Cristiano Ronaldo Breaks Unique SPL Record During Al Nassr vs Al Ittihad: ఆధునిక సాకర్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ప్రపంచ ఫుట్ బాల్ మొదటి ముగ్గురు అత్యుత్తమ ఆటగాళ్లలో అగ్రస్థానంలో నిలిచే మొనగాడు. 39 సంవత్సరాల వయసులో సైతం నవతరం కుర్రాడిలా ఆడుతూ వారేవ్వా అనిపించుకొంటున్నాడు. 39 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలేదంటూ తన పేరిట ఉన్న ఘనతను మరోసారి తన పేరిట సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు.
ప్రతిభకు వయసుతో ఏమాత్రం సంబంధంలేదని పోర్చుగీసు సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో మరోసారి చాటి చెప్పాడు. సౌదీ ప్రో లీగ్‌లో అల్ నసర్ తరఫున ఆడుతున్న ఈ పోర్చుగల్ వీరుడు, ఫైనల్‌లో అల్ హిలాల్‌పై ఒక గోల్ చేయడంతో సీజన్‌లో అతడి మొత్తం గోల్స్ సంఖ్య 35కు చేరింది. దీంతో ఒక సీజన్‌లో అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాడిగా రొనాల్డో సరికొత్త రికార్డులను నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు హమ్దల్లా 2019 సీజన్‌లో 34 గోల్స్ పేరిట ఉండేది. లీగ్స్‌లో ఆడుతూ అత్యధిక గోల్స్ చేసిన రికార్డు 893 రొనాల్డోదే. కానీ అతడు రికార్డు గోల్స్ చేసినా సౌదీ ప్రో లీగ్‌లో అల్ నసర్ మాత్రం రెండో స్థానంలో నిలిచింది.
Also Read: నయా కోచ్‌గా అతడేనా..?
సీజన్ ఆసాంతం ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా ఆడిన అల్ హిలాల్ విజేతగా నిలిచింది.తాను రికార్డుల వెంట పడనని రికార్డులే తన వెంట పడతాయని క్రిస్టియానో రొనాల్డో ఈ సరికొత్త రికార్డుపై సోషల్‌మీడియా ద్వారా వ్యాఖ్యానించాడు. జూలై 14 నుంచి జరిగే 2024 యూరోకప్ సాకర్‌లో పోర్చుగల్‌కు రొనాల్డో నాయకత్వం వహించనున్నాడు. రొనాల్డో నేతృత్వంలోనే 2016 యూరోకప్‌ను పోర్చుగల్ నెగ్గిన తరువాత మరో ట్రోఫీ కోసం పోర్చుగల్ జట్టు వెయిట్ చేస్తోంది.