iQOO 15: iQOO తమ కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ iQOO 15 ను భారత మార్కెట్‌లో అధికారికంగా విడుదల చేసింది. చైనాలో అక్టోబర్‌లో డెబ్యూ అయిన ఈ ఫోన్, భారత్‌లో నవంబర్ 26న లాంచ్ అయింది. డిసెంబర్ 1 నుండి అమ్మకాలు ప్రారంభమయ్యాయి. వినియోగదారులు Amazon, iQOO ఈ-స్టోర్, Vivo ప్రత్యేక స్టోర్స్, దేశవ్యాప్తంగా ఉన్న అథరైజ్డ్ ఆఫ్‌లైన్ రిటైలర్ల ద్వారా ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. సేల్స్ మధ్యాహ్నం 12 గంటలకు మొదలయ్యాయి.
iQOO 15 రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది . ఆల్ఫా (బ్లాక్), లెజెండ్ (వైట్). ఇందులో 6.85 ఇంచుల Samsung M14 AMOLED డిస్ప్లే ఉంది, ఇది 144Hz వరకు రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. దీని వల్ల గేమింగ్, వీడియోలు, డైలీ యూజ్‌లో స్మూత్ విజువల్స్‌ని అనుభవించవచ్చు. ప్రీమియం డిజైన్, స్లీక్ ఫినిష్ కలగలిపి ఈ ఫోన్‌ను హై-ఎండ్ సెగ్మెంట్‌లో బలమైన పోటీదారుగా నిలబెడతాయి.
పర్ఫార్మెన్స్ పరంగా iQOO 15 Qualcomm యొక్క తాజా Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 16GB వరకు RAM ఆప్షన్ ఉన్నందున హై-పర్ఫార్మెన్స్ గేమింగ్ , మల్టీటాస్కింగ్ సులభంగా నిర్వహించవచ్చు. 7,000mAh బ్యాటరీతో వచ్చిన ఈ ఫోన్‌కు 100W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది, కాబట్టి తక్కువ సమయంలోనే ఎక్కువ ఛార్జ్ అవుతుంది.
భారత మార్కెట్‌లో iQOO 15 రెండు వేరియంట్లలో లభిస్తుంది.
12GB + 256GB మోడల్ ధర రూ. 72,999 గా ఉంది.
16GB + 512GB మోడల్ ధర రూ. 79,999 గా ఉంది.
ప్రారంభ ఆఫర్లలో భాగంగా Axis, HDFC, ICICI బ్యాంకుల వలన రూ. 7,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందుతుంది. దీనివల్ల ఫోన్‌ల ఎఫెక్టివ్ ధరలు 12GB మోడల్ కోసం రూ. 64,999 16GB మోడల్ కోసం రూ. 71,999 అవుతాయి. అంతే కాదు, ఎక్స్‌చేంజ్ ఆఫర్లు, రూ. 1,000 ఎక్స్‌ట్రా కూపన్ డిస్కౌంట్, 24 నెలల వరకు నో-కాస్ట్ EMI సౌకర్యం కూడా అందుబాటులో ఉన్నాయి.

