Sensational Comments Of Former Indian Player on Hardik Pandya
స్పోర్ట్స్

Hardik Pandya : హార్ధిక్‌ పాండ్యాపై భారత మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు

Sensational Comments Of Former Indian Player on Hardik Pandya : భారత్‌ వన్డే వరల్డ్‌కప్‌ 2023 మెగాటోర్నిలో హార్దిక్ పాండ్యా కాలికి తీవ్ర గాయాలైన విషయం మనందరికి తెలిసిందే. ఇక ఈ గాయానికి సర్జరీ చేయించుకోవడం కోసం, సుధీర్ఘకాలం పాటు ఆటకు దూరం అయ్యాడు. అయితే గాయం నుంచి కోలుకున్న పాండ్యా ఇటీవలే డొమెస్టిక్ టోర్నీ కండక్ట్ చేసిన డీవై పాటిల్ టోర్నమెంట్‌లో చురకుగా పాల్గొన్నాడు. ఈ నేపథ్యంలో పాండ్యాపై భారత మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్ సంచలన కామెంట్స్ చేశాడు. అటు వీడియో, ఇటు వ్యాఖ్యలు క్రికెట్ చరిత్రలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్‌ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై తీవ్రమైన ఆరోపణలు చేశాడు భారత మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్. ఐపీఎల్‌కు రెండు నెలల ముందు హార్దిక్ పాండ్యా దేశం కోసం ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఆడలేదు. రాష్ట్రం కోసం దేశవాళి టోర్నీలో కూడా ఆడలేదు. అతడు ఎక్కువగా ఐపీఎల్ ఆడటానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు.

Read More: రంజీ ట్రోఫీ ఫైనల్‌లో ఆ టీమ్‌కీ గెలుపు ఖాయమైనట్లే.?

దేశం కన్నా పాండ్యాకి డబ్బు, ఐపీఎల్ టోర్నీనే ముఖ్యంలా కనిపిస్తోంది. మనీ సంపాదనలో తప్పులేదు. కానీ.. కేవలం డబ్బు కోసం దేశాన్ని, రాష్ట్రాన్ని వదిలేయడం కరెక్ట్ కాదని ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడి..ఆ తర్వాత ఆటలో కనిపించకుండా పోయాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2024 సీజన్ కోసం ప్రాక్టీస్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాడు. ప్రాక్టీస్‌లో మనోడు భారీ షాట్లతో విరుచుకుపడినటువంటి ఓ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఈ సందర్భంగా.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి కూడా మాట్లాడాడు. రోహిత్ మరో మూడు ఏళ్లు కెప్టెన్సీ చేయగలడని… అయితే ఆ విషయం మేనేజ్‌మెంట్‌ చేతుల్లో ఉందని ప్రవీణ్ చెప్పుకొచ్చాడు. కాగా…గతకొన్ని రోజులుగా ప్రవీణ్ చేసిన ఆటగాళ్లపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో పాటుగా.. నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మనోడు చేసిన వ్యాఖ్యల మూలంగా క్రికెట్‌ వర్గాల్లో తీవ్ర చర్చలకు దారి తీస్తున్నాయి.

Just In

01

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు