T20 | వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత బీసీసీఐదే
Sunil Gavaskar Shocking Comments About Cricket Bowlers
స్పోర్ట్స్

T20: వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత బీసీసీఐదే

Sunil Gavaskar Shocking Comments About Cricket Bowlers: ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌ క్రికెట్‌ అభిమానుల అంచనాలకు అందట్లేదు. అనూహ్యంగా భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. 50 ఓవర్ల ఫార్మట్ తరహాలో మ్యాచ్‌లు కొనసాగుతున్నాయి. ప్రత్యేకించి సన్‌రైజర్స్ హైదరాబాద్. ఈ జట్టు ఆటతీరుకు హద్దులు ఉండట్లేదు. టీ20 గేమ్‌లో ఉండే హద్దులన్నింటినీ చెరిపేసింది ఈ జట్టు. 260కి పైగా స్కోర్‌ను నమోదు చేస్తోందంటే నమ్మశక్యం కావట్లేదు క్రికెట్ పండితులకు. తొలుత ముంబై ఇండియన్స్‌పై 277 పరుగుల టార్గెట్ పెట్టింది. అనంతరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఏకంగా 287 రన్స్‌ కంప్లీట్‌ చేసింది. తన 277 పరుగుల రికార్డును తానే తిరగరాసింది ఎస్ఆర్‌హెచ్. అక్కడితో ఆరెంజ్ ఆర్మీ స్పీడుకు బ్రేకులు పడలేదు. ఢిల్లీ కేపిటల్స్‌పైనా తన ప్రతాపాన్ని చూపింది. 266 పరుగుల స్కోర్ చేసింది.

ఇదంతా కూడా ఒకే ఒక్క సీజన్‌లోనే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గతంలో ఓ మోస్తరు స్కోర్ చేయడానికి కూడా ఆపసోపాల పడే సన్‌రైజర్స్ మూడుసార్లు 260కి పైగా స్కోర్లు బాదడం అంటే మాటలు కాదు.కోల్‌కత నైట్‌రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌లోనూ స్కోర్ 220ని దాటేసింది. రెండు జట్లు కూడా 220ని అధిగమించాయి ఆ మ్యాచ్‌లో. అంతకు ముందు రాజస్థాన్ రాయల్స్ సైతం భారీ స్కోర్‌ను సాధించిన విషయం మనందరికి తెలిసిందే. కోల్‌కత నైట్‌రైడర్స్ నిర్దేశించిన 223 పరుగులను రాయల్ ఛాలెంజర్స్ ఛేదించింది.ఈ పరిణామాలన్నీ కూడా బౌలర్లకు చుక్కలు చూపెడుతున్నాయి. వారి కేరీర్‌పై సైతం తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. బౌలర్ ధారాళంగా పరుగులను ఇచ్చుకున్నాడనే కారణంతో తుదిజట్టులో తీసుకోవడానికి వెనుకాడుతోండటమే దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.ఇక ఇదే విషయపై టెస్ట్ బ్యాట్స్‌మెన్‌షిప్‌లో ఒక విప్లవాన్ని తీసుకొచ్చిన సునీల్ గవాస్కర్ స్పందించారు.

Also Read:జట్టుపై ఆటగాళ్లలో ఉత్కంఠ

బౌలర్లను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. దీనికోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ తక్షణ చర్యలకు దిగాలని అభిప్రాయపడ్డారు. బౌండరీ లైన్‌ను ఇంకొంత పెంచాలని బీసీసీఐకి సూచించారు. బౌండరీ రోప్, దాని వెనక ఉండే అడ్వర్టయిజ్‌మెంట్ ఎల్ఈడీ బోర్డులను రెండు మూడు మీటర్లు వెనక్కి జరపాలని అన్నారు.అలా చేస్తే గానీ బౌలర్లను కాపాడుకోలేమని గవాస్కర్ అన్నారు. బౌండరీ రోప్‌ను పెంచడం వల్ల సిక్స్‌గా వెళ్లాల్సిన బంతి క్యాచ్‌గా మారుతుందని పేర్కొన్నారు. ఆ పరిస్థితి వస్తే గాల్లో షాట్ కొట్టడానికి బ్యాటర్లు కొంత వెనుకాడుతారని, బౌలర్లకు ఊరట లభిస్తుందని అంచనా వేశారు.బ్యాటర్లు, బౌలర్ల మధ్య ఉండే తేడా చెరిగిపోవడం క్రికెట్‌కు ఏ మాత్రం మంచిది కాదని సునీల్ గవాస్కర్ అన్నారు. ఈ తేడా లేనప్పుడు మ్యాచ్‌లన్నీ బోరింగ్‌గా మారుతాయని వ్యాఖ్యానించారు. భారీ షాట్లే ఆడాలంటూ ఆయా జట్ల కోచ్‌లు కూడా నెట్స్‌ ప్రాక్టీస్‌లో చెబుతున్నారని, అది సరైంది కాదని అన్నారు. వాళ్లను తిట్టాలని ఉంది గానీ ఆ పని చేయలేకపోతున్నానని పేర్కొన్నారు.

Just In

01

Dharma Mahesh: మరో స్టేట్‌లోనూ మొదలెట్టిన ధర్మ మహేష్..

Kerala Local Polls: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం?

Drug Seizure: 70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్.. ఎలా పట్టుకున్నారంటే?​

AIIMS Bibinagar: తెలంగాణ ప్రజల డీఎన్ఏలో డేంజర్ బెల్స్.. రీసెర్చ్‌లో బయటపడ్డ సంచలన విషయాలు?

Messi In Hyderabad: హైదరాబాద్‌లో క్రేజ్ చూసి మెస్సీ ఫిదా.. కీలక వ్యాఖ్యలు