Indian Sports Girl Who Achieved World Record
స్పోర్ట్స్

World Record: ప్రపంచ రికార్డు సాధించిన భారత క్రీడాకారిణి

Indian Sports Girl Who Achieved World Record: ప్రపంచ యూత్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ 40 కేజీల ఛాంపియన్‌ షిప్‌ విభాగంలో భారత్‌కి చెందిన క్రీడాకారిణి ప్రీతిస్మిత భోయ్‌ అద్భుతమైన ప్రతిభని కనబరిచి మూడు స్వర్ణ పతకాలను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో క్లీన్‌ అండ్‌ జెర్క్‌ విభాగంలో నూతన అధ్యయనానికి స్వాగతం పలికి ప్రపంచ రికార్డు సృష్టించింది.

మహిళల 40 కేజీల విభాగంలో బరిలోకి దిగిన ఒడిశాకు చెందిన 15 ఏళ్ల ప్రీతిస్మిత మొత్తం 133 కేజీలు క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 76 కేజీలు, స్నాచ్‌లో 57 కేజీలు) బరువెత్తి విజేతగా నిలిచింది. మూడు విభాగాల్లో క్లీన్‌ అండ్‌ జెర్క్‌, స్నాచ్‌, టోటల్‌) వేర్వేరుగా పతకాలు అందించగా ఈ మూడింటిలోనూ ప్రీతిస్మిత అగ్రస్థానంలో నిలిచి మూడు పసిడి పతకాలను సొంతం చేసుకుంది.

Also Read:కొత్త కోచ్ కోసం బీసీసీఐ వేట

40 కేజీల విభాగంలోనే పోటీపడ్డ భారత లిఫ్టర్‌ జోష్నా సబర్‌ రెండు రజతాలు, ఒక కాంస్యం సాధించింది. 45 కేజీల విభాగంలో పాయల్‌ ఒక రజతం, రెండు కాంస్యాలు గెలిచింది. పురుషుల 49 కేజీల విభాగంలో బాబూలాల్‌ రెండు కాంస్య పతకాలు దక్కించుకున్నాడు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!