IPL 2024 | ఆర్‌సీబీపై సంచలన వ్యాఖ్యలు చేసిన టెన్నిస్ ప్లేయర్‌
Indian Tennis Star Mahesh Bhupathi Slams Rcb Bcci Needs
స్పోర్ట్స్

IPL 2024: ఆర్‌సీబీపై సంచలన వ్యాఖ్యలు చేసిన టెన్నిస్ ప్లేయర్‌

Indian Tennis Star Mahesh Bhupathi Slams Rcb Bcci Needs: ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు అంతగా కలిసొచ్చినట్లు లేదు. ఎందుకంటే వరుసగా పరాజయాల పరంపర కంటిన్యూ అవుతోంది. గతరాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌ చేతిలో 25 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐపీఎల్ హిస్టరీని బద్దలు కొడుతూ 287 రన్స్‌ బాదడంతో ఆర్సీబీపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఆ జట్టు బౌలింగ్ ఎంత వీక్‌గా ఉందో ఈ మ్యాచ్ ద్వారా మరోసారి రుజువైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. క్రికెటర్లతో పాటు ఇతర క్రీడాకారులు కూడా రియాక్ట్ అయ్యారు.

తాజాగా భారత టెన్నిస్ దిగ్గజం మహేష్ భూపతి ఆర్‌సీబీ ఆట తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుని కొత్త యాజమాన్యానికి విక్రయించాలని, ఈ మేరకు బీసీసీఐ ప్రక్రియను ప్రారంభించాలని మహేశ్ భూపతి వ్యాఖ్యానించాడు. ఆర్‌సీబీ ప్రస్తుత పరిస్థితి విషాదకరమని, బీసీసీఐ రంగంలోకి దిగాల్సిన టైం వచ్చిందని తాను భావిస్తున్నట్టు పేర్కొన్నాడు. సరైన ఫ్రాంచైజీని నిర్మించడంపై శ్రద్ధ వహించే కొత్త యజమానికి జట్టు విక్రయించే దిశగా బీసీసీఐ అడుగులు వేయాలని భూపతి అభిప్రాయపడ్డాడు. క్రికెట్ కోసం బీసీసీఐ ఈ చర్య తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వ్యాఖ్యానించాడు.

Also Read:తన కోసం నేను ఏదైనా చేస్తా..

క్రికెట్ ఆట, ఐపీఎల్, ఫ్యాన్స్, ఆటగాళ్ల కోసం ఆర్‌సీబీ విక్రయాన్ని బీసీసీఐ చేపట్టాల్సిన అవసరం ఉందని, తాను ఈ విధంగా భావించడం శోచనీయమే అయినప్పటికీ తప్పదని మహేశ్ భూపతి ట్వీట్ పేర్కొన్నాడు. కాగా ఆర్‌సీబీ ప్రస్తుత సీజన్‌లో అత్యంత కఠినమైన పరిస్థితిని ఎదుర్కుంటోంది. ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు కేవలం ఒకే ఒక్క మ్యాచ్ గెలిచింది. 6 మ్యాచ్‌ల్లో ఓటమి పాలై పాయింట్ల పట్టికలో చిట్టచివరన నిలిచింది. లూకీ ఫెర్గూసన్, రీస్ టోప్లీ వంటి ప్రపంచ స్థాయి బౌలర్లు ఆ జట్టులో ఉన్నప్పటికీ ప్రత్యర్థులకు ఆ జట్టు ధారాళంగా పరుగులు సమర్పించుకుంటోంది.

Just In

01

BiggBoss9 Prize Money: బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్‌కు వచ్చే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.. సర్‌ప్రైజ్ గెస్ట్ ఎవరంటే?

Kerala News: కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హవా.. పంచాయతీ ఎన్నికల్లో యూటీఎఫ్ సత్తా

Brown University: అమెరికాలో కాల్పులు.. ఇద్దరు మృతి, ఎనిమిది మంది పరిస్థితి విషమం

Etela Rajender: నేను ఏ పార్టీలో ఉన్నానో వారే చెప్పాలి: ఈటల రాజేందర్

Overdraft vs Personal Loan: ఓవర్‌డ్రాఫ్ట్ vs పర్సనల్ లోన్.. మీ డబ్బు అవసరంలో ఏది సరైన ఎంపిక?