Preity zinta comment on Rohit sharma(Cricket news today telugu): పంజాబ్ కింగ్స్ కో ఓనర్ ప్రీతీ జింటా సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మని ఐపీఎల్ 2025 మెగా వేలంలోకి వస్తే అతన్ని తీసుకునేందుకు తన జీవితాన్నే పణంగా పెడుతానని తెలిపింది. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.ముందు నుండి తమ జట్టు వరుస పరాజయాలతో తీవ్ర నిరాశకు గురైన ప్రీతీ జింటా.. అఫీషియల్ బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌తో ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసింది.
తమ జట్టుకు నిలకడగా ఆడుతూ ఛాంపియన్ మైండ్ సెట్ కలిగిన కెప్టెన్ అవసరం ఉందని ప్రీతీ జింటా తన ఓపీనియన్‌ని తెలిపింది. వచ్చే ఏడాది జరిగే మెగా వేలంలోకి రోహిత్ శర్మ వస్తే అతన్ని తీసుకునేందుకు తన జీవితాన్నే బెట్ కాస్తానని తెలిపింది. రోహిత్ శర్మ మెగా వేలంలోకి వస్తే అతన్ని కొనుగోలు చేసేందుకు నా సర్వస్వం బెట్ కాస్తాను. జట్టులో నిలకడను తీసుకురావడంతో పాటు ఛాంపియన్ మైండ్ సెట్ కలిగిన సారథిని మేం మిస్సవుతున్నామని తెలిపింది. ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతల నుంచి తనను తప్పించడంపై రోహిత్ శర్మ అసంతృప్తిగా ఉన్నాడనే ఆ జట్టును వీడాలనుకుంటున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది.
Also Read: పంజాబ్‌పై సన్ రైజర్స్ హైదరాబాద్ విక్టరీ
ఈ క్రమంలోనే లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటికే రోహిత్ శర్మ కోసం తాము ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు చెప్పాయి.ఐపీఎల్ 2024 సీజన్‌లో 6 మ్యాచ్‌ల్లో 2 మాత్రమే విన్ అయ్యింది. మెయిన్‌గా గత రెండు మ్యాచ్‌ల్లో విజయం ముంగిట డీలా పడింది. తమ కెప్టెన్ శిఖర్ ధావన్ గాయంతో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతని గైర్హాజరీలో సామ్ కరణ్ జట్టును నడిపించాడు. అయితే శిఖర్ ధావన్ మరో వారం రోజుల పాటు ఆడలేడని ఆ జట్టు పేర్కొంది.రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ జట్టు 8 వికెట్లకు 147 రన్స్ చేసింది. అనంతరం రాజస్థాన్ జట్టు 7 వికెట్లు కోల్పోయి ఒక్క బంతి మిగిలి ఉండగానే లక్ష్యాన్ని అందుకుంది. షిమ్రాన్ హెట్‌మైర్ సూపర్ బ్యాటింగ్‌తో రాజస్థాన్ రాయల్స్ విజయాన్ని సాధించి హౌరా అనిపించింది.