi Rakesh Reddy: హరీశ్‌ను ఉరి తీసినా తప్పులేదు: రాకేశ్ రెడ్డి
Paidi Rakesh Reddy (imagecredit:twitter)
Political News, Telangana News

Paidi Rakesh Reddy: హరీశ్‌ను ఉరి తీసినా తప్పులేదు: ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Paidi Rakesh Reddy: బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇలాంటి ప్రభుత్వాలు ఉంటే మళ్లీ తాను ఎన్నికల్లో పోటీ చేయనని, ప్రస్తుత రాజకీయాలు తనకు నచ్చడం లేదని ఆయన వెల్లడించారు. శనివారం అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయన, ప్రస్తుత సర్కార్ వల్ల ఉత్తర తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు, పదవులు అన్నీ దక్షిణ తెలంగాణ వారే దోచుకుపోతున్నారని ఆయన విమర్శించారు. బీసీ(BV)ని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పినా ప్రజలు తమను ఓడించారని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

Also Read: Sudheer Reddy Arrest: హైదరాబాద్‌లో ఏపీ ఎమ్మెల్యే కొడుకు అరెస్ట్.. గంజాయి పాజిటివ్

అంచనాలు పెంచడం

కృష్ణా నదీ జలాల్లో కేవలం 299 టీఎంసీలకు సంతకం పెట్టిన మాజీ ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు(Harish Rao)ను ఉరి తీసినా తప్పులేదని రాకేశ్ రెడ్డి(Rakesh Reddy) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇరిగేషన్ రంగంలో దోపిడీకి పాల్పడిన వారికి తాలిబన్ చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంచనాలు పెంచడం కోసమే జూరాల నుంచి శ్రీశైలం(Srisailam) వరకు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును మార్చారని, ఇందుకు సలహాలు ఇచ్చిన అధికారులను కూడా కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు. కాంగ్రెస్(Congress) ప్రభుత్వం బీసీని ముఖ్యమంత్రిని చేస్తామంటే గవర్నర్ అపాయింట్‌మెంట్‌ను తామే తీసుకుంటామని స్పష్టం చేశారు. రెండేళ్ల నుంచి ఇరిగేషన్ మంత్రి నవ్వుతూ కనిపిస్తున్నారే తప్ప అభివృద్ధి మాత్రం శూన్యమని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు.

Also Read: Telangana Politics: సర్కారు స్ట్రాటజీతో సతమతమవుతున్న ప్రతిపక్షాలు.. రెండు పార్టీలపై కాంగ్రెస్ ఎటాక్!

Just In

01

MLC Naveen Rao: ఆరోపణల పేరుతో అవాస్తవాలను నమ్మొద్దు.. సిట్ ఎప్పుడు పిలిచినా సహకరిస్తా: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు!

BRS: వాకౌట్ చేసి తప్పు చేశామా? గులాబీ గూటిలో ఒక్కటే చర్చ!

Harish Rao: కాళేశ్వరంపై కక్ష.. పాలమూరుపై పగ.. రాష్ట్రానికి నెంబర్ వన్ విలన్ కాంగ్రెస్!

Kavitha: ఒక్క మాటంటే.. బాయ్‌కాట్ చేస్తారా? ఈ నిర్ణయం అధిష్టానానిదా.. హరీశ్ రావుదా?

Sankranti 2026: ఇద్దరు భామలతో గ్లామర్ ప్రదర్శన మొదలెట్టారు.. పాపం చిరుకి ఆ ఛాన్స్ లేదుగా!