Mumbai Indians Cricket Team Series Of Failures In Ipl 2024: ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడిన ఏకైక జట్టు ముంబై ఇండియన్స్. స్టార్ ప్లేయర్స్‌తో నిండిపోయిన ఈ టీమ్‌లో అందరూ మ్యాచ్ విన్నర్లే. ముంబైతో పోరంటే ఏ జట్టుకైనా ఒణుకు పుట్టాల్సిందే. అలాంటి జట్టు ఈ ఐపీఎల్‌లో ఘోరంగా ఆడుతోంది. 3 మ్యాచ్‌లు ఆడితే అన్నీ ఓటములే. ప్రస్తుతానికి పాయింట్ల లిస్ట్‌లో ఆఖరి స్థానంలో ఉంది.
మరో ఒకట్రెండు ఓటములు ఎదురైతే ట్రోఫీ మాట అటుంచండి. ప్లే ఆఫ్స్‌కి చేరుకోవడం కూడా కష్టమే. ఇంత బాగా ఆడే ప్రపంచస్థాయి ఆటగాళ్లతో నిండిన ఈ జట్టు.. హ్యాట్రిక్ ఓటములు మూటగట్టుకోవడం ఫ్యాన్స్‌ని తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ప్రత్యర్థికి రికార్డు స్కోరు సమర్పించుకొంది. సోమవారం రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అయితే ముంబై బ్యాటర్లు మరీ ఘోరంగా ఆడారు. పట్టుమని 130 పరుగులు కూడా చేయలేకపోయారు. బౌలర్లు తేలిపోయారు. హార్దిక్ పాండ్యా క్యాచ్‌లు వదిలేశాడు. ఎలా చూసినా రేటింగ్ కంటే రేంజ్ గేమ్‌ని కనబరుస్తున్నారు.
Read Also: ధోనీ అదిరిపోయే హిట్టింగ్, ఏంటీ భయ్యా ఆ పవర్ స్ట్రోక్స్.!
రోహిత్ ఇంకా తన క్లాస్ చూపించలేదు. కిషన్ ఫామ్‌లో లేడు. తిలక్ వర్మ ఆడుతున్నా సరిపోవడం లేదు. సూర్య కుమార్ లాంటి వాళ్లు అందుబాటులో లేరు. బుమ్రా మ్యాజిక్ ఇంకా మొదలవ్వలేదు. అసలు హార్దిక్ పాండ్యా ఏం చేస్తున్నాడో తనకే అర్థం కావడం లేదు. జట్టుని ఆదుకోవాల్సిన కీలక సమయంలో ఔట్ అయి ముంబైపై మరింత ఒత్తిడి పెంచుతున్నాడు. ఆటగాళ్ల వైఫల్యంతో పాటు జట్టులో టీమ్ స్పిరిట్ లోపించడం కూడా ఓకారణంగా కనిపిస్తోంది. కెప్టెన్సీ మార్పు జట్టులో చాలామంది ఆటగాళ్లకు నచ్చలేదు. ఇంకా తమ కెప్టెన్ రోహిత్ అనే అనుకొంటున్నారు. హార్దిక్ కూడా సీనియర్లని తగిన రీతిలో గౌరవించడం లేదన్న విమర్శ ఉంది. అందరినీ కలుపుకొని పోవడంలో హార్దిక్ విఫలం అవుతున్నాడు. అసలు హార్దిక్ కెప్టెన్సీకి తగిన వ్యక్తా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.