Wimbledon Social Media Page Create Manjummel Boys Pushpa Poster
స్పోర్ట్స్

Wimbledon: వింబుల్డ‌న్ పోస్టర్స్‌ వైరల్‌

Wimbledon Social Media Page Create Manjummel Boys Pushpa Poster: అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ఏర్పాటైన గ్రాండ్‌స్లామ్ టోర్నీ వింబుల్డ‌న్ సోమవారం నుంచి స్టార్ట్ కానుంది. ఈ టోర్నీ ఈనెల 14 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. అయితే ఈ టోర్నీ ప్ర‌మోష‌న్స్‌ను వింబుల్డ‌న్ సోష‌ల్ మీడియా పేజీని డిఫరెంట్‌గా స్టార్ట్‌ చేసింది. ఇందులో భాగంగానే ఇండియన్‌ మూవీస్‌ పేర్ల‌ను ప్రేర‌ణ‌గా తీసుకుని ప్ర‌త్యేక పోస్ట‌ర్ల‌ను రూపొందించి రిలీజ్‌ చేసింది. దీనిలో భాగంగా మంజుమ్మెల్ బాయ్స్‌ను ప్రేరణ‌గా తీసుకుని వింబుల్డ‌న్ బాయ్స్ అంటూ ఈ టోర్నీలో ఆడుతున్న కీల‌క ప్లేయ‌ర్లతో ఒక పోస్ట‌ర్‌ని రిలీజ్‌ చేసింది.

అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ యాక్ట్ చేసిన సూప‌ర్ హిట్ మూవీ పుష్ప పోస్ట‌ర్‌ను తీసుకుని గ‌తేడాది వింబుల్డ‌న్ టైటిల్ గెలిచిన‌ డిఫెండింగ్ ఛాంపియన్ కార్ల‌స్ అల్కారాజ్‌తో అల్కారాజ్‌3 అంటూ మ‌రో పోస్ట‌ర్‌ను రిలీజ్‌ చేసింది. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్లు సోషల్‌మీడియాలో తెగ‌ వైర‌ల్ అవుతున్నాయి. ఇక ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ కార్ల‌స్ అల్కారాజ్‌తో పాటు వ‌ర‌ల్డ్ నం.1 జ‌న్నిక్ సిన్న‌ర్‌, నోవాక్ జ‌కోవిచ్‌లు టైటిల్‌ ఫేవ‌రెట్లుగా బ‌రిలోకి దిగుతున్నారు.

Also Read: ఫుల్‌ జోష్‌లో రాహుల్‌, ఎందుకంటే..!

అయితే గతకొన్ని రోజులుగా మోకాలి శ‌స్త్ర చికిత్స‌ నుంచి కోలుకున్న జ‌కోవిచ్‌కు వింబుల్డ‌న్‌లో సిన్న‌ర్, అల్కరాజ్‌ల రూపంలో గ‌ట్టి పోటీ ఎదుర‌య్యే ఛాన్స్‌ ఉంది. ప్రతిష్టాత్మక వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీ ఫ్రైజ్‌మనీ ఈ ఏడాది భారీగా పెరిగింది. రికార్డు స్థాయిలో రూ.534 కోట్లు ప్రైజ్‌మ‌నీ ఇవ్వ‌నున్నారు. ఈ విషయాన్ని ఆల్‌ ఇంగ్లండ్‌ లాన్ టెన్నిస్ క్లబ్ ప్రకటించింది. అదేవిధంగా పురుషులు, మహిళల సింగిల్స్‌లో ఒక్కో విజేతకు సుమారు రూ.29.60 కోట్లు దక్కనున్నాయి. 2023లో ఫ్రైజ్‌మనీతో పోలిస్తే ప్రస్తుతం ప్రైజ్‌మనీ విలువ 11.9శాతం అదనం. టోర్నీ ఫ‌స్ట్ రౌండ్‌లో ఓడిన ఆట‌గాడికి 60 వేల పౌండ్లు ఇవ్వ‌నున్నారు.

Just In

01

Ganja Racket: గంజాయి బ్యాచ్ అరెస్ట్! .. ఎలా దొరికారో తెలుసా?

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!