Vivo S50 Launch: త్వరలో వీవో నుంచి కొత్త ఫోన్ రిలీజ్..
Vivo S50 Launch ( Image Source: Twitter)
Technology News

Vivo S50 Launch: మరో ఐదు రోజుల్లో వీవో నుంచి కొత్త ఫోన్ రిలీజ్.. ఫీచర్లు ఇవే..!

Vivo S50 Launch: Vivo S50 సిరీస్ అధికారికంగా లాంచ్‌కు సిద్ధమైంది. వీవో గత కొన్ని వారాలుగా వరుసగా రిలీజ్ చేసిన టీజర్‌లతో ఫ్యాన్స్‌లో భారీ ఆసక్తిని పెంచిన S50 సిరీస్‌కి చివరికి లాంచ్ డేట్‌ను ప్రకటించింది. డిసెంబర్ 15న చైనాలో వీవో S50, వీవో S50 ప్రో మినీ అధికారికంగా మార్కెట్‌లోకి రానుంది. ఇప్పటికే చైనాలోని అధికారిక వీవో స్టోర్‌లో ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లకు ప్రీ-రిజర్వేషన్‌లు ప్రారంభమయ్యాయి.

వీవో S50 సిరీస్.. లాంచ్ డేట్, డిజైన్ వివరాలు

వీవో ప్రకటించిన ప్రకారం డిసెంబర్ 15న S50 సిరీస్ చైనాలో డెబ్యూట్ కానుంది. వీవో S50 ప్రో మినీ మూడు కలర్ వేరియంట్లలో రానుంది. కన్ఫెషన్ ( Confession ), ఇన్స్పిరేషన్ పర్పుల్ ( Inspiration Purple) , సెరీన్ బ్లూ ( Space Gray). ఇదే సమయంలో వీవో S50 నాలుగు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. కన్ఫెషన్ (Confession), ఇన్స్పిరేషన్ పర్పుల్ (Inspiration Purple) , సెరీన్ బ్లూ (Serene Blue), స్పేస్ గ్రే (Space Gray)కలర్స్ లో మన ముందుకు రానుంది.

Also Read: Telangana Rising Global Summit: తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ.. సమ్మిట్ ముగింపులో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

Vivo S50 Pro Mini.. పవర్‌ఫుల్ Snapdragon 8 Gen 5 చిప్‌సెట్

ఇప్పటికే వీవో ధృవీకరించిన ముఖ్యమైన అప్‌డేట్ Snapdragon 8 Gen 5 ప్రాసెసర్. ఇది AnTuTuలో 3 మిలియన్‌కు పైగా స్కోర్ సాధించగల శక్తివంతమైన చిప్‌సెట్. ఫోన్‌లో LPDDR5X రామ్ (9600Mbps వరకు స్పీడ్), UFS 4.1 స్టోరేజ్ ఉండనున్నట్లు వీవో వెల్లడించింది. డిస్ప్లే విషయానికి వస్తే, ఇది 6.31-అంగుళాల ఫ్లాట్ ప్యానల్ కలిగి ఉండనుంది. కెమెరా సెటప్‌లో 50MP Sony IMX882 1/1.95-inch పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉండటం ఈ మోడల్‌కు ప్రధాన హైలైట్.

Also Read: Panchayat Elections: గ్రామపంచాయతీ ఎన్నికలకు వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు : కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్!

బ్యాటరీ & చార్జింగ్.. అదే పవర్‌ఫుల్ సెటప్

వీవో S50 ప్రో మినీ, తన మునుపటి మోడల్‌లానే, 6,500mAh పెద్ద బ్యాటరీతో రానుంది. 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 40W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందుతుంది. దీని వల్ల ఇది పవర్ యూజర్లకు మోస్ట్ సూటబుల్ డివైస్‌గా మారుతుందని అంచనా వేస్తున్నారు.

Also Read: Bhavitha Mandava: హైదరాబాద్ మోడల్ ‘ఛానెల్’ షో ఓపెనింగ్ చూసి ఉద్వేగానికి లోనైన తల్లిదండ్రులు .. వీడియో వైరల్..

Vivo S50: స్క్రీన్ & ప్రాసెసర్

వీవో S50 వేరియంట్‌లో 6.59-అంగుళాల 1.5K OLED ఫ్లాట్ డిస్ప్లే ఉంటుందని సమాచారం. ఈ ఫోన్‌కి Snapdragon 8s Gen 3 SoC ఉండే అవకాశాలు ఉన్నాయి. లాంచ్‌కు ముందు మరిన్ని కీలక ఫీచర్లు వచ్చే రోజుల్లో బయటపడే అవకాశముంది. మొత్తానికి, వీవో S50 సిరీస్ లాంచ్ రేసులో ఇప్పటికే హైప్ పీక్స్ చేరుకుంది. శక్తివంతమైన ప్రాసెసర్లు, పెరిస్కోప్ కెమెరా, సాలిడ్ బ్యాటరీ అన్నింటితో వచ్చే ఈ సిరీస్ డిసెంబర్ 15న టెక్ ప్రేమికులకు భారీ అప్డేట్ ఇవ్వబోతోంది.

Just In

01

DekhLenge Saala Released: ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి ‘దేఖ్ లెంగే సాలా’ వచ్చేసింది.. పవర్ స్టార్ స్వాగ్ పీక్స్!

Uttam Kumar Reddy: పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై కేంద్రానికి మంత్రి ఉత్తమ్ లేఖ

Bigg Boss9 Telugu: ఈ వారం ఎలిమినేషన్ గురించి క్లారిటీ ఇచ్చిన నాగార్జున.. ఒకరు కన్ఫామ్!

Sarpanch Elections: సర్పంచ్ బరిలో నిండు గర్భిణీ.. బాండ్ పేపర్ పై హామీలతో ప్రచారం..!

KTR: బీఆర్ఎస్ వెంటే ప్రజలు.. సర్పంచ్ ఎన్నికలే నిదర్శనం.. కేటీఆర్ ధీమా