Team India Captain: ఫైనల్లో న్యూజిలాండ్ ను ఓడిస్తుందా..? టీమిండియా (Team India)చాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలుస్తుందా..? అన్న విషయం కంటే రోహిత్ శర్మ(Rohith Sharma) వన్డే(ODI)లకు గుడ్ బై చెబుతాడా..? మరి కోహ్లీ కొనసాగుతాడా..? ఒకవేళ రోహిత్ తప్పుకుంటే కెప్టెన్ ఎవరు అవుతారు? ఇదే చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ గురించి ఎంత చర్చ నడుస్తుందో..? అంతకుమించిన చర్చ ఈ విషయంపై కొనసాగుతోంది.
నోడౌట్.. రోహిత్ శర్మ కెప్టెన్ గా టీమిండియాను వైట్ బాల్ క్రికెట్ లో అత్యున్నత స్థానానికి తీసుకెళ్లాడు. ముఖ్యంగ వన్డే క్రికెట్ లో జట్టును దుర్భేద్యంగా మార్చాడు. ఎంత మంచి మెడిసిన్ కైనా ఎక్స్ పైర్ డేట్ ఉన్నట్లుగా.. ఇప్పుడు 37 ఏండ్ల రోహిత్ శర్మ.. క్రికెట్ ఫ్యూచర్ పై ..అతని రిటైర్మెంట్ లేదంటే కెప్టెన్ గా తప్పుకోవడం గురించి చర్చ కొనసాగడం ఆశ్చర్యం కలిగించడం లేదు. న్యూజిలాండ్(New zealand తో ఫైనల్ ముగిసిన అనంతరం రోహిత్ శర్మ తప్పుకుంటాడు. అది కెప్టెన్ గానా..? లేదంటే ఆటగాడిగా కూడానా..? అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది..
కాగా, బిసిసిఐ(Bcci) మాత్రం రిటైర్మెంట్ విషయాన్ని రోహిత్ కే వదిలేసినట్లు.. కోహ్లీ విషయంలో ఇంకా సమయముందన్నట్లుగా భావిస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. గతేడాది రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచింది. వైట్ బాల్ క్రికెట్ లో టీమిండియా విజయ ప్రస్థానంలో రోహిత్ శర్మ పాత్ర మరిచిపోలేనిది. అతని నాయకత్వ సామర్థ్యం, అతని దూకుడైన బ్యాటింగ్ వైట్ బాల్ ఫార్మాట్ లో భారత్ ను తిరుగులేని స్థాయిలో నిలబెట్టింది. సంక్లిష్టమైన భారత కెప్టెన్ పదవి నిర్వహించడంలోనూ అతను డిస్టింక్షన్ లో పాసయ్యాడు. ఇప్పటి యంగర్ జనరేషన్ ను మించి అతని దూకుడు, సామర్థ్యం పోల్చితే రోహిత్ మెరుగ్గా కనిపిస్తున్నా.. ఒక్క సందేహం అతని భవిష్యత్ కెప్టెన్సీపై సందేహాలు నెలకొనేలా చేస్తుంది. 2027 వన్డే ప్రపంచకప్ వరకు రోహిత్ ఇదే దూకుడుతో కొనసాగుతాడా..? ఇప్పటికే 40 చేరువలో ఉన్న రోహిత్ అప్పటివరకు ఫిట్ నెస్ కాపాడుకుని జట్టును లీడ్ చేస్తాడా? అంటే ఏమో చెప్పలేం..? దీంతోనే . అతని వయసు రీత్యా.. నాయకుడిగా తప్పుకోవలసిన సమయం ఆసన్నమైందంటున్నారు.
