Apple AirPods : యాపిల్ ఎయిర్‌పాడ్స్‌కు కలర్ వెర్షన్ వస్తుందా?
apple air pods ( Image Source: Twitter)
Technology News

Apple AirPods : యాపిల్ ఎయిర్‌పాడ్స్‌కు కలర్ వెర్షన్ వస్తుందా?

Apple AirPods : యాపిల్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ అయిన ఎయిర్‌పాడ్స్‌కి ఎప్పటినుంచో ఉన్న తెలుపు రంగు గుర్తింపు త్వరలో మారే అవకాశముందా? తాజాగా వెలుగులోకి వచ్చిన కొన్ని లీక్ ఫోటోలు ఈ ప్రశ్నకు కొత్త చర్చను తెరలేపాయి. పింక్, యెల్లో రంగుల్లో ఉన్న ఎయిర్‌పాడ్స్ ప్రోటోటైప్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Also Read: Nukala Ramachandra Reddy: ప్రజల కోసమే జీవించిన నాయకడు.. తెలంగాణ ఆకాంక్షలకు ప్రతిరూపం నూకల రామచంద్రారెడ్డి!

ప్రారంభ దశలోనే రంగుల ప్రయోగాలు

లీకర్ కోసుటామి (Kosutami) షేర్ చేసిన ఫోటోల ప్రకారం, ఇవి యాపిల్ మొదటి తరం ఎయిర్‌పాడ్స్‌కు సంబంధించిన ప్రారంభ ప్రోటోటైప్స్‌గా భావిస్తున్నారు. 2016లో అధికారికంగా విడుదలైన ఎయిర్‌పాడ్స్‌కు ముందు యాపిల్ అంతర్గతంగా ఈ రంగుల మోడళ్లను పరీక్షించినట్టు తెలుస్తోంది. ఈ ప్రోటోటైప్స్ నార్మల్ గా కాకుండా, దాదాపు ప్రొడక్షన్ స్థాయిలో ఉన్నట్టు కనిపించడం విశేషం. అంటే యాపిల్ అప్పట్లో రంగుల ఎయిర్‌పాడ్స్‌ను సీరియస్‌గా పరిశీలించిన అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు.

Also Read: Govt Land Scam: గుట్టుచప్పుడు కాకుండా ప్రభుత్వ భూమి కబ్జా.. కాలనీ పేరుతో లే అవుట్.. కోట్ల విలువైన భూమికి కన్నం!

iPhone 5c తరహా డిజైన్ ఆలోచన?

ఈ రంగుల ఎంపికలు యాపిల్ గతంలో అనుసరించిన డిజైన్ వ్యూహానికి దగ్గరగా ఉన్నాయని సమాచారం. ముఖ్యంగా iPhone 5c లాంటి మోడళ్లలో యాపిల్ యువతను ఆకర్షించేందుకు బోల్డ్ కలర్స్‌ను ఉపయోగించింది. అదే ఆలోచనను ఎయిర్‌పాడ్స్‌కూ కూడా ఉపయోగించాలని ప్రయత్నం జరిగినట్టు లీకులు సూచిస్తున్నాయి. ఇక 2023లోనూ ఇదే లీకర్, iPhone 7 సిరీస్‌కు సరిపోయేలా పింక్, పర్పుల్, బ్లాక్, రెడ్ వంటి రంగుల్లో ఎయిర్‌పాడ్స్‌ను యాపిల్ పరీక్షించిందని వెల్లడించారు. అయితే అవి కూడా మార్కెట్‌లోకి రాలేదు.

ఇప్పటికీ తెలుపు రంగుకే పరిమితం

ప్రస్తుతం యాపిల్ విక్రయిస్తున్న సాధారణ ఎయిర్‌పాడ్స్, ఎయిర్‌పాడ్స్ ప్రో వైట్ కలర్‌లోనే అందుబాటులో ఉన్నాయి. అయితే యాపిల్ ఆడియో లైనప్‌లో ఒక్క మినహాయింపు AirPods Max మాత్రమే. అవి అనేక రంగుల్లో విడుదలై, తర్వాత కొత్త ఫినిష్‌లతో అప్డేట్ కూడా అయ్యాయి.

Also Read: Goa Nightclub Fire: గోవా నైట్‌క్లబ్ అగ్నిప్రమాదం.. విచారణలో నమ్మలేని నిజాలు.. ఆ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లేనా?

భవిష్యత్తులో మార్పు ఉంటుందా?

ఈ రంగుల ప్రోటోటైప్స్ మళ్లీ వెలుగులోకి రావడం ద్వారా, యాపిల్ అంతర్గతంగా ఎన్నో డిజైన్ ప్రయోగాలు చేసినప్పటికీ, వినియోగదారులకు మాత్రం సురక్షితమైన, ఏకరీతి లుక్‌ను ఎంచుకున్నట్టు స్పష్టమవుతోంది.ప్రస్తుతం రంగుల ఎయిర్‌పాడ్స్‌ను విడుదల చేయాలన్న యాపిల్ యోచనపై అధికారిక ధృవీకరణ లేదు. అయినప్పటికీ, ఈ లీకులు యాపిల్ ఎప్పుడో ఒకప్పుడు ఎయిర్‌పాడ్స్ రంగుల ప్రపంచాన్ని విస్తరించాలనుకున్నదానికి స్పష్టమైన ఆధారంగా నిలుస్తున్నాయి. ఆ ఆలోచన భవిష్యత్తులో నిజమవుతుందా అన్నది చూడాల్సిందే.

Just In

01

Xiaomi 17 Ultra vs Google Pixel 10 Pro .. వీటిలో ఏ ఫోన్ బెస్ట్?

Telangana Women Died: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలుగు అమ్మాయిలు మృతి

iPhone 16: భారత వినియోగదారుల ఫేవరెట్‌గా ఐఫోన్ 16.. అమ్మకాలలో అగ్రస్థానం

Sathupalli Medical Shops: సత్తుపల్లిలో అనధికార ‘సిండికేట్’ దందా!.. రెచ్చిపోతున్న మాఫియా..!

Naa Anveshana: అమ్మాయి చీర కట్టు విధానం గురించి కాదు.. అబ్బాయి మైండ్ సెట్ మారాలి.. నా అన్వేష్