HMD India Launch: భారత మార్కెట్లో ఫీచర్ ఫోన్ల విభాగంలో HMD గ్లోబల్ తన తాజా ఫోన్లుగా HMD 101, HMD 100ను శుక్రవారం లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్లు సింపుల్ డిజైన్, బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలు, కొన్ని ఆధునిక ఫీచర్లతో వినియోగదారుల్ని ఆకట్టుకుంటున్నాయి.
HMD 101 స్పెసిఫికేషన్లు
HMD 101 1,000mAh బ్యాటరీతో వస్తుంది, ఇది 2.75W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఫోన్ Unisoc 6533G SoC ద్వారా పవర్డ్ అవుతుంది. S30+ OSలో పనిచేస్తుంది. కంపెనీ చెప్పిన దాని ప్రకారం, HMD 101 7 గంటల వరకు టాక్‌టైమ్ అందించగలదు. ఈ ఫోన్ మొత్తం మూడు రంగులలో బ్లూ, గ్రే, టీల్ లో మనకి అందుబాటులో ఉంది.
HMD 100 స్పెసిఫికేషన్లు
HMD 100 కూడా HMD ఫీచర్ ఫోన్ లైన్‌లో భాగంగా ఉంది. ఇది మూడు రంగుల్లో లభిస్తుంది. గ్రే, టీల్, రెడ్ HMD 100లో RAM స్టోరేజ్ వేరియంట్లు సింపుల్‌గా ఉంటాయి. ఫీచర్ ఫోన్లకు తగిన పనితీరును అందిస్తాయి.
Also Read: Panchayat Elections: సోషల్ మీడియా వేదికగానే పోటాపోటీ ప్రచారం.. ఓటర్లను ఆకర్షించేందుకు నూతన ఒరవడులు
ధర ఎంతంటే?
ధరల విషయానికి వస్తే, HMD 101, HMD 100 ప్రారంభ ధరలు భారత మార్కెట్లో రూ.949 (సింగిల్ ర్యామ్ & స్టోరేజ్ వేరియంట్) గా ఉన్నాయి. HMD ఇండియా స్టోర్ ప్రకారం HMD 101 4MB RAM + 4MB స్టోరేజ్ వేరియంట్ రూ.1,049 (MRP రూ.1,199) గా ఉంది. HMD 100 8MB RAM + 4MB స్టోరేజ్ వేరియంట్ MRP ధర రూ.1,099 గా ఉంది. ఈ రెండు ఫోన్లు HMD ఇండియా ఆన్‌లైన్ స్టోర్, ప్రధాన e-commerce ప్లాట్‌ఫారమ్స్, అలాగే ప్రముఖ ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

