Rahul Dravid Comments After India Win The T20 WorldCup 2024
స్పోర్ట్స్

T20 Match: ఫుల్‌ జోష్‌లో రాహుల్‌, ఎందుకంటే..!

Rahul Dravid Comments After India Win The T20 WorldCup 2024: టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై భారత్‌ పోరు ఆధ్యంతం ఉత్కంఠగా సాగింది. ఫైనల్‌ పోరులో నువ్వా నేనా అన్నట్టుగా సాగింది. ఈ ఆటలో భారత్‌ ఘనవిజయం సాధించి, టీ20 ప్రపంచ కప్‌ను తన కైవసం చేసుకుంది. జట్టు గెలుపులో మెయిన్‌ రోల్ పోషించిన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌కి పెద్ద గిప్ట్‌ ఇచ్చారు టీమిండియా.

టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా విజయ పరంపర కొనసాగించడానికి ద్రవిడ్‌ శిక్షణ ఎంతగానో తమకు దోహదపడింది. కోచ్‌గా ద్రవిడ్‌ పదవీకాలం ముగియడంతో మ్యాచ్‌ అనంతరం ఆయనకు టీమిండియా ఘనంగా వీడ్కోలు పలికారు టీమిండియా. తమ ఆనందాన్ని ద్రవిడ్‌తో కలిసి షేర్ చేసుకున్నారు. జట్టు సభ్యులంతా ద్రవిడ్‌ను ఎత్తుకొని గాల్లోకి ఎగరేశారు.

Also Read: జట్టును కొనియాడిన క్రికెట్‌ దేవుడు

జట్టు సభ్యులకు తనపై ఉన్న అభిమానంపై ద్రవిడ్‌ సంతోషం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఇది చూసిన నెటిజన్లు వావ్‌ ఇది ఇండియా టీమ్‌ అంటూ కొనియాడుతున్నారు.