Team India Arrived In New York USA Running Preparations
స్పోర్ట్స్

Team India: శుభారంభం, అమెరికాకి టీమిండియా 

Team India Arrived In New York USA Running Preparations: క్రికెట్ ఫ్యాన్స్‌కి మరో గుడ్‌న్యూస్ రివీల్ చేశారు. ఇటీవల ఐపీఎల్ 2024 ముగియగా, మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ 2024 స్టార్ట్‌ కానుంది. జూన్ 2 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీ అమెరికా, వెస్టిండీస్‌ దేశాల్లో జరగనుంది. ఈ నేపథ్యంలో టోర్నీ కోసం ఇప్పటికే టీమిండియా అమెరికా దేశానికి చేరుకుంది. తక్కువ టైమ్‌ ఉన్న క్రమంలో అమెరికా చేరుకున్న తర్వాత సన్నాహాలను ప్రారంభించింది. ఈ క్రమంలో టీమిండియా ఆటగాళ్లు న్యూయార్క్‌లో రన్నింగ్ చేస్తున్న ఫొటోలను క్రీడాకారులు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.

రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు 2 వేర్వేరు బ్యాచ్‌లలో న్యూయార్క్ చేరుకుంది. ఇందులో ప్రధాన జట్టుతో పాటు, రిజర్వ్ ఆటగాళ్లు కూడా ఉన్నారు. స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ మాత్రమే ఇంకా జట్టులోకి ఎంట్రీ ఇవ్వలేదు. అయితే వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా న్యూయార్క్‌లో టీమిండియాలో చేరి సన్నాహాలు ప్రారంభించాడు. మే 28న టీమిండియా సన్నద్ధత దిశగా తొలి అడుగు వేసింది. ఈ క్రమంలో బుధవారం కూడా న్యూయార్క్ వాతావరణానికి అనుగుణంగా తేలికపాటి శిక్షణతో సన్నాహాలు స్టార్ట్‌ చేశారు. లైట్ రన్నింగ్, వ్యాయామం చేస్తూ శిక్షకుల పర్యవేక్షణలో గడిపారు.

Also Read: తన ఖాతాలో మరో ఘనత

ఈ క్రమంలో ఆటగాళ్లు తమను తాము రిఫ్రెష్ చేసుకునే పనిలో పడ్డారు. టీ20 ప్రపంచకప్‌ కోసం న్యూయార్క్‌లో జరగనున్న మ్యాచ్‌లు నగరంలోని నాసో కౌంటీలో నిర్మించిన స్టేడియంలో ప్రారంభం కానున్నాయి. టీమిండియా ఇక్కడ గ్రూప్ దశలో 4 మ్యాచ్‌ల్లో 3 ఆడాల్సి ఉంది. ఇక భారత్ మొదటి మ్యాచ్ ఐర్లాండ్ జట్టుతో జూన్ 4న నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం న్యూయార్క్‌లో జరగనుంది. జూన్ 9న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌తో సహా ఈ కొత్త స్టేడియంలో భారత జట్టు మూడు లీగ్ మ్యాచ్‌లు ఆడనుంది.

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్