Ambedkar University: అంబేద్కర్ వర్సిటీలో ప్రవేశాల గడువు పెంపు
ambedkar-university
Telangana News, లేటెస్ట్ న్యూస్

Ambedkar University: అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు పొడిగింపు

Ambedkar University: రిజిస్ట్రేషన్‌కు ఈ నెల 26 వరకు అవకాశం కల్పన

శనివారం అంబేద్కర్ వర్సిటీ పీహెచ్‌డీ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహణ

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : అంబేద్కర్ వర్సిటీలో డిగ్రీ కోర్సులు (బీ.ఏ/బీ.కాం/బీ.ఎస్సీ), పీజీ కోర్సులు (ఎం.ఏ/ఎంకాం/ఎంఎస్సీ, ఎంబీఏ), బీఎల్ఐఎస్‌సీ, ఎంఎల్ఐఎస్౨సీ, డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో 2025-26 విద్యాసంవత్సరంలో (Ambedkar University) ప్రవేశాలకు గడువు పొడిగించారు. ఈనెల 26 వరకు రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పిస్తున్నట్టు విశ్వవిద్యాలయ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి సమాచారం, ఆన్ లైన్‌లో నమోదు, తదితర అంశాలపై సందేహాలు ఉంటే సమీపంలోని అధ్యయన కేంద్రంలో సంప్రదించాలని సూచించారు. లేదా, విశ్వవిద్యాలయ హెల్ప్ డెస్క్ నంబర్లు 040-23680 333/444/555, టోల్‌ఫ్రీ నంబర్ 18005990101లను సంప్రదించొచ్చని సూచించారు. పూర్తి వివరాల కోసం www.braouonline.in లేదా www.braou.ac.in లో సంప్రదించాలని విద్యార్థులకు సూచించారు.

Read Also- Hyderabad Crime News: రేణు అగర్వాల్ హత్య కేసులో.. కీలక ఆధారాలు వేలుగులోకి?.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

నేడు అంబేద్కర్ వర్సిటీ పీహెచ్‌డీ ఎంట్రెన్స్ టెస్ట్

అంబేద్కర్ వర్సిటీ పీహెచ్ డీ ఎంట్రెన్స్ టెస్ట్ శనివారం (సెప్టెంబర్ 13) జరగనుంది. ఎల్బీ నగర్ సర్కిల్‌లోని అయాన్ డిజిటల్ జోన్(ఐడీజెడ్)-(9577) రంగారెడ్డి, హైదరాబాద్‌లో ఎగ్జామ్ నిర్వహిస్తున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. ఎంట్రెన్స్ టెస్ట్‌కు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి ఒక గంట ముందుగా చేరుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం విశ్వవిద్యాలయ పోర్టల్‌ www.braouonline.in లేదా వెబ్ సైట్ www.braou.ac.in లేదా 040-23680411/498/ 240 లో సంప్రదించాలని సూచించారు.

Read Also- Tummala Nageswara Rao: రైతులకు అవసరమైన ఎరువులు సరఫరా చేయాలి.. అధికారులతో మంత్రి సమీక్ష

 13 నుంచి గ్రూప్-2 సర్టిఫికెట్ వెరిఫికేషన్

ఈనెల 13 నుంచి 15 వరకు కొనసాగనున్న ప్రక్రియ
వెల్లడించిన టీజీపీఎస్సీ

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: గ్రూప్ 2 థర్డ్ స్పెల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ శనివారం (సెప్టెంబర్ 13) నుంచి కొనసాగనుంది. ఈనెల 13 నుంచి 15 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీ(పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ)లో నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు వెరిఫికేషన్ మెటీరియల్‌ను https://www.tgpsc.gov.in వెబ్‌సైట్‌లో తెలుసుకోవాలని సూచించారు. ప్రతిరోజు ఉదయం 10:30 గంటలకు ఈ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు.

Read Also- Revanth Reddy: గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి… అధికారులకు సీఎం ఆదేశం

Just In

01

Kavitha: జాగృతి పోరాటం వల్లే.. ఐడీపీఎల్ భూముల ఆక్రమణపై విచారణ : కవిత

Virat Anushka: విరాట్ కోహ్లీ, అనుష్కలపై మండిపడుతున్న నెటిజన్లు.. ప్రేమానంద్ జీ చెప్పింది ఇదేనా?

Telangana BJP: పీఎం మీటింగ్ అంశాలు బయటకు ఎలా వచ్చాయి? వారిపై చర్యలు తప్పవా?

Harish Rao: కాంగ్రెస్ హింసా రాజకీయాలను అడ్డుకుంటాం : మాజీ మంత్రి హరీష్ రావు

Kishan Reddy: మోడీతో ఎంపీల మీటింగ్ అంశం లీక్ చేసినోడు మెంటలోడు.. కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం!