Bhatti Vikramarka: రిజిస్ట్రేషన్ శాఖలో ఆదాయం పెంపుపై నివేదిక
Bhatti Vikramarka (imagecredit:twitter)
Telangana News

Bhatti Vikramarka: రిజిస్ట్రేషన్ శాఖలో ఆదాయం పెంపుపై నివేదిక ఇవ్వండి: భట్టి విక్రమార్క

Bhatti Vikramarka: కమర్షియల్ టాక్స్ శాఖలో ఆదాయం పెంచేందుకు సర్కిల్ వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించాలని ఆ శాఖ ఉన్నతాధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు(Bhatti Vikramarka Mallu) ఆదేశించారు. సచివాలయంలో రాష్ట్ర ఆదాయ వనరుల సమీకరణ సమావేశం నిర్వహించారు. సమావేశంలో క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులు, మంత్రులు జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao), దుదిల్ల శ్రీధర్ బాబు(Sridhar Babu) పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ వివిధ రకాల వస్తువుల వారీగా సమీక్ష చేయాలని ఆదేశించారు. కమర్షియల్ టాక్స్(Commercial Tax) విభాగానికి సంబంధించి ఇతర రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులను అధ్యయనం చేసి ఆదాయం పెంపునకు మార్గాలు అన్వేషించాలి అన్నారు.

రిజిస్ట్రేషన్ శాఖలో ఆదాయం

స్టాంప్స్, రెవెన్యూ శాఖలో ఆదాయం పెంపునకు గత సంవత్సరం వేసిన కమిటీ, ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టు పరిస్థితిపై డిప్యూటీ సీఎం సమీక్షించారు. స్టాంప్స్, రిజిస్ట్రేషన్(Stamps, registration) శాఖతో ముడిపడి ఉన్న హెచ్ఎండిఏ(HMDA), జిహెచ్ఎంసి(GHMC), హౌసింగ్ బోర్డు వంటి ఇతర శాఖలను సమన్వయం చేసుకొని ప్రత్యేక సమావేశం నిర్వహించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఆదాయం పెంచేందుకు అన్ని శాఖలను సమన్వయం చేసుకునే అంశాన్ని చీఫ్ సెక్రటరీ సీరియస్గా తీసుకోవాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖలో ఆదాయం పెంపుదలకు సంబంధించి లోతుగా అధ్యయనం చేసి 15 రోజుల్లో నివేదిక తెప్పించాలని చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు(Ramakrishna Rao)ను ఆదేశించారు.

Also Read: Ind Vs Pak Toss: టాస్ గెలిచిన పాకిస్థాన్.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే?

ఆదాయం పెంపుకు చర్యలు

రవాణా శాఖలో నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోకపోవడానికి కారణాలు వాటిని అధిగమించేందుకు అలాంటి చర్యలు తీసుకోవాలి, అవసరమైతే ప్రత్యేక పాలసీ రూపొందిస్తామని మంత్రులు తెలిపారు. ఆదాయ వనరుల సమీక్ష సమావేశానికి వచ్చే ముందు అన్ని శాఖల ఉన్నతాధికారులు ఆయా శాఖలో ఆదాయం పెంపుదలకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఒక స్పష్టమైన నివేదికతో సమావేశానికి హాజరుకావాలని డిప్యూటీ సీఎం సూచించారు. సమావేశంలో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా(Sandeep Kumar Sultania), కమర్షియల్ టాక్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ రిజ్వీ, స్టాప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు, రవాణా శాఖ కమిషనర్ సురేంద్రమోహన్, కమర్షియల్ టాక్స్ కమిషనర్ హరిత, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Also Read: Dornakal Politics: డోర్నకల్‌లో రగులుతున్న రాజకీయం.. స్ధానిక పట్టుకోసం విశ్వ ప్రయత్నాలు

Just In

01

Govt Hospitals: ఇకపై ప్రభుత్వ ఆసుపత్రిలో ‘క్లీన్’ ఆపరేషన్.. ప్రజల సహకారం కోరిన డీఎంఈ

Student Suicide: పరీక్షల ఒత్తిడితో రాయగఢ్ హాస్టల్‌లో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య.. కన్నీరు పెట్టిస్తున్న చివరి లేఖ

Mahesh Training: ‘వారణాసి’ కోసం ‘కలరిపయట్టు’ నేర్చుకుంటున్న మహేష్ బాబు.. ఇది వేరే లెవెల్..

Girl Kills Father: నాన్నకు డ్రగ్స్ ఇచ్చి.. మత్తులోకి జారుకున్నాక దగ్గరుండి ప్రియుడితో చంపించిన బాలిక

Manikrao Kokate: మాజీ మంత్రి కోకటేకు ఊరట.. మోసం కేసులో శిక్ష అమలును నిలిపివేసిన సుప్రీంకోర్టు