Harley-Davidson X440T: హార్లే-డేవిడ్‌సన్ తన కొత్త X440T మోడల్‌ను అధికారికంగా అన్‌వీల్ చేసి బైక్ ప్రేమికుల్లో ఆసక్తిని రేకెత్తించింది. డిసెంబర్ 6, 2025న లాంచ్ అవుతున్న ఈ మోడల్, ఇప్పటికే మంచి మార్కెట్ రెస్పాన్స్ తెచ్చుకున్న X440కి మరింత స్పోర్టీ అగ్రెసివ్ వెర్షన్‌గా రూపుదిద్దుకుంది. ఇందులో అనేక కీలక స్టైలింగ్ అప్‌డేట్లు ఉన్నప్పటికీ, ఇంజిన్ మాత్రం పాత మోడల్‌దే కొనసాగుతుంది. బైక్ 440cc సింగిల్-సిలిండర్, ఎయిర్-అండ్-ఆయిల్-కూల్డ్ ఇంజిన్‌తో వస్తోంది. ఇది 6,000rpm వద్ద 27.4PS పవర్, 4,000rpm వద్ద 38Nm టార్క్ ఇస్తుంది. అంచేత నగర డ్రైవింగ్‌కి, హైవేపై క్రూజింగ్‌కి ఇది సరైన కాంబినేషన్.
Also Read: Ramchander Rao: ఫ్యూచర్ సిటీకి కేంద్ర నిధులు ఎందుకు? ప్రభుత్వం కనీసం ఆలోచించిందా? : రాంచందర్ రావు
కొత్త X440T డిజైన్ పరంగా స్టాండర్డ్ X440కి పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది. ఎగ్జాస్ట్‌పై కొత్త హీట్ షీల్డ్, మరింత పొడవుగా ఉండే టెయిల్ కౌల్, స్పోర్టీ బార్-ఎండ్ మిరర్స్, కొత్త రిబ్డ్ సీట్, ఇంకా పూర్తిగా రీడిజైన్ చేసిన రియర్ మడ్‌గార్డ్ వలన బైక్‌కి స్పోర్ట్-క్లాసిక్ ఫీలింగ్ వచ్చింది. అలాగే సైడ్ ప్యానల్, టెయిల్ సెక్షన్‌లో ఉన్న చెక్కర్డ్ గ్రాఫిక్స్ బైక్‌కి ప్రత్యేకమైన స్టాన్స్‌ని ఇస్తాయి.
ఫీచర్ల పరంగా కూడా X440T చాలా ఇంప్రూవ్ చేయబడింది. ఇందులో రైడ్-బై-వైర్ థ్రాటిల్, మల్టిపుల్ రైడింగ్ మోడ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ వంటి ఆధునిక ఫీచర్లు చేరనున్నట్లు సమాచారం. ఈ ఫీచర్లు రైడింగ్ అనుభవాన్ని మరింత స్మూత్, సేఫ్, కంట్రోల్డ్‌గా మార్చడానికి సహాయపడతాయి. హార్లే-డేవిడ్‌సన్ ఈ మోడల్‌ను నాలుగు కొత్త కలర్ వేరియంట్లలో అందిస్తోంది. బ్లాక్, వైట్, రెడ్, డార్క్ బ్లూ లో మన ముందుకు రానుంది.
లాంచ్ సమయానికి ధరపై కూడా ఆసక్తికరమైన అప్‌డేట్లు రావొచ్చని అంచనా. మొత్తం మీద, డిజైన్ అప్‌గ్రేడ్స్ , ప్రీమియం ఫీచర్లతో కొత్త X440T భారత మార్కెట్లో మరోసారి హార్లే క్రేజ్‌ను పెంచే అవకాశం కనిపిస్తోంది.
