Kids Mobile: ఫిన్లాండ్‌కు చెందిన Human Mobile Devices (HMD) కంపెనీ, వేర్‌బుల్ తయారీదారు Xploraతో చేతులు కలిపి HMD XploraOne అనే కొత్త టచ్‌స్క్రీన్ ఫోన్‌ను విడుదల చేయడానికి సిద్ధమైంది. మొదటి పరికరంగా పిల్లలు వాడేందుకు అనువుగా రూపొందించిన ఈ ఫోన్‌లో కాలింగ్, మెసేజింగ్ వంటి ప్రాథమిక ఫీచర్లు మాత్రమే ఉండగా, సోషల్ మీడియా యాప్స్, ఇంటర్నెట్ వంటి దృష్టి మళ్లించే అంశాలు పూర్తిగా లేకపోవడం ప్రత్యేకత. అధికారిక ధర, స్పెసిఫికేషన్లు ప్రకటించకపోయినా, ఒక టిప్‌స్టర్ ఇప్పటికే కీలక వివరాలను లీక్ చేశాడు.
డిజైన్, ముఖ్య ఫీచర్లు ఇవే!
Xplora అధికారిక వెబ్‌సైట్‌లో ఇప్పటికే HMD XploraOne లిస్ట్ చేయబడింది. అన్ని కోణాల్లో ఈ ఫోన్ డిజైన్‌ను చూడొచ్చు. ఫోన్‌కు సంబంధించిన ధర, పూర్తిస్థాయి స్పెసిఫికేషన్లు వెల్లడించకపోయినా, ప్రీ-సేల్ ఆఫర్లు పొందేందుకు యూజర్లను రిజిస్టర్ కావాలని సూచిస్తున్నారు.
పిల్లలకు మొదటి ఫోన్‌గా అనువుగా రూపొందించిన ఈ డివైస్‌లో కాలింగ్, టెక్స్టింగ్, ఫ్రంట్, రియర్ కెమెరాలు ఉన్నాయి. టాప్‌లో ఒక ఫిజికల్ బటన్, ఫ్రంట్‌లో నావిగేషన్ బటన్ ఉండటం ఉన్నాయి. క్యాలెండర్, కాలిక్యులేటర్, గ్యాలరీ వంటి అవసరమైన యాప్‌లు మాత్రమే ప్రీలోడ్ చేయబడ్డాయి. ఇంటర్నెట్, సోషల్ మీడియా యాక్సెస్ లేవు. పిల్లలు ఎవరికి కాల్ చేయాలి, ఎవరిని బ్లాక్ చేయాలి అన్న నియంత్రణ పూర్తిగా తల్లిదండ్రుల చేతిలో ఉండేలా ప్యారెంటల్ కంట్రోల్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. అదనంగా లొకేషన్ ట్రాకింగ్ కూడా అందిస్తుంది.
స్పెసిఫికేషన్లు
టిప్‌స్టర్ @smashx_60 వెల్లడించిన వివరాల ప్రకారం, HMD XploraOne లో 3.2-అంగుళాల QVGA IPS డిస్‌ప్లే ఉంటుంది. 2.5D కోటింగ్ కూడా కలిపారు. ఫోటోగ్రఫీ కోసం 2MP రియర్ కెమెరా, 0.3MP ఫ్రంట్ కెమెరా ఇవ్వనున్నారు.
ఈ ఫోన్‌లో Unisoc T127 చిప్‌సెట్, 64MB RAM, 128MB ఇంటర్నల్ స్టోరేజ్ ఉండే అవకాశం ఉంది. అదనంగా 32GB వరకు మైక్రో SD కార్డ్ సపోర్ట్ ఉండొచ్చు. 2,000mAh బ్యాటరీ, USB Type-C ఛార్జింగ్ సపోర్ట్ ఉంటాయని తెలుస్తోంది. IP52 రేటింగ్‌తో రాబోయే ఈ ఫోన్‌లో Bluetooth, GPS, Wi-Fi, FM రేడియో, Gemini AI వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా అందించనున్నారని సమాచారం. చార్ కోల్, సియాన్ బ్లూ అనే రెండు వేరియంట్లలో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
