Mayank Yadav Outshines Rs. Crore Mitchell Star Claims Irfan Pathan
స్పోర్ట్స్

IPL 2024 : కోట్లు ఖర్చు పెట్టే ప్లేయర్ కంటే ఆ కుర్రాడే బెటర్

Mayank Yadav Outshines Rs. Crores Mitchell Star Claims Irfan Pathan: లక్నో సూపర్ జెయింట్స్ కుర్రాడు మయాంక్ యాదవ్‌ను టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఆకాశానికి ఎత్తేశాడు. ఐపీఎల్ వేలంలో రికార్డు ధర పలికిన కేకేఆర్ ప్లేయర్ మిచెల్ స్టార్క్ కంటే మయాంక్ యాదవ్ ఉత్తమంగా రాణిస్తున్నాడని అన్నాడు. ఇటీవల జరిగిన వేలంలో స్టార్క్ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.24.75 కోట్లు ఖర్చు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో ఓ ఆటగాడికి పలికిన అత్యంత గరిష్ఠ ధర ఇదే కావడం గమనార్హం.

కానీ ఈ సీజన్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన మిచెల్ స్టార్క్ దారుణంగా ఫెయిల్యూర్‌ అయ్యాడు. ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయాడు. కనీసం పొదుపుగా కూడా బౌలింగ్ చేయలేదు. ఎనిమిది ఓవర్లలో 100 రన్స్‌తో సెంచరీ కొట్టేశాడు. మరోవైపు మయాంక్ యాదవ్‌ను 2022 సీజన్ వేలంలో లక్నో రూ.20 లక్షల కనీస ధరకు దక్కించుకుంది. ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌తో ఐపీఎల్‌లో మయాంక్ అరంగేట్రం చేశాడు.

Read Also: బాబోయ్..! మరీ ఇంత ఘోరమా..

పంజాబ్ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసి 27 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. నిన్న ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లోనూ మూడు వికెట్లు పడగొట్టాడు. ఈసారి నాలుగు ఓవర్లు వేసి కేవలం 14 పరుగులే ఇచ్చాడు. మాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్, రజత్ పటిదార్‌ను పెవిలియన్‌కు పంపాడు. అంతేగాక ఐపీఎల్-2024లో అత్యంత వేగవంతమైన బాల్‌ని సంధించిన బౌలర్‌గా మయాంక్ రికార్డులకెక్కాడు. గంటకు 156.7 కిలోమీటర్ల వేగంతో వచ్చిన బంతిని సంధించాడు.

ఈ నేపథ్యంలో మయాంక్ కొనియాడుతూ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సీజన్‌లో మిచెల్ స్టార్క్ కంటే మయాంక్ యాదవ్ బెటర్ బౌలర్. కొత్త బౌలర్, ఎలాంటి అనుభవం లేనప్పటికీ రెండు మ్యాచ్‌ల్లో ఆరు వికెట్లు పడగొట్టాడు. ప్రపంచస్థాయి బ్యాటర్లను వణికించాడు. బ్యాటర్లు పరుగులు చేయకుండా కట్టడిచేయాలంటే ఎలాంటి బంతులు సంధించాలో అతడికి తెలుసు. అంతేగాక వికెట్లు పడగొట్టే సామర్థ్యం అతడికి ఉంది. స్టార్క్ కంటే మెరుగ్గా మయాంక్ బౌలింగ్ చేస్తున్నాడు. ప్రపంచకప్ విజేత, ఆస్ట్రేలియా మ్యాచ్ విన్నర్ అయిన స్టార్క్ లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు వేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. ధారళంగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. మరోవైపు మయాంక్ పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడని ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు