Xiaomi: షియోమీ త్వరలో భారత మార్కెట్‌లో Redmi Note 15 సిరీస్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమైంది. కంపెనీ ఇప్పటికే Redmi Note 15 5G 108 MasterPixel Editionకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది. ఇది బేస్ మోడల్‌గా భావిస్తున్నారు. అధికారిక విడుదల తేదీ ప్రకటించనప్పటికీ, రిపోర్ట్స్ ప్రకారం ఈ సిరీస్ 2026 జనవరి మొదటి వారంలో భారత మార్కెట్‌లోకి రానుంది. Pro, Pro Plus మోడళ్లు దీనికంటే కొద్దిరోజుల తర్వాత అందుబాటులోకి వచ్చే అవకాశముంది.
ఫీచర్లు
డిస్‌ప్లే పరంగా చూస్తే, Redmi Note 15లో 6.77 అంగుళాల AMOLED స్క్రీన్, Full HD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ లభించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా, చైనా వెర్షన్‌లో ఉన్న IP65 రేటింగ్‌కు బదులుగా భారత మార్కెట్‌లో IP68 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో ఈ మోడల్ అందుబాటులోకి రానుండటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
పర్ఫార్మెన్స్ విషయంలో, ఈ డివైస్‌కు Qualcomm Snapdragon 6 Gen 3 చిప్‌సెట్ పవర్ అందించనుంది. అలాగే, Android 16 ఆధారిత HyperOSతో డివైస్ బాక్స్ నుంచే రానుంది. RAM , స్టోరేజ్ వేరియంట్లపై కంపెనీ ఇంకా వివరాలు వెల్లడించలేదు. లాంచ్ సమయానికి ఈ ఫోన్ కి సంబంధించి పూర్తి వివరాలు తెలిసే అవకాశముంది.
కెమెరా విషయంలో, Xiaomi ఇప్పటికే Redmi Note 15 5G 108 MasterPixel Editionలో 108MP ప్రైమరీ కెమెరా ఉండనుందని ధృవీకరించింది. దీనికి తోడు 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ కూడా అందుబాటులో ఉండవచ్చు. సెల్ఫీల కోసం 20MP ఫ్రంట్ కెమెరా ఇవ్వనున్నట్లు సమాచారం.
Also Read: MLC Kavitha: గులాబీ నాయకులకు కవిత గుబులు.. ఎవరి అవినీతిని బయట పడుతుందో అని కీలక నేతల్లో టెన్షన్!
బ్యాటరీ విషయానికి వస్తే, Redmi Note 15 మోడల్‌లో 5,520mAh పెద్ద బ్యాటరీతో పాటు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండనుందని లీకులు చెబుతున్నాయి. Redmi Note సిరీస్ సాధారణంగా లాంగ్ బ్యాటరీ లైఫ్‌ను ప్రాధాన్యంగా ఉంచుతుండగా, ఈ మోడల్ కూడా అదే ధోరణిని కొనసాగించనుంది.
ధరలు, వేరియంట్లు, సేల్ తేదీలు వంటి అదనపు వివరాలు Xiaomi అధికారిక లాంచ్ ఈవెంట్ సమయంలో వెల్లడించనుంది. ఇప్పటివరకు తెలిసిన వివరాలను బట్టి, Redmi Note 15 సిరీస్ పెద్ద AMOLED స్క్రీన్, 108MP కెమెరా, మెరుగైన ప్రొటెక్షన్ రేటింగ్, శక్తివంతమైన హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్స్‌తో వినియోగదారులను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉంది.

