Indian Cricket Team Selection For T20 World Cup 2024: ఐపీఎల్ 2024 సీజన్ రసవత్తరంగా సాగుతుంటే, మరోపక్క త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్‌కు ఎవరు ఎంపిక అవుతారనేది క్రికెట్ అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కొంతమంది పేర్లు ఫిక్స్ కాగా.. మిగతా స్థానాల కోసం టీమిండియా యువ క్రికెటర్లు పోటీపడుతున్నారు.
జూన్ 2 నుంచి టీ20 వరల్డ్ కప్ సీజన్ కోసం వెస్టిండీస్, యూఎస్ఏ వేదిక కానుంది. ఈ మెగా టోర్నీకి సంబంధించిన జట్టును ఈనెల చివరిలో ప్రకటించే చాన్స్ ఉంది. బీసీసీఐ సెలెక్టర్లు ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ త్వరలో 15 మందితో కూడిన జట్టును ప్రకటించనుంది. స్టాండ్‌బైగా ఐదుగురు ఆటగాళ్లు తీసుకోనున్నారు. మొత్తం ఆరుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది.
Also Read:ఫీట్‌తో రికార్డులు బ్రేక్ చేయనున్న పాక్ ఆటగాడు..!
ఇందులో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్ ఫిక్స్ అయినట్లు సమాచారం. ఆల్ రౌండర్ల జాబితాలో జడేజాకు చోటు ఖాయం. మిగతా స్థానాల కోసం అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, శివమ్ దుబే పోటీ పడనున్నారు.ఈసారి ముగ్గురు వికెట్ కీపర్లను తీసుకోనున్నారు. ఈ రేసులో రిషభ్ పంత్, సంజూ శాంసన్, కేఎల్ రాహుల్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇషాన్ కిషన్ చోటు దక్కకపోవచ్చు. పేసర్లలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. మిగతా ఇద్దరిలో అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్‌కు చోటు దక్కే ఛాన్స్ ఉంది. స్పిన్నర్ల రేసులో కుల్దీప్ యాదవ్. యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్ ఉన్నారు. వీరిలో ఎవరికి చోటు దక్కుతుందో చూడాలి.