Ganguly Blunt Reply On T20 Worldcup Favouritism Charge: టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌లో తలపడేందుకు భారత్ దక్షిణాఫ్రికా జట్లు రెడీగా ఉన్నాయి. మెగా టోర్నీలో తొలిసారి సౌతాఫ్రికా తుదిపోరుకు అర్హత సాధించింది. ఈ అర్హత సాధించడం ఇది మూడోసారి. 2007లో ధోనీ నాయకత్వంలో భారత్ విజేతగా నిలిచింది. ఇప్పుడు రోహిత్ కెప్టెన్సీలో మరోసారి ఛాంపియన్ కావాలనే లక్ష్యంతో బరిలోకి దిగింది. సెమీస్‌లో పటిష్టమైన ఇంగ్లాండ్‌ని చిత్తు చేసి మరీ ఫైనల్‌కి దూసుకొచ్చింది.
అయితే ఇంగ్లీష్ జట్టు మాజీ కెప్టెన్ నోటి దురుసు మాత్రం తగ్గలేదు. రెండో సెమీ ఫైనల్ జరిగిన గయానా పిచ్ స్పిన్‌కి సహకరించేలా భారత్ కోసం మార్చారని వాన్ విమర్శించారు. అలాగే టీమిండియాకి అనుకూలంగా ఉండే 8పీఎం స్లాట్‌ని ఐసీసీకి కెటాయించడం సరైంది కాదని వ్యాఖ్యానించాడు. ఇప్పటికే వాన్‌కి అశ్విన్, హర్బజన్ చురకలు అంటించారు. తాజాగా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ కూడా వాన్ వ్యాఖ్యలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
Also Read: వీరిద్దరి చివరి మ్యాచ్ ఇదేనా..?
బ్రాడ్ కాస్టింగ్ వల్ల మ్యాచ్‌లు గెలుస్తారని నాకు తెలియదు. ఎప్పుడైనా సరే ఎలాంటి పిచ్‌పైనైనా ఆడితేనే విజయాలు దక్కుతాయి. ఇక ప్రపంచంలోని అన్ని చోట్లా గెలిచినప్పుడు గయానాలో మాత్రం విజయం సాధించలేకపోతున్నారనేది ఎందుకో మీకే తెలియాలి. అది ప్రదర్శన చేయడం, బ్రాడ్‌కాస్టింగ్, ఆదాయం వల్ల మాత్రమే. అంతేకానీ, ఇతర అంశాలను ప్రభావితం చేయాల్సిన అవసరం లేదని చురకలు అంటించారు.