Mahi Is Chilling, The Video Is Going Viral
స్పోర్ట్స్

MS Dhoni: చిల్ అవుతున్న మహీ, వైరల్ అవుతున్న వీడియో…

Mahi Is Chilling, The Video Is Going Viral: ఐపీఎల్ 2024 సీజన్‌ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ నిష్క్రమించడంతో ఆ జట్టు దిగ్గజ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీ చిల్ అవుతున్నాడు. మళ్లీ తన సాధారణ జీవితం గడిపేందుకు రెడీ అయిపోయాడు.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో సీఎస్‌కే 27 రన్స్ తేడాతో ఓటమిపాలైంది. సీఎస్‌కే ప్లే ఆఫ్స్ చేర్చేందుకు ధోనీ, జడేజా చివరి వరకు చేసిన పోరాటం ఫలించలేదు.

ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే తన స్వస్థలం రాంచీకి వెళ్లిన ధోనీ, సోమవారం తనకిష్టమైన బైక్ ‌పై అలా షికారుకు వెళ్లాడు. ఓవైపు ధోనీ రిటైర్‌మెంట్ గురించి జోరుగా చర్చ జరుగుతుండగా, మరోవైపు ధోనీ మాత్రం ఇవేవి పట్టించుకోకుండా చిల్ అవుతున్నాడు. ధోనీ బైక్ రైడింగ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. హెల్మెట్ ధరించి తన యమహా బైక్‌పై ధోనీ షికారుకు వెళ్లాడు. అతను తన బైక్‌పైకి ఫామ్ హౌస్‌లోకి తిరిగి వస్తుండగా ఒకరు తమ మొబైల్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకోగా ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. ఈ సీజన్‌లో మొత్తం 14 మ్యాచ్‌లు ఆడిన ధోనీ 220.55 స్ట్రైక్‌రేట్‌తో 161 రన్స్‌ చేశాడు.

Also Read: ధోనీ మరో సీజన్ ఆడాలని కోరుకుంటున్న ప్లేయర్‌

ఈ సీజన్‌తోనే ధోనీ ఐపీఎల్ కెరీర్ ముగిసిందనే చర్చ జోరుగా సాగుతోంది. అయితే ఐపీఎల్ రిటైర్‌మెంట్‌పై ధోనీ ఎలాంటి అనౌన్స్‌మెంట్‌ చేయలేదు.గత సీజన్‌లో మాత్రం చెన్నై వేదికగా ఫ్యాన్స్ సమక్షంలో ఆటకు వీడ్కోలు పలుకుతానని చెప్పాడు.ఆ క్రమంలోనే చెన్నై వేదికగా జరిగే ఈ సీజన్ ఫైనల్ ఆడి ఆటకు గుడ్‌బై చెప్పాలని ధోనీ ప్లాన్ చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆర్‌సీబీ రూపంలో సీఎస్‌కే‌కు బిగ్ షాక్ తగలడంతో ధోనీ రిటైర్మెంట్ వ్యూహాలు దెబ్బతిన్నాయి. వచ్చే ఏడాది మెగా వేలం జరగనున్న నేపథ్యంలో ధోనీ ఐపీఎల్‌లో కొనసాగడం కష్టంగా కనిపిస్తోంది. ఒక్క సీజన్ కోసం ధోనీని రిటైర్‌మెంట్ చేసుకుంటే జట్టుకు తీవ్ర నష్టం జరగనుంది.మరోవైపు సీఎస్‌కే మేనేజ్‌మెంట్ సైతం ధోనీ రిటైర్‌మెంట్‌పై క్లారిటీ లేదని ప్రకటించింది. రిటైర్‌మెంట్ నిర్ణయాన్ని వెల్లడించేందుకు కొంత టైం కావాలని ధోనీ చెప్పాడని పేర్కొంది.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!