Apple Phones: యాపిల్ అధికారికంగా సిరీని మరో అసిస్టెంట్‌తో రీప్లేస్ చేసే అవకాశం ఇవ్వకపోయినా, తాజా అప్డేటలతో ఐఫోన్ 15 ప్రో సిరీస్ పై మోడల్ యూజర్లకు ఒక అద్భుతమైన మార్గం లభించింది. OpenAI తమ iOS యాప్‌ను అప్‌డేట్ చేయడంతో, ఇప్పుడు యాక్షన్ బటన్‌ను నేరుగా ChatGPT వాయిస్ మోడ్ ప్రారంభించేలా సెటప్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌పై MacRumors ప్రత్యేకంగా రిపోర్ట్ చేసింది.
యాక్షన్ బటన్‌లో ChatGPT… ఇక ఒక్క ప్రెస్‌తో వాయిస్ చాట్!
సైడ్ బటన్ మాత్రం ఇంకా పూర్తిగా సిరీకే కట్టుబడి ఉన్నప్పటికీ, యాక్షన్ బటన్ మాత్రం యూజర్‌కి ఇష్టమైన విధంగా మార్చుకునే అవకాశం ఇస్తుంది. MacRumors ప్రకారం, యాక్షన్ బటన్‌ను ChatGPTకి అసైన్ చేయడం చాలా సింపుల్. ఇది సెటప్ చేసిన తర్వాత ప్రెస్ చేయగానే వెంటనే వాయిస్ చాట్ మొదలవుతుంది, ఎలాంటి మెనూలు, ట్యాపులు అవసరం లేదు. OpenAI ఫ్రీ ఐఫోన్ యాప్ ఇప్పటికే టెక్స్ట్, వాయిస్ ఇన్‌పుట్‌ను సపోర్ట్ చేస్తోంది. ఈ కొత్త సెట్టింగ్‌తో యాక్షన్ బటన్‌ను నొక్కిన క్షణంలోనే రియల్‌టైమ్ ఏఐ సంభాషణ స్టార్ట్ అవుతుంది.
ఎలా సెటప్ చేసుకోవాలి?
యాక్షన్ బటన్‌ను ChatGPT కోసం సెటప్ చేయడం చాలా ఈజీ.. అదెలాగో ఇక్కడ తెలుసుకుందాం..
1. ChatGPT యాప్‌ని ఇన్‌స్టాల్ చేసి, సైన్ ఇన్ అవ్వండి
2. ఆ తర్వాత Settings ఓపెన్ చేయండి
3. Action Button పై ట్యాప్ చేయండి
4. Controls వరకు స్క్రోల్ చేసి, ప్రస్తుత ఎంపికను మార్చేందుకు ఉన్న చెవ్రాన్‌లను ట్యాప్ చేయండి
5. సెర్చ్ లో ChatGPT టైప్ చేయండి
6. Open ChatGPT Voice ఆప్షన్‌ను సెలెక్ట్ చేయండి
ఇప్పటినుంచి యాక్షన్ బటన్‌ను కొంచెం హోల్డ్ చేస్తే చాట్‌జీపీటీ వెంటనే వాయిస్ చాట్ మోడ్‌కు మారుతుంది.
మొదటి సారి ఓపెన్ చేస్తే మైక్రోఫోన్ అనుమతులు అడగొచ్చు. అప్పుడు ‘Allow’ అని నొక్కితే సరిపోతుంది.
ఒక్కే విండోలో టెక్స్ట్ + వాయిస్ ..
OpenAI యాప్ తాజా అప్‌డేట్ వల్ల వాయిస్ చాట్, టెక్స్ట్ చాట్ రెండూ ఇక ఒకటే విండోలో కనిపిస్తాయి. ఏఐ సమాధానాలు వాయిస్ రూపంలో వినిపించడమే కాకుండా స్క్రీన్‌పై టెక్స్ట్‌గా కూడా చూపిస్తాయి. ఎలాంటి విజువల్‌లు జెనరేట్ చేసినా అదే విండోలో కనిపిస్తాయి. దీంతో టైపింగ్ నుండి టాకింగ్‌కు, తిరిగి టాకింగ్ నుండి టైపింగ్‌కు మారడం చాలా ఈజీగా ఉంటుంది. మొత్తానికి, ఇది ఐఫోన్ యూజర్స్‌కి ఒక చిన్న మార్పు అయినా, ఏఐ వినియోగాన్ని పూర్తిగా కొత్త లెవల్‌కి తీసుకెళ్తోంది.