క్రికెట్ ఆరంభించిన తొలి నాళ్లతో పోలిస్తే కాస్త తక్కువైనా రోహిత్ శర్మ బ్యాటింగ్ లో అగ్రెషన్ కనిపిస్తూనే ఉంది. అందరూ ముళ్ల కిరీటంలా భావించే టీమిండియా కెప్టెన్సీని తన భుజాలపై మోస్తూనే.. బ్యాటర్ గా.. కెప్టెన్ గా సక్సెస్ కావడంలోనే రోహిత్ పనితనం కనిపిస్తోంది. కానీ. ప్రస్తుతం బ్యాటింగ్ ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉండడం.. కొత్త తరం దూసుకువస్తుండగా ..రోహిత్ తప్పుకోవాల్సిన సమయం వచ్చేసిందంటున్నారు.
గతంలోలా మారథాన్ ఇన్నింగ్స్ ఆడలేకపోవడాన్ని ఉదాహరణగా చూపుతున్నారు. అంటే రోహిత్ రిటైర్మెంట్ కు దగ్గరయ్యాడని కాకపోయినా.. ఇప్పటికే యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ వన్డే టీమ్ లో ప్లేస్ కోసం ఎదురుచూస్తున్నాడు. రోహిత్ లాగే దూకుడు కలిగిన యశస్వి.. యంగ్ ఏజ్ లో ఉండడం.. సుదీర్ఘ కాలం భారత జట్టుకు ఓపెనర్ గా సేవలు అందించే సామర్థ్యం కలగలిపి అతనికి వన్డే టీమ్ లో చోటు ఖాయం చేసే పరిస్థితి ఉంది.
Also Read-
Rohith-Kohli: రోకో.. ఈ లోపం సరిచేసుకుంటేనే..
చాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy)అనంతరం వన్డే క్రికెట్ ప్రాధాన్యాల్లో రోహిత్ ఉండకపోవచ్చు. భవిష్యత్ ప్రణాళికల దృష్ట్యా కొత్త తరాన్ని సిద్ధం చేయాలి. అంతేకాదు కొత్త కెప్టెన్ కుదురుకోవడానికి ..జట్టుపై ఆధిపత్యం అందుకోవడానికి..జట్టును నడిపించేందుకు అవసరమైన సమయం కూడా ఇవ్వాలి. అందుకే 24 ఏండ్ల శుభ్ మన్ గిల్ ను సారథిగా ఎంపిక చేయాలని బిసిసిఐ భావిస్తోంది. ఇప్పుడు అతన్ని కెప్టెన్ గా నియమిస్తే 2027 ప్రపంచకప్ వరకు అతనికి కావలసిన అనుభవం వస్తుందన్న ఉద్దేశ్యంతో టీమిండియా మేనేజ్ మెంట్ కూడా ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. అంతేకాదు గతంలో కోహ్లీ, రోహిత్ లకు ఫ్లాట్ ఫాంను ధోనీ సెట్ చేసినట్లుగా.. ప్రస్తుతం రోహిత్ కూడా చేయాలని బిసిసిఐ పెద్దలు అనుకుంటున్నారు. అప్పుడే కెప్టెన్ మార్పుతో వచ్చే ప్రపంచకప్ నాటికి టీమిండియాకు అమిత ప్రయోజనం దక్కుతుందని అభిప్రాయపడుతోంది.
ఇదే విషయాన్ని రోహిత్‌తో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్(Ajith Agarkar), హెడ్‌కోచ్ గౌతం గంభీర్(Gambhir).. ఇది వరకే చర్చించినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ అనంతరం రోహిత్ శర్మ కెప్టెన్ పదవికి కౌంట్ డౌన్ మొదలైనట్లే అనుకోవాలి.. ఇక యువ ఓపెనర్ గిల్ కు నాయకత్వ పగ్గాలు అప్పజెప్పేందుకు కావలసిన వాతారణ పరిస్థితుల తయారీలో మేనేజ్ మెంట్ సిద్ధంగా ఉంది. కొత్తతరం నేతృత్వంలో .. యువ ఆటగాళ్లతో జట్టును తయారు చేసి ప్రపంచకప్(World Cup) సమయానికి అద్భుత జట్టుగా మార్చాలంటే ప్రస్తుత తరం తప్పుకోవాల్సిందేనంటున్నారు.