Abortion Cases (imagecredit:twitter)
తెలంగాణ

Abortion Cases: సిటీ పబ్లిక్‌లో డిఫరెంట్ ఓపీనియన్.. సంచలన విషయాలు వెలుగులోకి?

Abortion Cases: ఈసీఐఎల్ కు చెందిన ఓ వ్యక్తి (28)కి ఏడాది క్రితం మ్యారేజ్ అయింది. భార్యాభర్తలిద్దరూ ప్రైవేట్ జాబ్స్ చేస్తారు. కొద్ది రోజుల క్రితం వాళ్ల భార్యకు ప్రెగ్నెన్సీ వచ్చింది. అయితే వారిద్దరు పిల్లలు ఇప్పుడే వద్దనుకొని, ఓ డాక్టర్ ను సంప్రదించి అబార్షన్ చేయించుకున్నారు. మరో ఏడాది తర్వాత వాళ్లు పిల్లలు పొందాలని భావిస్తున్నారు. ఇలా ఈ ఫ్యామిలే కాదు.. సిటీల్లో నివసిస్తున్న చాలా మంది కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ల ఆలోచన తీరు ఇలా ఉన్నదని కేంద్ర ఆరోగ్యశాఖ సర్వేలో తేలింది. ఉద్యోగాలు స్ధిరమైనప్పుడు, ఆర్ధికంగా మరింత వృద్ధి చెందే వరకు పిల్లలు వద్దనుకునే జంటలు మెట్రోపాలిటన్ సిటీల్లో పెరుగుతున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో అబార్షన్ల రేషి(Abortion Ratio)యో కూడా పెరుగుతున్నట్లు ఆ సర్వేలో పొందుపరిచారు. లేట్ ప్రెగ్నెన్సీల కోసం కొందరు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు(Family planning operations) ఆలస్యంగా నిర్వహించడం వస్తున్న ప్రెగ్నెన్సులకు బ్రేక్ లు వేసేందుకు అబార్షన్లు పెరిగిపోతున్నట్లు గైనకాలజిస్టులు చెప్తున్నారు.

నేరం అనే అపోహతో

రూరల్ ఏరియాలో ఆర్ధిక సమస్యలతో కొందరు అబార్షన్లు చేయించుకుంటున్నారు. అయితే ఈ అబార్షన్లలో 20 నుంచి 25 శాతం మాత్రమే ఆసుపత్రులలో లేదా నిపుణుల పర్యవేక్షణలో జరుగుతున్నాయని గుర్తించారు. అబార్షన్ అనేది చట్టరీత్యా నేరం అనే అపోహతో మిగిలిన 75 నుంచి 80 శాతం అబార్షన్లు అసురక్షితమైన వాతావరణంలో జరుగుతున్నట్లు తేలింది. గ్రామ స్థాయిలోని మెడికల్ ప్రాక్టిషనర్లు, ఆర్ ఎంపీలు(RMP), పీఎంపీ(PMP)ల వంటి వాళ్ల వద్దకే అబార్షన్ల కేసులు ఎక్కువగా వస్తున్నట్లు నిర్ధారించారు. పబ్లిక్ లో అవగాహన పెంచుతూ వీటన్నింటినీ నియంత్రించాల్సిన అవసరం ఉన్నదని కేంద్ర ఆరోగ్యశాఖ అన్ని రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది.

తెలంగాణలో 16వేల అబార్షన్లు..??

20242025లో రాష్ట్రంలో 16,059 అబార్షన్లు జరిగినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ(Union Health Ministry) రికార్డులో నమోదు చేశారు. 20202021లో కేవలం 1578 అబార్షన్లు జరుగుగా, 20212022లో 3114, 202223లో 4071, 202324లో 12,365, అబార్షన్లు జరిగినట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. అయితే గడిచిన ఐదేళ్లతో పోల్చితే తెలంగాణ(Telangana)లో ఏకంగా 900 శాతానికి పైగా అబార్షన్లు పెరిగాయి. అయితే దేశ వ్యాప్తంగా అబార్షన్లు ట్రెండ్‌ పెరుగుతున్నప్పటికీ, కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉన్నదని కేంద్రం సూచించింది. దేశంలో మహారాష్ట్ర ((Maharasta)), తమిళనాడు(Thamilanadu), అసోం(Asom), కర్ణాటక(Karnataka), రాజస్థాన్(Rajasthan) రాష్ట్రాల్లో అత్యధిక అబార్షన్లు జరిగినట్లు కేంద్రం తన రిపోర్టులో పేర్కొన్నది

