Apple New Feature: ఆపిల్ ఇటీవల ఐఫోన్ లో Tap and Pay ఫీచర్ విస్తరణపై దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలో, ఆ ఫీచర్ ఇప్పుడు హాంకాంగ్లో అందుబాటులోకి వచ్చింది. దీంతో వ్యాపారులు తమ డివైస్‌లపై నేరుగా కాన్టాక్ట్‌లెస్ చెల్లింపులు స్వీకరించగలుగుతున్నారు. ఈ ఫీచర్ తో ఎక్స్‌టర్నల్ పేమెంట్ టెర్మినల్స్ అవసరం ఉండదు. ఫలితంగా రిటైల్, టాక్సీ, ఫుడ్ అండ్ బేవరేజ్, ప్రొఫెషనల్ సర్వీసెస్ వంటి విభాగాల వ్యాపారాలు కేవలం iPhone ఉపయోగించి చెల్లింపులను చేయొచ్చు.
ఫీచర్ ఎలా పని చేస్తుందంటే?
iPhoneలో Tap and Pay NFC టెక్నాలజీను ఉపయోగించి సురక్షితంగా లావాదేవీలను పూర్తి చేస్తుంది. వినియోగదారులు తమ కాంటాక్ట్‌లెస్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్, iPhone, Apple Watch లేదా మద్దతు లభించే డిజిటల్ వాలెట్ ను వ్యాపారి iPhone దగ్గర పెట్టడం ద్వారా చెల్లింపును చేయవచ్చు. లావాదేవీ కేవలం డివైస్‌లోనే ప్రాసెస్ అవుతుంది దీనికి అదనపు హార్డ్‌వేర్ అవసరం లేదు. ఈ ఫీచర్ iPhone 11 లేదా కొత్త మోడళ్లలో, తాజా iOS వర్షన్ అమర్చిన పరికరాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. వ్యక్తిగతంగా సురక్షితంగా లావాదేవీలు జరిగే విధంగా డిజైన్ చేయబడింది.
ఆపిల్ వెల్లడించినట్టే, Adyen, Global Payments, KPay, SoéPay మొదటి ప్లాట్‌ఫారంలు హాంకాంగ్‌లో Tap and Pay ఫీచర్‌ని ఇంటిగ్రేట్ చేసినవి. ఈ ఫీచర్ Apple Pay తో పాటు ప్రధాన డిజిటల్ వ్యాలెట్లను, అలాగే American Express, Mastercard, Visa, JCB, UnionPay వంటి ప్రముఖ పేమెంట్ నెట్‌వర్క్‌ల కు మద్దతు ఇస్తుంది.
వ్యాపారాల కోసమే కొత్త ఫీచర్ లాంచ్
అదనపు టెర్మినల్స్ అవసరం లేకుండా, ఈ ఫీచర్ చిన్న, పెద్ద వ్యాపారాల కోసం సులభమైన చెల్లింపు స్వీకరణ పద్ధతిని అందిస్తుంది. సర్వీస్ ప్రొవైడర్స్, డెలివరీ భాగస్వాములు, మోబైల్ వెండర్లు, స్వతంత్ర ప్రొఫెషనల్స్ కూడా మొబైల్ పేమెంట్‌లను సులభంగా అంగీకరించగలుగుతారు.
హాంకాంగ్లో Tap and Pay ఫీచర్ ద్వారా ఆపిల్ iPhone ఇప్పుడు సురక్షిత, స్టాండలోన్ పేమెంట్ డివైస్ గా మారింది. దీని వల్ల డిజిటల్ చెల్లింపుల మౌలిక సదుపాయాలు మరింత విస్తరించాయి. ఈ ఫీచర్ వినియోగదారులు, వ్యాపారాలకు చెల్లింపులను సులభతరం చేస్తుంది, అలాగే ఫిజికల్ పేమెంట్ టెర్మినల్స్ మీద ఆధారాన్ని తగ్గిస్తుంది.
ఇది అన్ని వ్యాపారాలకు ఫ్లెక్సిబుల్, సులభమైన, సురక్షిత చెల్లింపు పద్ధతిని అందిస్తుంది. దీనివల్ల iPhone మాత్రమే ఉపయోగించి వ్యాపారాలు రోజువారీ లావాదేవీలను సులభంగా ప్రాసెస్ చేయగలవు.

