Virat Kohli Played Score Says Ex India Star Aakash Chopra
స్పోర్ట్స్

Virat Kohli: కోహ్లీపై మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Virat Kohli Played Score Says Ex India Star Aakash Chopra : కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌పై భారత మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.83 పరుగులు కొట్టడానికి కోహ్లీ 59 బంతులు ఆడాడని వ్యాఖ్యానించాడు.

అయితే కోల్‌కతా బ్యాటర్లు సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్‌లు పవర్‌ప్లే‌లో కేవలం 5.5 ఓవర్లలోనే 83 పరుగులు బాదారని పోల్చాడు.సునీల్ నరైన్ బ్యాటింగ్‌లో స్పష్టమైన ఉద్దేశం ఉంటుందని, నువ్వా-నేనా అనేలా బ్యాటింగ్ చేస్తాడని ఆకాశ్ చోప్రా మెచ్చుకున్నాడు. పదే పదే బౌన్సర్లు, యార్కర్లు వేయాలని గ్రహించాలని అలా చేయకపోతే మ్యాచ్ దూరమవుతుందని బెంగళూరు జట్టుకి అదే పరిస్థితి ఎదురైందని ఆకాశ్ చోప్రా విశ్లేషించాడు.ఈ మేరకు తన యూట్యూబ్‌ ఛానెల్‌లో మాట్లాడాడు.

Read Also: ఇలా ఇంకెంతకాలం, మీరేం చేస్తున్నారు..?: గావస్కర్

ఇక కోల్‌కతా ఓపెనర్ ఫిల్‌సాల్ట్ కూడా అద్భుతమైన ఆరంభాన్ని అందించాడని ప్రశంసించాడు.కోల్‌కతా బౌలింగ్‌లో కూడా బాగా రాణించిందని పేర్కొన్నాడు.కోహ్లీ 59 బంతుల్లో 83 పరుగులు చేస్తే..కోల్‌కతా 5.5 ఓవర్లలోనే 83 పరుగులు చేసిందని ప్రస్తావించాడు.బెంగళూరు బౌలర్లు అల్జారీ జోసెఫ్,మహ్మద్ సిరాజ్,యష్ దయాల్‌లను కోల్‌కతా బ్యాటర్లు చితకబాదారని పేర్కొన్నాడు.మరోవైపు కోల్‌కతా మెంటార్ గౌతమ్ గంభీర్‌ను కూడా ప్రశంసించాడు.

నరైన్‌ను ఓపెనర్‌గా పంపడం,ఆండ్య్రూ రస్సెల్‌ను డెత్-ఓవర్ బౌలర్‌గా ప్రయోగించిన ఎత్తుగడలు బాగున్నాయని పేర్కొన్నాడు.కాగా గత శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా చేతిలో బెంగళూరు ఓటమిపాలైంది.కోహ్లీ వరుసగా రెండవ అర్ధ సెంచరీ నమోదు చేసినప్పటికీ..ప్రత్యర్థి జట్టు కోల్‌కతా బ్యాటర్లు, సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్‌ చెలరేగడంతో 180 పరుగుల పైచిలుకు ఆ జట్టు లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది.