Rohit Sharma Clarity On Suspension: టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్ బార్బడోస్ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై 7 రన్స్ తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించి విజయ దుంధుబిని మోగించింది. 17 ఏళ్ల కాలం తర్వాత టీమిండియా పొట్టి కప్ అందుకోవడంతో భారతీయ క్రికెట్ అభిమానులు ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. టీ20 ప్రపంచకప్ మ్యాన్ ఆఫ్ టోర్నీగా బుమ్రా నిలిచారు. కొహ్లీ ఏకంగా 59 బంతుల్లో 76 రన్స్ చేసి టోర్నమెంట్‌ని వన్‌సైడ్ చేశాడు.
అయితే టీ20 కప్ గెలుపొందిన అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బార్భడోస్ పిచ్ మీద మట్టి తిన్నాడు. తాజాగా ఆయన మట్టి తినడానికి గల రీజన్స్ ఏంటనేది రివీల్ చేశాడు. ఆ పిచ్ పైనే టీమిండియా ఫైనల్ గెలిచి ప్రపంచకప్ సాధించామని,అందుకే ఆ పిచ్ రోహిత్‌కి చాలా స్పెషల్ అని అందుకే అలా చేశాడని తోటి ఆటగాళ్లు చెప్పుకొచ్చారు. అంతేకాదు తన కెరీర్‌లో ఈ మ్యాచ్ ఎప్పటికి గుర్తుండిపోయేలా ఆ పిచ్‌ని తన బాడీలో ఒక భాగంగా చేసుకొని నరనరాన అది ఇమిడిపోయేలా ఉండేందుకు ఇలా చేశానని రోహిత్ శర్మ తెలిపాడు.
Also Read: ఆసియా క్రీడల్లో యోగా
ఇక ఈ సీన్‌ని చూసిన క్రికెట్ ఫ్యాన్స్ ఆకాశానికి ఎత్తేస్తూ రోహిత్‌ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అవును కప్ గెలిచినందుకు చరిత్రలో నిలిచిపోతుందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా భారత్ ఆటగాళ్లు కప్ సాధించిన ఆ ఆనంద క్షణాలు రోహిత్, టీమిండియా టీమ్ మాత్రమే కాదు భారత్‌లోని ప్రతి ఒక్క క్రికెట్ అభిమానికి చిరస్థాయిగా గుర్తుండిపోయే మ్యాచ్‌గా చరిత్రలో నిలిచిపోనుంది.
View this post on Instagram