Tummala Nageswara Rao (iMAGE credit: swetcha reporter)
తెలంగాణ

Tummala Nageswara Rao: రైతులకు అవసరమైన ఎరువులు సరఫరా చేయాలి.. అధికారులతో మంత్రి సమీక్ష

Tummala Nageswara Rao: రాష్ట్రంలోని రైతులకు అవసరమైన ఎరువుల సరఫరా నిరంతరంగా కొనసాగించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) డిమాండ్ చేశారు. సచివాలయంలో శుక్రవారం యూరియా సరఫరాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రిగారు మాట్లాడుతూ రాష్ట్రంలోని ఆర్ఎప్సీఎల్ ఎరువుల కర్మాగారాన్ని తిరిగి పునరుద్ధరించేలా మరోసారి కేంద్రాన్ని కోరాలని అధికారులను ఆదేశించారు.

 Alson Read: Bhupalpally Heavy Rains: భూపాలపల్లి జిల్లాలో పిడుగుపాడుకతో 100కు పైగా గొర్రెలు మృతి.. ఎన్ని లక్షల నష్టమంటే..?

రాష్ట్రానికి శుక్రవారం 11,930 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అయిందన్నారు. గత రెండు రోజులలో 23వేల మెట్రిక్ టన్నులు యూరియా రాష్ట్రానికి సరఫరా జరిగిందని, మరో 4 రోజుల్లో రాష్ట్రానికి 27,650 మెట్రిక్ టన్నుల యూరియా రానుందని వెల్లడించారు. రైతులకు ఎరువుల పంపిణీ అంతరాయం లేకుండా ఉండేందుకు రైతు వేదికలలో కూడా సేల్స్ పాయింట్లు ఏర్పాటు చేయాలని మరోసారి జిల్లా అధికారులను ఆదేశించారు. వ్యవసాయశాఖ సెక్రటరీ రఘునందన్ రావు, డైరెక్టర్ గోపి పాల్గొన్నారు.

ఇక్రీశాట్ తో కలిసి పనిచేస్తాం

వ్యవసాయ అభివృద్ధికి ఇక్రిశాట్ తో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుగారు తెలిపారు. సచివాలయం లో శుక్రవారం ఇక్రిశాట్ ప్రతినిధులతో బేటీ అయ్యారు. క్రిశాట్ సంస్థ ప్రతినిధులు చిక్కుళ్ళు, తృణధాన్యాల మెరుగైన రకాలతో పాటు, వివిధ పంటలలో తాము అమలు చేస్తున్న వ్యవసాయ సాంకేతిక పద్ధతులను వివరించారు. ఇక్రిశాట్, గాణ రాష్ట్రాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం ద్వారా రాష్ట్రంలో వ్యవసాయ రంగం మరింతగా ఎలా అభివృద్ధి చెందుతుందనేదానిపై చర్చించారు. ఇక్రిశాట్ తెలంగాణతో తన భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలని కోరుకుంటోందని, తెలంగాణలో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందడానికి అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందిస్తామని తెలిపారు. డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ స్టాన్‌ఫోర్డ్ బ్లేడ్, జనరల్-రీసెర్చ్ డాక్టర్ హరి కిషన్ పాల్గొన్నారు.

 Also Read: Girls on Married Men: పెళ్లైన మగాళ్లపై అమ్మాయిలు ఎందుకు మోజు పడుతున్నారు? దాని వెనుకున్న కారణాలివే!

Just In

01

Disha Patani: ఇంటి ముందు కాల్పులు.. షాక్‌లో దిశా పటానీ.. విషయం ఏమిటంటే?

Ambedkar University: అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు పొడిగింపు

New Train Service: అందుబాటులోకి కొత్త రైల్వే లైన్.. పచ్చజెండా ఊపనున్న ప్రధాని మోదీ

Anupama Parameswaran: థియేటర్లలోకి ‘కిష్కింధపురి’.. సైలెంట్‌గా ఓటీటీలోకి మరో సినిమా!

Hyderabad Crime News: రేణు అగర్వాల్ హత్య కేసులో.. కీలక ఆధారాలు వేలుగులోకి?.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!