That Team Is Sure Of Victory In The Ranji Trophy Final : భారత్‌లో నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక టోర్నమెంట్ రంజీ ట్రోఫీని మరోసారి కైవసం చేసుకునేందుకు ముంబై ప్లాన్ రూపొందిస్తోంది. ఇప్పటికే 41 సార్లు రంజీ ట్రోఫీని గెలుచుకున్న ముంబై.. మరోసారి కప్పుపై ఫోకస్ పెట్టింది. వాంఖెడే స్టేడియం వేదికగా విదర్భతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో పట్టు బిగిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే టైంకి ముంబై సెకండ్ ఇన్నింగ్స్‌లో 260 పరుగుల ఆధిక్యంలో ఉంది. విదర్భను తొలి ఇన్నింగ్స్‌లో 105 పరుగులకే ఆలౌట్ చేసి 119 పరుగుల కీలక ఆధిక్యాన్ని దక్కించుకున్న ముంబై.. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసేందుకు ప్రణాళికలు వేస్తోంది.
ఈ ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ ఫైనల్ రసవత్తరంగా సాగుతోంది. ఫైనల్లో ముంబై, విదర్భ రంజీ టైటిల్ కోసం తలపడతుండగా…తొలి ఇన్నింగ్స్‌లో ముంబై తక్కువ పరుగులకే పరిమితమైంది. వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 224 పరుగులకు ఆలౌట్ అయింది. కష్టాల్లో కూరుకుపోయిన ముంబై జట్టు 224 పరుగులతో తొలి ఇన్నింగ్స్‌ను ముగించిందంటే దానికి కారణం శార్దూల్ ఠాకూర్. 111 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి 200 పరుగులైనా చేస్తుందా అన్న స్థితి నుంచి ముంబైకు శార్దూల్ గౌరవ ప్రదమైన స్కోరు అందించాడు.
Read More: సీఎస్‌కే టీమ్‌కి రోహిత్ నాయకత్వం వహించాలన్న అంబటి
రెండో రోజు ఆట ముగిసే సమయానికి ముంబై.. 50 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 105 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని ఆ జట్టు ఇప్పటికే 260 పరుగుల భారీ స్కోర్‌ని సాధించింది. ముంబై బ్యాటర్ ముషీర్ ఖాన్, కెప్టెన్ అజింక్యా రహానే క్రీజులో ఉన్నారు. ఇప్పటికే 260 పరుగుల ఆధిక్యంలో ఉన్న ముంబై ఫైనల్‌పై పట్టు సాధించినట్లే అనిపిస్తోంది. మూడో రోజు ఇలాగే ముంబై బ్యాటర్ల జోరు కొనసాగితే విదర్భ ఎదుట భారీ లక్ష్యం నిలిపే ఛాన్స్ ఉంది.
తొలి ఇన్నింగ్స్‌లో 105 పరుగులకే ఆలౌట్ అయింది. మొదటి రోజే 30 పరుగులు కూడా చేయకుండానే 3 వికెట్లు కోల్పోయిన విదర్భ.. రెండో రోజు కూడా అదే కొనసాగించింది. ముంబై బౌలర్ల ముందు విదర్భ బౌలర్లు కుదేలు అయిపోయారు. యశ్ రాథోడ్ ఒక్కడే 27 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ముంబై బౌలర్లలో ధవల్ కులకర్ణి, శామ్స్ ములానీ, తనూష్ కొటియాన్‌లు తలా మూడు వికెట్లు తీయగా శార్దూల్ ఠాకూర్ ఒక్క వికెట్ పడగొట్టాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ముంబై 224 పరుగులకు ఆలౌట్ అయింది.