. ఈ ఏడాదిలో మహరాష్​ట్రలో ఏకంగా 2 లక్షలకు పైనే అబార్షన్లు జరుగుగా, తమిళనాడులో లక్షకు పైగా, అసోం, కర్ణాటకలో ఒక్కో రాష్​ట్రంలో 70 వేలకు పైగా చొప్పున అబార్షన్లు జరిగాయి. రాజస్థాన్ లో 50 వేలకుపైగా అబార్షన్లు జరగడం ఆందోళన కలిగించే అంశంగా కేంద్రం స్పష్టం చేసింది. మిగతా రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ లో తక్కువగానే అబార్షన్లు జరుగుతున్నా..అన్ క్వాలిఫైడ్ వ్యవస్థలో జరిగే వాటిని కట్టడి చేయడంతో పాటు సంతానోత్పత్తి పై ప్రజల్లో అవగాహన పెంచాలని కేంద్రం అలర్ట్ ఇచ్చింది.

Also Read: Gadwal district: విద్యార్థులకు విద్యతో పాటు ఇవి కూడా ముఖ్యమే: కలెక్టర్ సంతోష్

వైద్యులను సంప్రదించిన తర్వాతనే ఫ్యామిలీ ప్లానింగ్ : డాక్టర్ జీ లత

గర్భం రాకుండా నివారించగలిగే అనేక ఆప్షన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పటికీ, వాటి గురించి అవగాహన లేక, చాలామంది అబార్షన్ చేయించుకుంటున్నారు. గర్భస్రావం సమయంలో మహిళ చాలా రక్తం కోల్పోతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఒక వేళ పిల్లలు ఆలస్యంగా కావాలనుకునే భార్యభర్తలు డాక్టరు ను సంప్రదిస్తే, సదరు మహిళ ఆరోగ్య పరిస్థితులు ఆధారంగా ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్(Family Planning Methods) సూచిస్తారు. సెల్ఫ్​ డిసిషన్స్(Self-Decisions) మాత్రం తీసుకోకూడదు. ఇక కొందరు అత్యవసర పరిస్థితుల్లో వాడాల్సిన ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ పిల్‌ను నెలకి రెండు, మూడుసార్లు వాడటం వల్ల కూడా రకరకాల దుష్ప్రభావాలు ఎదుర్కొంటున్నారు .లైంగిక ఆరోగ్యంపై అవగాహన లేకపోవడం, లైంగిక జీవితం గురించి మాట్లాడటంపై విముఖత వంటివి కూడా స్ట్రెస్ కు కారణమవుతున్నాయి. ఎవరిని సంప్రదించాలో తెలియక యువత, కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలు విపరీతమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఇవి కూడా అబార్షన్లకు కారణమవుతున్నాయి.

ఇల్లీగల్ అబార్షన్లపై ప్రభుత్వం ఫోకస్ పెంచింది: డాక్టర్ రాజీవ్

ఇల్లీగల్ అబార్షన్లపై ప్రభుత్వం ఇప్పటికే ఫోకస్ పెంచింది. గ్రామ స్థాయిలలోనూ అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇందుకు ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యావాదాలు. అయితే అబార్షన్ల విషయంలో ప్రజల్లోనూ మరింత అవగాహన పెరగాలి. ఆడ(Female), మగ(Male) బిడ్దలు, ఆలస్యపు ప్రెగ్నెన్నీలు వంటి వాటిపై గైనకాలజిస్టుల సలహాలు, సూచనలు తప్పనిసరి. అప్పుడే ప్రాణ నష్టాలు జరగకుండా నియంత్రించవచ్చు.

Also Read: Highest Stray Dogs State: దేశంలో ఎన్ని కుక్కలు ఉన్నాయో తెలుసా? ఈ లెక్కలు చూస్తే మతిపోవాల్సిందే!

Just In

01

Akhanda 2: సర్వేపల్లి సిస్టర్స్.. థమన్ అసలు ఏం చేస్తున్నావయ్యా?

Janagam: కాసేపట్లో ఇంటికి వచ్చేస్తానమ్మా.. అని చెప్పిన కొద్దిసేపటికే వరదలో యువతి గల్లంతు.. జనగాంలో విషాదం

Mahabubabad Shocking: ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం.. బతికుండగానే మార్చురీకి పేషెంట్.. రాత్రంతా శవాల మధ్యనే

IRCTC News: రైల్వే ప్యాసింజర్లూ బీ అలర్ట్.. ఆ రోజు నిలిచిపోనున్న ఐఆర్‌సీటీసీ సేవలు!

Book My Show: ‘బాహుబలి ది ఎపిక్’తో మాస్ మహారాజాకు దెబ్బపడేలానే ఉందిగా..