Panchayat Elections: సోషల్ మీడియా వేదికగానే పోటాపోటీ ప్రచారం.
Panchayat Elections ( image CREDIT: SWETCHA REPORTER)
Political News

Panchayat Elections: సోషల్ మీడియా వేదికగానే పోటాపోటీ ప్రచారం.. ఓటర్లను ఆకర్షించేందుకు నూతన ఒరవడులు

Panchayat Elections: పంచాయతీ ఎన్నికలు గ్రామాల్లో హీటెక్కిస్తున్నాయి. పోటీ చేస్తున్న అభ్యర్థులు గతానికి భిన్నంగా సోషల్ మీడియాను వినియోగించుకుంటున్నారు. ప్రతి గ్రామంలో వార్డు మెంబర్‌గా పోటీ చేస్తున్నవారు.. సర్పంచ్‌గా బరిలో నిలిచినవారు సోషల్ మీడియా వేదికగాను ప్రచారం చేస్తున్నారు. గ్రామానికి చెందిన వారు ఇతర ప్రాంతాల్లో ఉంటే వారికి సమాచారం చేరవేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. గెలిపిస్తే ఏం చేస్తాం.. అభివృద్ధి పనులు ఇతరాత్రాలను సైతం పోస్టులు పెడుతున్నారు. ఏ వార్డుకు పోటీ చేస్తున్నామనే విషయాన్ని సైతం స్పష్టంగా చెబుతున్నారు. అంతేకాదు ఏ గుర్తు కేటాయించిందనే అంశాలను సైతం ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగ్రాం.. టెలిగ్రాం ఇలా అన్నింటిలోనూ ప్రచారం చేస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు.

గెలిపిస్తే ఏం చేస్తామనేదానిపై పోస్టులు

రాష్ట్రంలో తొలి విడుత, రెండో విడుత బరిలో ఉండే అభ్యర్థుల ప్రకటన జరిగింది. వారికి అధికారులు గుర్తులు సైతం కేటాయించారు. ఈ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు పార్టీ గుర్తులతో జరుగక పోయినప్పటికీ ఆయా పార్టీల మద్దతుతోనే అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే గ్రామాల్లో ఎక్కువగా అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్యే పోటీ తీవ్రంగా నెలకొంది. కొన్ని గ్రామాల్లో కొందరు పార్టీల మద్దతు ఇవ్వకపోవడంతో స్వతంత్రంగా బరిలో నిలిచారు. వారికి సైతం గుర్తులు వచ్చాయి. అయితే ఎన్నికల ప్రచారం స్పీడ్ అందుకుంది. తొలి విడుత ఈ నెల 11న, రెండో విడుత 14న ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే వార్డుల వారీగా ఓటర్ల లిస్టు ప్రకారం వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి గెలిపిస్తే చేయబోయే అంశాలను అందులో పోస్టు చేస్తున్నారు. తనకు ఫలానా గుర్తు కేటాయించారని.. ఆ గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. దీనికి తోడు సోషల్ మీడియాలో ఫొటోలు, కేటాయించిన గుర్తులను పోస్టు చేసి విస్తృత ప్రచారం చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలోనూ ప్రచారం ఊపందుకుంది.

Als Read: Panchayat Elections: వేడెక్కుతున్న పల్లె రాజకీయం.. సర్వశక్తులు ఒడ్డుతున్న ఆశావహులు

హామీలతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం

పోటీ చేసే అభ్యర్థులు ఇంటింటికెళ్లి గెలిపిస్తే ఏం చేస్తామనే విజన్‌ను వివరిస్తున్నారు. గ్రామాభివృద్ధి కోసం ఐదేళ్లలో చేయబోయే కార్యక్రమాల ప్రణాళికలు రెడీ చేశామని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ‘గెలిపిస్తే డ్రైనేజీ సమస్య పరిష్కరిస్తా.. కోతులు గ్రామానికి రాకుండా చేస్తా.. ఊరిలో సీసీ కెమెరాలు పెట్టిస్తా.. గ్రంథాలయం ఏర్పాటు చేస్తా.. మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయిస్తా.. ఒకడుగు ముందుకేసి నిరుద్యోగుల కోసం ఉద్యోగ మేళా, హెల్త్ క్యాంపులు పెట్టిస్తామని.. సీసీరోడ్లు, క్రీడా పరికరాలు’ ఇలా హామీలిస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం మొదలు పెట్టారు. చీరలు, కుంకుమ భరణిలు, వైన్స్, నగదు ఇతర కానుకలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. అన్న, తమ్ముడు, అక్కాచెల్లీ, అత్త, మామ, బాబాయ్​, పిన్ని ఇలా వరుసలు కలుపుతూ పలకరిస్తూ సెంటిమెంట్‌ను ఒక్కసారి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. గతంలో పలుకరించని వారు సైతం పలుకరిస్తూ మరీ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఇంటింటికీ అభ్యర్థులు అనుచరులతో తిరుగుతూ చేసే పనులను సైతం వివరిస్తున్నారు.

మద్దతు దారుల గెలుపు కోసం వ్యూహాలు

సర్పంచ్ ఎన్నికల ప్రచారానికి సమయం దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీల నేతలు గ్రామాలకు చేరుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తమ మద్దతు దారులను గెలిపించుకునేందుకు స్పెషల్ ఫోకస్ పెట్టాయి. పార్టీలకు సంబంధం లేకుండా జరిగే ఎన్నికలే అయినా.. తమ వాళ్లే గెలవాలనే పట్టుదలతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు నియోజకవర్గ ఇన్-ఛార్జ్‌లు, తదితర నాయకులు గ్రామాల బాట పట్టారు. సొంత గ్రామాలపై మరింత ఫోకస్ పెట్టారు. పంచాయతీల్లో పట్టు సాధించి, రానున్న ఎన్నికలకు గట్టి పునాది వేసేలా ముందుకెళ్తున్నారు. తమ సత్తా చాటేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. తమ మద్దతు దారులు గెలిచేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఎదుటి వ్యక్తిలోని లోపాలను తెలుసుకొని ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ఇది ఇలా ఉంటే గ్రామాల్లో మాత్రం సోషల్ మీడియాలో మాత్రం పంచాయతీ ఎన్నికల ప్రచారానికి అభ్యర్థులు వేదికగా చేసుకుంటున్నారు. విస్తృత ప్రచారం చేసుకుంటున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు వీడియోలు సైతం పోస్టు చేస్తున్నారు.

Als Read:Panchayat Elections: ఆ గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి.. ఏకగ్రీవాల కోసం వేలంపాటలు

Just In

01

Shambala Movie: సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘శంబాల’ నుంచి ‘నా పేరు శంబాల’ సాంగ్ రిలీజ్..

Jagga Reddy: కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకుని ఓడినా సరే వారు నాకు సర్పంచులే: జగ్గారెడ్డి

Mowgli Controversy: ‘అఖండ 2’ సినిమా ‘మోగ్లీ’ని డేమేజ్ చేసిందా?.. నిర్మాత స్పందన ఇదే..

Local Body Elections: తెలంగాణ పల్లెల్లో మొదలైన రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్..!

Dharma Mahesh: మరో స్టేట్‌లోనూ మొదలెట్టిన ధర్మ మహేష్..