MS Dhoni Smashed Un Unbeaten 37 Off Just 16 Balls
స్పోర్ట్స్

MS Dhoni : ధోనీ అదిరిపోయే హిట్టింగ్‌, ఏంటీ భయ్యా ఆ ప‌వ‌ర్ స్ట్రోక్స్.!

MS Dhoni Smashed Un Unbeaten 37 Off Just 16 Balls: క్రికెట్ ప్లేయర్ ధోనీ తన హిట్టింగ్ ఎలా ఉంటుందో మరోసారి నిరూపితం చేశాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో అతను ఆఖరి ఓవర్‌లో 20 రన్స్‌ రాబట్టాడు. దాంట్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. మిస్టర్ కూల్‌ భారీ షాట్లతో ఆకట్టుకున్నా.. చెన్నై జట్టు మాత్రం ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

మహేంద్ర సింగ్ ధోనీ భారతీయ క్రికెట్ క్రీడాకారుడు.పరిమిత ఓవర్ల ఫార్మాట్లు భారత జాతీయ క్రికెట్ జట్టు మాజీ రథసారథి. అటాకింగ్ కుడి చేతివాటం గల మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్, వికెట్ కీపర్‌. అతను విస్తృతంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో గొప్ప ఫినిషెర్ లో ఒక్కడిగా భావించబడుతాడు. అతను తన తొలి వన్‌డే ఇంటర్నేషనల్ (ODI) బంగ్లాదేశ్‌తో డిసెంబరు 2004 లో ఆడాడు. శ్రీలంకతో ఒక సంవత్సరం తరువాత తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడాడు.

Read More: కోహ్లీపై మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఏపీలోని వైజాగ్‌ వేదికగా ఐపీఎల్‌ మ్యాచ్‌ ఢిల్లీ క్యాపిటల్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో చెన్నై జట్టు మాజీ కెప్టెన్ ధోనీ.. తన పవర్‌ హిట్టింగ్ ఎలా ఉంటుందో చూపించాడు. ఈ సీజన్‌లో తొలిసారి బ్యాటింగ్‌ చేసిన అతను.. కేవలం 16 బంతుల్లో 37 రన్స్‌ చేశాడు. 231 స్ట్రయిక్‌ రేట్‌తో రెచ్చిపోయాడు. వాస్తవానికి చెన్నై జట్టు మ్యాచ్‌ నెగ్గే ప‌రిస్థితి లేకున్నా.. చివ‌రి ఓవ‌ర్‌లో ధోనీ కొన్ని ప‌వ‌ర్‌ఫుల్ స్ట్రోక్స్‌తో క్రికెట్ ప్రేమికుల్ని అల‌రించాడు.

అన్రిచ్‌ నోర్జా వేసిన ఫైనల్‌ ఓవర్‌లో అతను 20 రన్స్ రాబట్టాడు. దాంట్లో ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. ఈ సీజన్‌లో తొలి రెండు మ్యాచ్‌లను అత‌ను ఆడ‌లేదు. ఈ మ్యాచ్‌లో ఆడిన తొలి బంతికే బౌండ‌రీ కొట్టాడు. 192 ప‌రుగుల లక్ష్యంతో బ‌రిలోకి దిగిన చెన్నై జ‌ట్టు ఆరు వికెట్లు కోల్పోయి 171 ర‌న్స్ మాత్ర‌మే చేసింది. ఈ సీజ‌న్‌లో ఢిల్లీ తొలి విక్ట‌రీ న‌మోదు చేసింది.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!