iyer,rahane
స్పోర్ట్స్

KKR Captain: కేకేఆర్ కెప్టెన్ రహానే..వైస్ కెప్టెన్ అయ్యర్

KKR Captain: కెప్టెన్ ఎవరౌతారు..? వెటరన్ రహానే (Rahane) లేదంటే యంగ్ వెంకటేశ్ అయ్యర్ (Venkatesh Iyer).. వీరిలో ఎవరిని ఎంచుకోవాలి..? లేదంటే విదేశీ ప్లేయర్ ను కెప్టెన్ గా చేస్తారా..? చేస్తే సునీల్ నారాయణ్ లేదంటే ఆండ్రీ రస్సెల్ అన్న ఊహాగానాలూ వినిపించాయి. గత సీజన్ లో కేకేఆర్ జట్టుకు టైటిల్ అందించిన శ్రేయస్‌ అయ్యర్‌ను రిటైన్ చేసుకోకుండా కోల్ కతా జట్టు  మేనేజ్‌మెంట్ షాకిచ్చింది. అంతేకాదు మెగా వేలంలోనూ అతన్ని బై బ్యాక్ చేయలేదు. కానీ అనూహ్యంగా  యువ బ్యాటర్ వెంకటేశ్‌ అయ్యర్‌ ను 23.75 కోట్లకు సొంత చేసుకుంది. అప్పట్లో అతన్ని రిటైన్ చేసుకున్నా ఇంత చెల్లించాల్సిన అవసరం రాకుండా పోయేదన్న వ్యాఖ్యలూ వినిపించాయి.

ఇటీవలి కాలంలో దేశవాళీ టోర్నీల్లో అజింక్యా రహానే ఇరగదీస్తున్నాడు. రెడ్ బాల్, వైట్ బాల్ తేడా లేకుండా తన కెరీర్ లోనే అత్యుత్తమ ఫాంతో కనిపించాడు. అంతేకాదు ముంబై జట్టు కెప్టెన్ గానూ అతను రాణించాడు. దీంతో కేకేఆర్ మేనేజ్ మెంట్ సీనియారిటీకి ప్రయారిటీ ఇస్తూ .. వెటరన్ అజింక్యా రహానె ను కెప్టెన్ గా అనౌన్స్ చేసింది.  ఇక యువ వెంకటేశ్ అయ్యర్ ను వైస్ కెప్టెన్ గా ఎంపిక చేసింది. ఈ మేరకు ఫ్రాంఛైజీ సోమవారం తమ అధికారిక ఎక్స్‌’ఖాతాలో ప్రకటించింది.కాగా, చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన రెండు వారాల్లోపే క్రికెట్ అభిమానులను సందడి  చేసేందుకు ఐపీఎల్‌ (IPL 18th) 18వ ఎడిషన్‌ ప్రారంభం కానుంది. గతంలో రహానే 185 ఐపీఎల్ మ్యాచ్ ల్లో 123.42 స్ట్రైక్ రేట్, 30.14 యావరేజితో 4642 పరుగులు చేశాడు. ఇందులో 30 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ కూడా ఉండడం విశేషం. ఐపీఎల్ లో రహానే రికార్డు మెరుగ్గానే ఉంది. తాజాగా కొత్తగా కెప్టెన్ హోదాలో అతను ఈ సీజన్ లో ఎలా ఆడుతాడో వేచి చూడాల్సిందే.

Also Read: Ind vs Aus: మాక్స్ వెల్ వికెట్ అతడిదే..

ఈ సీజన్ ఐపీఎల్ లో డిఫెండింగ్ చాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ కొత్త జెర్సీతో బరిలోకి దిగుతోంది. కేకేఆర్ జెర్సీపై కొత్తగా మూడు స్టార్లను యాడ్ చేసింది.  ఐపీఎల్ లో కేకేఆర్ జట్టు 2012,2014,2024 లో టైటిల్ విజేతగా నిలిచింది. ఇందుకు గుర్తుగా ఆ మూడు స్టార్లను యాడ్ చేసినట్లు తెలిపింది. ఇక  గెలిచిన మూడు టైటిళ్లకు బెంగాలీలో  కర్బో (ప్రదర్శన), లోర్బో(పోరాటం), జీత్బో(విజయం) అని పేరు పెట్టినట్లు కేకేఆర్ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్ బిందా దే తెలిపారు. కొత్త కెప్టెన్ రహానే సారథ్యంలో మరోసారి విజేతగా కేకేఆర్ నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.  ఇక ఐపీఎల్ లో కేవలం ఢిల్లీ మాత్రమే కెప్టెన్ ను ఇంకా ఎంపిక చేయలేదు. ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ (Akshar Patel) లేదంటే కేఎల్ రాహుల్ (Rahul) ను సారథిగా ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.

 

Just In

01

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు