Virat Kohli Shocking comments Spills Beans On Retirement Plans
స్పోర్ట్స్

Virat Kohli: గేమ్‌కి దూరమైతే అంతే అంటూ షాకిచ్చిన కొహ్లీ

Virat Kohli Shocking comments Spills Beans On Retirement Plans: ఐపీఎల్‌ 2024 సీజన్‌లో టాప్‌ స్కోరర్ విరాట్‌ కొహ్లీ ఆరెంజ్ క్యాప్‌ రేసులో అందరికంటే ముందున్నాడు. ప్రస్తుతం 13 మ్యాచుల్లో 661 పరుగులతో కొనసాగుతున్నాడు. ఈ సీజన్‌లో తన ఆర్‌సీబీ జట్టును ప్లేఆప్స్‌కి తీసుకెళ్లేందుకు పట్టుదలగా ఉన్నాడు.

తన 16 ఏళ్ల క్రికెట్‌ కెరీర్‌లోనూ కొహ్లీ ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నాడు. 35 ఏళ్ల విరాట్‌ ఫిట్‌నెస్ ఇప్పుడున్న క్రికెటర్లలో ఎవరికి లేదు. కనీసం నాలుగైదేళ్లు ఆడగలిగే సత్తా అతడి సొంతం. అయితే ఒక్కసారి ఆటకు వీడ్కోలు పలికిన తరువాత మరెవరికి కనిపించనని తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశాడు కొహ్లీ. ఎప్పుడైనా సరే మ్యాచ్‌ ఆడిన తర్వాత ఎందుకు అలా ఆడానా..? అని పశ్చాతాపపడకూడదని తెలిపాడు.

Also Read: ఆర్‌ఆర్‌, ఆర్‌సీబీ జట్టు సమస్య ఒక్కటే..! 

స్పోర్ట్స్‌ పర్సన్‌గా కెరీర్‌కు ఎప్పుడో ఒకప్పుడు ముగింపు డేట్ ఉంటుంది. దానిని ఊహించుకోకుండా మనం చేయగలిగిన దానిపై ఫోకస్‌ పెట్టాలి. అందుకే నేనెప్పుడూ ఫలానా రోజున అలా చేసి ఉంటే బాగుండేదనుకుంటూ నా కెరీర్‌ని ముగించదల్చుకోలేదు. అక్కడితో వదిలేసి తదుపరి మనం చేయగలిగే వాటిపైనే ఆలోచిస్తా. కాబట్టి నేను ఆడినంత కాలం అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు ఇష్టపడుతానని కొహ్లీ తన మనసులోని మాటను రివీల్ చేశాడు.

Just In

01

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు