RR And RCB Team Has Only One Problem: ఐపీఎల్ 2024లో భాగంగా ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లే ఆప్స్‌లోకి చేరిపోయింది. ఈ జట్టు ఇప్పటివరకు 13 మ్యాచ్‌లను ఆడింది. అందులో ఎనిమిది మ్యాచ్‌లలో గెలుపొంది కేవలం ఐదు మ్యాచ్‌లలో ఓడిపోయి 16 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో ఉంది.ఇకపోతే నిన్న ఈ జట్టు కింగ్స్ పంజాబ్‌తో తలపడింది.
నిన్న ప్రారంభమయిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్లు నష్టపోయి 144 పరుగులు చేసింది. 145 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కింగ్స్ 11 పంజాబ్ జట్టు కేవలం 18.5 ఓవర్లు ముగిసే సరికి కేవలం 5 వికెట్లు మాత్రమే నష్టపోయి 145 రన్స్ చేసి మంచి విజయాన్ని అందుకుంది. ఇక రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్ స్టార్ట్ అయిన మొదటి దశలో అద్భుతమైన విజయాలను అందుకొని అందరి కంటే ముందు స్థాయిలో పాయింట్ల పట్టికలో నిలిచింది. కానీ వరుసగా ఈ జట్టు నిన్నటి మ్యాచ్‌తో కలిసి నాలుగు మ్యాచ్‌లలో ఓడిపోయింది.నాలుగు మ్యాచ్‌ల కంటే ముందే ప్లే ఆప్స్‌కి కావాల్సిన పాయింట్లను సంపాదించుకున్న ఈ జట్టు ప్రస్తుతం మాత్రం వరుస అపజయాలను ఎదుర్కొంటుంది.
Also Read: క్రికెట్ బ్యాట్‌తో దర్శనమిచ్చి తగ్గేదేలే అంటున్న తాతయ్య
ఇకపోతే బెంగళూరు జట్టు పరిస్థితి మరో రకంగా ఉంది. ఈ జట్టు మొదట వరస అపజయాలను ఎదుర్కొని పాయింట్ల పట్టికలో దారుణమైన స్థితిలో ఉంది. ఇక ఆఖరి ఐదు మ్యాచ్‌లలో కూడా బెంగళూరు రాయల్ చాలెంజర్స్ వరస విజయాలను అందుకొని ప్లే ఆప్స్‌లోకి వెళ్లాలని చూస్తోంది. ఇలా రాజస్థాన్ రాయల్స్ అపజయాలను ఎదుర్కొంటూ ఉంటే బెంగళూరు రాయల్ చాలెంజర్స్ వరుస విజయాలను అందుకుంటుంది. ఇకపోతే రాజస్థాన్ రాయల్స్ , సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఓడిపోయిన తర్వాత ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవలేదు. ఇక బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై మ్యాచ్ గెలిచిన తర్వాత ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడలేదు.