India’s Place In T20 BCCI Awards List:వరల్డ్‌వైడ్‌గా క్రికెట్ ఫ్యాన్స్‌ను దాదాపు నెలరోజుల పాటు టీ20 వరల్డ్ కప్ అలరించింది. ఈ టీ20 మ్యాచ్ శనివారంతో ముగిసింది. భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఫైనల్ మ్యాచ్‌తో టోర్నీ ఎండ్ కార్డు వేశారు. బార్బడోస్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా 7 రన్స్‌తో జయకేతనం ఎగురవేసి విశ్వవిజేతగా అవతరించింది. ఈ మ్యాచ్‌లో 76 రన్స్‌తో రాణించిన విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దక్కించుకున్నాడు.
కాగా ఈ టీ20 మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు టీ20 వరల్డ్ కప్ 2024 అవార్డులను ఐసీసీ అనౌన్స్ చేసింది. భారత్ రెండోసారి టీ20 వరల్డ్ కప్ గెలవడంలో అత్యంత కీరోల్ పోషించిన జస్ప్రీత్ బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు దక్కింది. ఈ టోర్నీలో ఏకంగా 15 వికెట్లు తీశాడు. ఇక ఎకానమీ కేవలం 4.17గా మాత్రమే ఉంది. ప్రత్యర్థుల బ్యాటర్లను అద్భుతంగా కంట్రోల్ చేయగలిగాడు. భారత బౌలింగ్ దళానికి నాయకత్వం వహించడంతో అతడికి ఈ అవార్డు దక్కింది.ఇక మరో భారత పేసర్ అర్షదీప్ సింగ్ ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. ఆఫ్ఘనిస్థాన్ బౌలర్ ఫజల్‌హాక్ ఫరూఖీతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు.
Also Read: కామెంట్‌కి కౌంటర్ ఇచ్చిన గంగూలీ
వీరిద్దరూ టోర్నీలో చెరో 17 వికెట్లు తీశారు. కాగా ఫైనల్ మ్యాచ్‌లో అర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీసి సరికొత్త హిస్టరీని క్రియేట్ చేశాడు. మొత్తం 8 మ్యాచ్‌లు ఆడిన అతడు 17 వికెట్లతో నిలిచాడు. టీ20 వరల్డ్ కప్ హిస్టరీలో ఏ ఎడిషన్‌లోనైనా ఒక ఆటగాడికి ఇవే అత్యధిక వికెట్లుగా ఉన్నాయి. ఇక 281 రన్స్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ బ్యాటర్ రహ్మానుల్లా గుర్బాజ్ అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. అత్యధిక రన్స్ వీరుల జాబితాలో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ, ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.