T20 WorldCup Won The India Team Sachin Showered Praise On The Team
స్పోర్ట్స్

T20 Match: జట్టును కొనియాడిన క్రికెట్‌ దేవుడు

T20 WorldCup Won The India Team, Sachin Showered Praise On The Team: టీ20 వరల్డ్ కప్‌ని భారత్‌ టీమ్ సొంతం చేసుకున్న వేళ భారత్‌లోని క్రికెట్ అభిమానులు సెలబ్రేట్ చేసుకున్న సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ నేపథ్యంలో టీమిండియాను దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అభినందనలతో ముంచెత్తాడు. ఆటగాళ్లు, కోచ్ సిబ్బంది పోరాట పటిమను కొనియాడాడు. పోగొట్టుకున్న చోటే వెతుకున్నట్లుగా 2007‌లో ఎదురైన చేదు జ్ణాపకాలు చెరిపేసి సరికొత్త చరిత్రని సృష్టించారని అన్నాడు.

బార్బడోస్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌లో భారత్ ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదటగా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 176 రన్స్ చేసింది. విరాట్ కోహ్లి, అక్షర్ పటేల్ విరుచుకుపడ్డారు. మహరాజ్, నోకియా చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం ఛేదనలో దక్షిణాఫ్రికా ఎనిమిది వికెట్లకు 169 రన్స్ చేసింది. హెన్రిచ్ క్లాసెన్ పోరాడాడు. హార్దిక్ మూడు వికెట్లు, బుమ్రా, అర్షదీప్ సింగ్ చెరో రెండు వికెట్లతో విజృంభించారు. అయితే వెస్టిండీస్ వేదికగా 2007లో జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో రాహుల్ సారథ్యంలోని టీమిండియా ఘోర వైఫల్యం చవిచూసింది. తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టింది. కానీ 17 ఏళ్ల తర్వాత అదే గడ్డపై భారత్ టీ20 ఫార్మాట్‌లో విశ్వవిజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో సచిన్ టెండూల్కర్ భారత ఆటగాళ్లను, కోచ్ సిబ్బందిని కొనియాడుతూ ట్వీట్ చేశాడు.

Also Read: అవార్డుల లిస్ట్‌లో భారత్‌కి చోటు

టీమిండియా జెర్సీలో జత అవుతున్న ప్రతి స్టార్ భారత దేశ పిల్లలకు స్పూర్తి నింపేలా, వాళ్ల కలలు సాకారం చేసుకోవడానికి ప్రేరణలా ఉంటాయి. భారత్‌కు ఇది నాలుగో స్థార్. టీ20 వరల్డ్ కప్ పరంగా ఇది రెండోది.వెస్టిండీస్‌లో భారత క్రికెట్‌ ప్రయాణం ఓ వృత్తంలా సాగింది. టీ20 వరల్డ్ కప్ గెలవడంలో ఈ 96 బ్యాచ్ మెయిన్‌రోల్‌ పోషించడం గొప్పగా ఉంది. మొత్తంగా ఇది సమష్టి విజయం. ఆటగాళ్లందరికీ, కోచింగ్ సిబ్బందికి, బీసీసీఐకి అభినందనలని సచిన్ ట్వీట్ చేశాడు.

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్